BigTV English

OTT Movie : ప్రియుడనుకుంటే యముడయ్యాడు … ఒక అమ్మాయిని ముగ్గురుకలసి … ఈ రివేంజ్ డ్రామా ఘోరం సామి

OTT Movie : ప్రియుడనుకుంటే యముడయ్యాడు … ఒక అమ్మాయిని ముగ్గురుకలసి … ఈ రివేంజ్ డ్రామా ఘోరం సామి

OTT Movie : హాలీవుడ్ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వీటిలో రివేంజ్ యాక్షన్ సినిమాలకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఓటిటిలో కూడా ఇటువంటి సినిమాలు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో రొమాన్స్, యాక్షన్, సస్పెన్స్ అన్నీ కలిపి ఉంటాయి. చివరి వరకు ఉత్కంఠంగా సాగిపోతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…


నెట్ ఫ్లిక్స్ (Netflix) లో

ఈ ఫ్రెంచ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘రివేంజ్ ‘ (Revenge). 2017 లో వచ్చిన ఈ మూవీకి కోరాలీ ఫార్గేట్ తొలిసారిగా దర్శకత్వం వహించారు. ఇందులో మటిల్డా లూట్జ్, కెవిన్ జాన్సెన్స్, విన్సెంట్ కొలంబే, గుయిలౌమ్ బౌచెడ్ నటించారు. మిడ్‌నైట్ మ్యాడ్‌నెస్ విభాగంలో భాగంగా 42వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో, 2017 సెప్టెంబర్ 11 న ఈ మూవీ వరల్డ్ ప్రీమియర్ ప్రదర్శించబడింది. ఈ సినిమా ఫ్రాన్స్‌లో 2018, ఫిబ్రవరి,7 న థియేటర్‌లలో విడుదలైంది. విమర్శకుల నుండి ఈ సినిమా ప్రశంసలు కూడా అందుకుంది. ఒక యువతిని ముగ్గురు పురుషులు అత్యాచారం చేసి ఒక చోట చనిపోవడానికి వదిలేస్తారు. అక్కడ ఆమె కోలుకుని, వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి బయలుదేరుతుంది. ఇందులో హింస, రక్తపాత దృశ్యాలు ఉన్నందున, ఈ మూవీ ‘R’ రేటింగ్ ను అందుకుంది. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

జెన్ అనే యువతి, తన ప్రేమికుడు రిచర్డ్ తో కలిసి ఒక విహారయాత్రకు వెళ్తుంది. రిచర్డ్ కి ఇదివరకే పెళ్లి జరిగినా, జెన్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంటాడు. ఈ జంట విహారయాత్రలో ఆనందంగా గడుపుతున్న సమయంలో, రిచర్డ్ స్నేహితులు స్టాన్, డిమిత్రి అనుకోకుండా అక్కడికి వస్తారు. ఇక వీళ్ళంతా పార్టీ చేసుకుంటూ ఉంటారు. పార్టీ సమయంలో, రిచర్డ్ మళ్లీ వస్తానని బయటకు వెళతాడు. ఈ సమయం లోనే స్టాన్, జెన్‌పై లైంగిక దాడి చేస్తాడు. అతని స్నేహితుడు డిమిత్రి దీనిని చూస్తూ సైలెంట్ గా ఉంటాడు. రిచర్డ్ తిరిగి కాసేపటి తరువాత తిరిగి వచ్చినప్పుడు, జెన్ జరిగిన విషయం చెప్పి సహాయం అడుగుతుంది. కానీ అతను ఆమెను సైలెంట్ గా ఉంచడానికి ప్రయత్నిస్తాడు. ఇక జెన్ వారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ రిచర్డ్ తో సహా ఆమెను ఈ ముగ్గురు వెంబడిస్తారు. ఆమెను చంపడానికి ప్రయత్నించి, ఒక లోయలో పడేస్తారు. ఆమె చనిపోయిందని భావించి అక్కడినుంచి వెళ్లిపోతారు. అయితే ఇంత జరిగినా జెన్ బతికి ఉంటుంది. తీవ్రంగా గాయపడినప్పటికీ, ఆమె తన గాయాలను కట్టుకుని, ప్రతీకారం తీర్చుకోవాడాని మళ్ళీ వస్తుంది. ఆమె తనపై దాడి చేసిన ఈ ముగ్గుర్ని వేటాడటానికి వస్తుంది. చివరికి జెన్ ఆ ముగ్గురిపై ప్రతీకారం తీర్చుకుంటుందా ? అనే విషయాన్ని ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని చూసి తెలుసుకోండి.

Read Also : పోలీస్ నుంచి వే*శ్యగా … కిల్లర్ ని పట్టుకోవడానికి కిలాడి లేడి వేశాలు చూసి తీరాల్సిందే

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×