Blast in Pakistan: ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 ) నేపథ్యంలో… పాకిస్తాన్ దేశంలో Pakisthan ) పెను ప్రమాదం చోటుచేసుకుంది. పాకిస్తాన్ దేశంలో భారీ బ్లాస్టింగ్ ( Bomb blast) చేశారు ఉగ్రవాదులు. పాకిస్తాన్ లోని పేషావర్ అనే ప్రాంతంలో.. కాసేపటి క్రితమే బాంబు బ్లాస్ట్ జరిగింది. ఈ పెను ప్రమాదంలో.. ఏకంగా 5 మంది మరణించారు. వందలాది మంది గాయాల పాలు అయ్యారు. చనిపోయిన వారిలో, గాయపడ్డ వారిలో విదేశాలకు కూడా చెందినవారు ఉన్నారట. బాంబు బ్లాస్ట్ జరగగానే అలర్ట్ అయిన పాకిస్తాన్ ప్రభుత్వం… వెంటనే సహాయక చర్యలకు పూనుకుంది. చాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్న నేపథ్యంలోనే…. ఈ బాంబు బ్లాస్ట్ జరగడంతో… పాకిస్తాన్ ఉన్న ఆరు విదేశీ జట్లు గత గజవణికి పోతున్నాయి.
Also Read: PSL – IPL: పాకిస్తాన్ కు మరో ఎదురు దెబ్బ.. PSL ను దెబ్బ కొట్టిన ఐపీఎల్ 2025 ?
అయితే… పాకిస్తాన్ లోని ఓ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి సమీపంలోనే ఈ బ్లాస్టింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు గానీ… స్టేడియం కు సమీపంలోనే బ్లాస్టింగ్ జరిగినట్లు చెబుతున్నారు. అయితే ఈ బ్లాస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో…. పాకిస్తాన్ లో పర్యటించిన ఆరు విదేశీ జట్లు… వణికిపోతున్నాయి. వెంటనే పాకిస్తాన్ దేశాన్ని వదిలేసి దుబాయ్ కి.. వెళ్లిపోవాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. ఇంత త్వరగా పాకిస్తాన్ దేశాన్ని వదిలి… దుబాయ్ కి చేరితే అంత మంచిదని అనుకుంటున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కంటే ముందు…. భారత క్రికెట్ నియంత్రణ మండలి కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పింది. పాకిస్తాన్ దేశంలో ఐసీసీ టోర్నమెంట్లు నిర్వహిస్తే బ్లాస్టింగ్ సమస్యలు వస్తాయని… అందుకే అక్కడ పెట్టొద్దని మొత్తుకుంది. కానీ పాకిస్తాన్లోనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ టోర్నమెంట్ పెట్టింది. అయితే టీమిండియా కు మాత్రం మినహాయింపు ఇచ్చింది. హైబ్రిడ్ మోడల్ లో భాగంగా… దుబాయ్ వేదికగా టీమిండియా మ్యాచ్లు నిర్వహించేలా ప్లాన్ చేసింది.
Also Read: Danni Wyatt on Virat: కోహ్లీ నన్ను పెళ్లి చేసుకో.. ఇంగ్లాడ్ ప్లేయర్ సంచలనం ?
కానీ మిగిలిన జట్లన్నీ కచ్చితంగా పాకిస్తాన్ వెళ్లి ఆడాల్సిందేనని తేల్చి చెప్పింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. ఇక ఐసీసీ ఆదేశాల మేరకు మిగిలిన జట్లు అన్ని పాకిస్తాన్ వెళ్లి టోర్నమెంట్ ఆడాయి. ఇందులో కొన్ని ఎలిమినేట్ అయితే మరికొన్ని సెమీఫైనల్ వరకు చేరాయి. ఇలాంటి నేపథ్యంలో పేషావర్ ప్రాంతంలో బాంబు బ్లాస్టింగ్.. జరగడం కలకలం రేపింది. ఈ బ్లాస్టింగ్ జరగగానే విదేశీ క్రికెటర్లతో పాటు అక్కడికి వెళ్లిన క్రికెట్ అభిమానులు కూడా గజ గజ వణికిపోతున్నారు. మొన్నటికి మొన్న విదేశీ క్రికెట్ అభిమానులను కిడ్నాప్ చేస్తామని… ఉగ్రవాదులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. కానీ ఇంతలోనే బ్లాస్టింగ్ కూడా చేశారు ఉగ్రవాదులు. ఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటును వెంటనే అక్కడి నుంచి తరలించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
BIG BREAKING NEWS 🚨 B0mb blast in Pakistan amidst Champions Trophy Match.
At Least 5 Killed, Several Injured in Blast at Pro-Taliban Seminary Near Peshawar.
All Players of all countries are worried.
Due to security reasons only, India refused to play in Pakistan and its… pic.twitter.com/HrHRclSpbQ
— Times Algebra (@TimesAlgebraIND) February 28, 2025