BigTV English

Pakistan Stadium: పాకిస్థాన్ స్టేడియంపై ట్రోలింగ్.. బాత్రూంలో వాడే కుర్చీలంటూ ?

Pakistan Stadium: పాకిస్థాన్ స్టేడియంపై ట్రోలింగ్.. బాత్రూంలో వాడే కుర్చీలంటూ ?

Pakistan Stadium: ఛాంపియన్స్ ట్రోఫీ – 2025 పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ లోని మూడు ప్రధాన క్రికెట్ స్టేడియాలు రావల్పిండి, లాహోర్, కరాచీ వేదికలుగా ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లు జరగబోతున్నాయి. అయితే ఈ మూడు స్టేడియాలు అంతర్జాతీయ క్రీడలు నిర్వహించేందుకు ఇంకా సిద్ధం కావాల్సి ఉంది. లాహోర్ లోని గడాఫి స్టేడియం వంటి కొన్ని ప్రధాన వేదికలు ఇప్పటికీ పూర్తికాలేదు.


Also Read: Maheesh Theekshana: పెళ్లి చేసుకున్న మాజీ చెన్నై ప్లేయర్.. ఫోటోలు వైరల్

ఇప్పుడిప్పుడే పనులు వేగవంతం అవుతున్నాయి. గ్రౌండ్ లో ఫ్లడ్ లైట్లు, షెడ్లు, అభిమానుల కోసం కుర్చీలు వంటి వాటిని అమరుస్తున్నారు. ఈ క్రమంలో డిజిటల్ మీడియాని స్టేడియాలలోకి రాకుండా నియంత్రిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి). ఎందుకంటే.. కొంతమంది వ్యక్తులు అనుమతులు లేకుండా స్టేడియం లోపలికి వెళ్లి నిరంతరం వీడియోల చిత్రీకరణ, ఫోటోలు తీయడం, స్టేడియం నిర్మాణ పనులను ప్రదర్శించడంతో తమకు చిరాకుగా మారిందని.. అందుకే మీడియాని నియంత్రిస్తూ నిర్ణయం తీసుకున్నామని పిసిబిలోని ఓ అంతర్గత అధికారి పేర్కొన్నారు.


అయితే లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో ప్రస్తుతం ప్రేక్షకులు మ్యాచ్ ని వీక్షించేందుకు కూర్చునే కుర్చీలను ఏర్పాటు చేస్తోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. ఈ కుర్చీలపై ట్రోలింగ్ మొదలుపెట్టారు కొందరు నెటిజెన్స్. స్టేడియంలో ప్లాస్టిక్ కుర్చీలు వేస్తున్నారని.. అవి చిన్న పిల్లలు ఆడుకునే కుర్చీలలాగా ఉన్నాయని సెటైర్లు పేల్చుతున్నారు.

అంతేకాదు ఆ కుర్చీలకు పాకిస్తాన్ జెండా కలర్ వేస్తున్నారు. ఈ కుర్చీలో కూర్చున్న వ్యక్తి లేచి నిలబడితే.. ఆ కుర్చీ వెంటనే మూసుకుపోతుంది. దీంతో ఈ కుర్చీలు బాత్రూంలో వాడే కుర్చీలలాగా ఉన్నాయని సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి ఈ కుర్చీల గోల ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లాహోర్ లో ఉన్న ఈ గడాఫీ స్టేడియాన్ని లిబియా మాజీ అధినేత మువమ్మర్ గడాఫీ పేరు మీద 1974లో నిర్మించారు. 50 ఏళ్ల తర్వాత ఈ స్టేడియం పేరు మార్చడానికి ఓ ప్రైవేట్ బ్యాంకుతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒప్పందం కుదుర్చుకుంది.

Also Read: Rinku Singh: రింకూ సింగ్ పెళ్లిని అడ్డుకుంటున్న ప్రియా సరోజ్‌ తండ్రి ?

దీంతో గడాఫీ స్టేడియం స్థానంలో ఆ ప్రైవేట్ బ్యాంకు పేరుతో స్టేడియాన్ని పిలుస్తారు. ఇందుకోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు ఏకంగా 100 కోట్ల పాకిస్తానీ రూపాయలు రానున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రక్రియ పూర్తికాకముందే ఛాంపియన్ ట్రోఫీ 2025 సమీపించడంతో పాకిస్తాన్ పరిస్థితి మాత్రమే కాదు.. అక్కడి క్రికెట్ బోర్డు ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉండడంతో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ఇలా నామమాత్రంగా పనులను చేపడుతున్నారని విశ్లేషకులు చెబుతున్న మాట.

 

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Ab Cricinfo (@ab_cricinfo)

Related News

BCCI : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు BCCI బిగ్ షాక్…2027 వరల్డ్ కప్ కంటే ముందే కుట్రలు !

Sanju Samson – CSK : సంజూకు ఝలక్.. CSK లోకి అతను వచ్చేస్తున్నాడు!

Digvesh Rathi : దిగ్వేష్ ఒక్కడే పిచ్చోడు అనుకున్నాం.. కానీ వాడిని మించినోడు వచ్చాడు.. ఈ వీడియో చూస్తే పిచ్చెక్కి పోవాల్సిందే

Pakistan Cricketer : ఇంగ్లాండ్ ను ఓడించేందుకు వాజిలిన్ వాడారు…. భారత బౌలర్ల పై పాక్ సంచలన ఆరోపణలు

Mohammed Siraj : ఇండియా గడ్డపై అడుగుపెట్టిన సిరాజ్… ఎయిర్ పోర్టులో ఆయన ఫాలోయింగ్ చూడండి

Jasprit Bumrah: టీమిండియాకు దరిద్రంగా మారిన బుమ్రా.. అతడు ఆడితే ఓటమే.. ఇదిగో లెక్కలు!

Big Stories

×