Anupama Parameswaran: సినీ సెలబ్రిటీల విషయంలో అలా జరిగితే మాత్రం ప్రేక్షకుల ఫోకస్ చాలా ఎక్కువగా ఉంటుంది. చాలావరకు సినీ సెలబ్రిటీలు తమ రిలేషన్‌షిప్ గురించి, హార్ట్ బ్రేక్స్ గురించి ఓపెన్‌గా చెప్పడానికి ఇష్టపడరు. అలాంటి హీరోయిన్స్‌లో అనుపమ పరమేశ్వరన్ కూడా ఒకరు అయ్యిండొచ్చు. ఇప్పటికే అనుపమ రిలేషన్‌లో ఉందేమో అనే అనుమానాలు చాలామందిలో కలిగాయి. ఒకానొక సందర్భంలో తన సోషల్ మీడియా పోస్టులు చూస్తుంటే ఈ మలయాళ ముద్దుగుమ్మ అప్పుడే హార్ట్ బ్రేక్‌ను కూడా ఎదుర్కుందా అనే డిస్కషన్స్ కూడా జరిగాయి. తాజాగా అనుపమ ఇచ్చిన స్టేట్‌మెంట్ చూస్తుంటే తనకు పక్కా హార్ట్ బ్రేక్ అయ్యిందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు.
వెంటనే పారిపోండి
ఇటీవల ఒక పాపులర్ మ్యాగజిన్ ఫోటోషూట్‌లో పాల్గొన్న అనుపమ పరమేశ్వరన్.. వారితో తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ విషయాల గురించి ముచ్చటించింది. అందులో భాగంగానే ప్రేమ గురించి ప్రస్తావన వచ్చింది. ‘‘ఎప్పటికీ ప్రేమిస్తాను అనేది ప్రపంచంలోనే అతిపెద్ద అబద్ధం. అలాంటిది ఎప్పటికీ జరగదు. టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు ఏమీ ఆలోచించకండి వెంటనే పారిపోండి’’ అని తెలిపింది అనుపమ. ఇది విన్న తర్వాత కచ్చితంగా ఎవరో అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హార్ట్‌ను బ్రేక్ చేశారని, అందుకే తను ప్రేమపై నమ్మకం కోల్పోయిందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కానీ తను మాత్రం తన పర్సనల్ లైఫ్ గురించి, రిలేషన్‌షిప్ గురించి ఎప్పుడూ ఓపెన్‌గా చెప్పలేదు.
Also Read: కోలీవుడ్‌లో ఇంతే, ఈ చిన్నచూపే మారాలి.. మేకర్స్‌పై నిత్యా మీనన్ ఓపెన్ కామెంట్స్
అవన్నీ ఫేవరెట్
తన మొదటి సినిమా ‘ప్రేమమ్’లో ‘ఆలువా పూరయిదే తీరత్తు’ తన ఫేవరెట్ అని బయటపెట్టింది అనుపమ పరమేశ్వరన్. తను ఏ మూడ్‌లో ఉన్నా కూడా ‘ప్రేమమ్’ సినిమానే ముందుగా చూడడానికి ఇష్టపడతానని తెలిపింది. ఆ మూవీలో మలర్‌గా సాయి పల్లవి ఇంట్రడక్షన్ సీన్ తన ఫేవరెట్ అని చెప్పింది. ఇక ఫుడ్ విషయానికొస్తే.. తన తల్లి చేసిన అన్నం, కొబ్బరి చట్నీ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది అనుపమ పరమేశ్వరన్. బ్లూ జీన్స్, వైట్ షర్ట్ కాంబో అనేది తనకు ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పింది. ఉదయం నిద్ర లేవగానే చాలావరకు ముందుగా ఫోన్ చూడకుండా ఉంటానని తన అలవాట్ల గురించి బయటపెట్టింది అనుపమ పరమేశ్వరన్.
బాగా తింటాను
ఒకవేళ ఈ భూమి మీద ఇదే తనకు ఆఖరి రోజు అయితే తనకు నచ్చిన ఫుడ్‌ను ఎంత కావాలంటే అంత తింటానని చెప్తూ నవ్వించి అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం దాదాపు ప్రతీ సౌత్ భాషలో సినిమాలు చేస్తూ బిజీగా గడిపేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఒకప్పుడు కేవలం పక్కింటమ్మాయి పాత్రల్లోనే కనిపించిన అనుపమ.. ఇప్పుడు ఎక్కువగా బోల్డ్ పాత్రలకు ఓటు వేస్తోంది. అంతే కాకుండా ఒక సినిమాకు, మరొక సినిమాకు సంబంధం లేని స్క్రిప్ట్స్ ఎంచుకుంటూ ప్రయోగాలకు సిద్ధపడింది. ప్రస్తుతం అనుపమ చేసే ప్రయోగాలను వెండితెరపై చూడాలని తన ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2025లో అనుపమ నటించిన ఎన్నో సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.