Movie Reviews: రివ్యూలు అనేవి సినిమాలపై చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. ఒక సినిమా విడుదల అవ్వగానే దాని రివ్యూలు చూసి థియేటర్‌కు వెళ్లాలా వద్దా అని ఆలోచించే ప్రేక్షకులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి రివ్యూల వల్ల తమ సినిమాలపై భారీ ఎఫెక్ట్ పడుతుందని మేకర్స్ కూడా వాపోయారు. అందుకే అన్ని సౌత్ ఇండస్ట్రీలు కలిపి ఒక నిర్ణయానికి వచ్చారు. ముందుగా కోలీవుడ్, మాలీవుడ్‌లో మొదలుపెట్టిన ఒక భారీ ప్లాన్‌ను ఇప్పుడు టాలీవుడ్ కూడా ఫాలో అవ్వడానికి సిద్ధమయినట్టు ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలిపారు. దిల్ రాజు ఇచ్చిన ప్రకటన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది చాలా మంచి నిర్ణయమని మూవీ లవర్స్ ఫీలవుతున్నారు.
ఇక్కడ కూడా అదే పాలసీ
ఇప్పటికే కేరళ, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో మూవీ థియేటర్ల బయట యూట్యూబ్ ఛానెళ్లు నిలబడి బయటికి వచ్చే ప్రేక్షకులను రివ్యూలు అడిగి తెలుసుకోవడం ఆపేయాలని ప్రభుత్వాలు ప్రకటించాయి. దీంతో సినిమాల లాంగ్ టైమ్ రన్‌ను కాపాడడానికి ఇది మంచి నిర్ణయమని మూవీ లవర్స్ ఫీలయ్యారు. ఈ ఐడియా ఏదో బాగుందని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు కూడా ఫీలయ్యారు. అందుకే ఆ ఐడియాను తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రవేశపెట్టాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. తాజాగా ఈ ప్లాన్ త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రారంభం కానుందని ఆయన ప్రకటించారు.
Also Read: తమిళ చిత్ర సీమ షాకింగ్ డెసిషన్… ఇకపై రివ్యూవర్లకు ఆ ఛాన్స్ లేదు
త్వరలోనే ప్రకటన
‘‘కేరళ, తమిళనాడు లాగానే థియేటర్ల దగ్గర రివ్యూలు తీసుకోవడం అనేది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా రివ్యూలను బ్యాన్ చేస్తున్నాం. ఎగ్జిబిటర్లు ఇప్పటికే ఈ నిర్ణయం తీసేసుకున్నారు. త్వరలోనే ఈ విషయాన్ని ఫిల్మ్ ఛాంబర్ కూడా అధికారికంగా ప్రకటించనుంది’’ అని దిల్ రాజు (Dil Raju) తెలిపారు. దీంతో తెలుగు మూవీ లవర్స్ అందరికీ చాలా రిలీఫ్ ఇచ్చినట్టు అయ్యింది. ఈరోజుల్లో మార్నింగ్ షో పూర్తవ్వగానే సినిమా ఎలా ఉంది అనే టాక్ బయటికి వచ్చేస్తుంది. ఒకవేళ మూవీ యావరేజ్‌గా ఉన్నా ఏమీ బాలేదంటూ చాలామంది ప్రేక్షకులు రివ్యూలు ఇవ్వడంతో ఆ సినిమాకు రెండోరోజు నుండే ప్రేక్షకులు రావడం తగ్గిపోతుంది. అందుకే రివ్యూలపై ఇలాంటి నిర్ణయం మంచిదే అని అనుకుంటున్నారు.
ప్యాన్ ఇండియా సినిమాలపై ఎఫెక్ట్
రివ్యూల వల్ల బలయిపోయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ప్యాన్ ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాలపై రివ్యూల ఎఫెక్ట్ భారీగా ఉంటుంది. అలాంటి సినిమాలు కొన్నిరోజులు థియేటర్లకు సక్సెస్‌ఫుల్‌గా రన్ అయితేనే దానికి తగిన లాభాలను రాబట్టగలదు. లాభాలు కాకపోయినా కనీసం బడ్జెట్‌ను తిరిగి రాబట్టాలన్నా రివ్యూలను ప్రేక్షకులు పట్టించుకోకూడదు. కానీ అలా పట్టించుకోని ప్రేక్షకులు చాలా తక్కువ. ప్యాన్ ఇండియా సినిమాలకు టికెట్ రేట్లు కూడా పెరగడంతో రివ్యూలు చూసి థియేటర్లకు వెళ్దాంలే అనుకునేవారు కూడా చాలామంది ఉంటారు. అలాంటి వారికి దిల్ రాజు నిర్ణయం షాక్ ఇచ్చింది.