BigTV English

Sankratntiki Vasthunnam : కామెడీ ప్లస్ క్రైం… సంక్రాంతికి వస్తున్నాం అసలు కథ ఇదే..

Sankratntiki Vasthunnam : కామెడీ ప్లస్ క్రైం… సంక్రాంతికి వస్తున్నాం అసలు కథ ఇదే..

Sankratntiki Vasthunnam : సీనియర్ హీరో వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావీపూడి కాంభోలో రాబోతున్న మూడో సినిమా సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి సెంటిమెంట్ తో ఈ మూవీ ఇవాళ థియేటర్లలోకి వచ్చేసింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీకి ప్రస్తుతం పాజిటివ్ టాక్ వినిపిస్తుందని తెలుస్తుంది. వెంకీ కామెడీ సినిమాకు ప్లస్ అవ్వడంతోనే సినిమాకు మంచి క్రేజ్ వచ్చిందనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. భీమ్స్ సంగీతంలో రూపొందిన పాటలు అన్నీ పాజిటివ్ రెస్పాన్స్ సంపాదించుకున్నాయి. మరి ఈ మూవీ స్టోరీ, కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం..


సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ప్రతి మూవీ కూడా మంచి టాక్ తో పాటుగా కలెక్షన్స్ ను కూడా అందుకుంటుంది. ఇక ఈ మూవీ సంక్రాంతి కానుకగా భారీ అంచనాలతో ఇవాళ థియేటర్లలోకి వచ్చింది. వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా సంక్రాంతి వస్తున్నాం ఇది.. గోదావరి గట్టు సాంగ్ యూట్యూబ్లో 100 మిలియన్ల దిశగా దూసుకుపోతుంది దాదాపు 18 ఏళ్ల బ్రేక్ తర్వాత రమణ గోగులం పాడిన పాట ఇది బ్లాక్ బస్టర్ పొంగలంటూ ఈ మూవీ కోసం వెంకటేష్ పాట పాడటం కూడా విశేషంగా జరిగింది వెంకటేశ్వర ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి కథానాయకులుగా నటించారు అనిల్ తన గత చిత్రాలకు భిన్నంగా స్క్రిప్ట్ దశలోనే సన్నివేశాలను ఎడిట్ చేశారు అందుకే అంత స్పీడ్గా షూట్ చేయగలిగారు సంక్రాంతికి వస్తున్న మొత్తం మూవీ షూట్ 72 రోజుల్లో పూర్తి చేశారు ఎఫ్2 ఎఫ్3 ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైన్లు కాగా ఇందులో క్రైమ్ ఎలిమెంట్ జోడించారు సినిమా మొత్తం నిడివి రెండు గంటల 26 నిమిషాలు వస్తే రెండు గంటల 22 నిమిషాలతో సెన్సార్కు పంపారు.. అదే విధంగా సెన్సార్ రిపోర్ట్ ను కూడా అందుకున్నారు.

సంక్రాంతికి వస్తున్నాం స్టోరీ.. 


వెంకటేష్ సస్పెన్షన్‌కు గురైన పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఆయన డ్యూటీలో ఉన్న సమయంలో ఎస్సైతో అఫైర్ కొనసాగడం.. ఆ తర్వాత ఆమెను కొన్ని కారణాల వల్ల పెళ్లి చేసుకోకపోవడమనేది ఈ సినిమాను డ్రైవ్ చేసే మరో మెయిన్ పాయింట్‌ అని చెప్పుకొంటున్నారు. ఈ పాయింట్ చుట్టే కథను, ఫ్యామిలీ డ్రామాను నడిపించారట.. పోలీసులకు సవాల్‌గా మారిన ఓ క్రైమ్ కారణంగా వెంకటేష్‌పై పడిన సస్పెన్షన్‌ను ఎత్తి వేసి.. నేరస్థులను అప్పగించే బాధ్యతను ఆయనపై పెడుతారు. ఆయన సహకరించేందుకు ఎస్పై మీనాక్షిని తోడుగా పంపాలని నిర్ణయించుకొంటారు. అయితే ఆ విషయం తెలిసిన భార్య భాగ్యంకు అనుమానాలు వస్తాయి. తన కాపురంలోకి మళ్లీ ఆయన మాజీ ప్రేయసి వస్తుందా? అని భయంతో కేసు విచారణకు తాను కూడా వస్తానని మొండికేస్తుంది. దాంతో ఇద్దరు ఆడవాళ్ల మధ్య నలిగే ఆఫీసర్‌గా ఫన్‌ను పూర్తి స్థాయిలో జనరేట్ చేశారని చెబుతున్నారు.. నలుగురు పిల్లలతో హెల్తీ కామెడీ చక్కగా పండిందనే విశ్వాసాన్ని చిత్ర యూనిట్ వ్యక్తం చేస్తున్నది. అయితే ఈ డ్రామాకు తోడుగా పాటలు కూడా ప్రేక్షకుల్లోకి వెళ్లిపోవడంతో అంచనాలు పెరిగిపోయాయి. అంచనాలకు తగినట్టుగానే ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉందనే టాక్.. ఇద్దరి మధ్య నలిగే వెంకీ? అసలు క్రైమ్ కథ ఏంటనేది ఈ మూవీలో చూడాల్సిందే.. ఇక మూవీ కలెక్షన్స్ ఏ రేంజులో ఉంటాయో చూడాలి..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×