Sardar 2 First look Loading..కోలీవుడ్ ప్రేక్షకులే కాకుండా తెలుగు ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘సర్దార్ 2’. గతంలో కార్తీ (Karthi ) హీరోగా రజీషా విజయన్ (Rajisha vijayan) కీలక పాత్ర పోషించిన చిత్రం సర్దార్ (Sardar) . ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ పి.ఎస్.మిత్రన్ దర్శకత్వం వహించారు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్.లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ విడుదల చేసింది. ఇందులో రజీషా విజయన్ , చుంకీ పాండే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రలో నటించగా.. తెలుగు, తమిళ్ భాషల్లో 2022 అక్టోబర్ 22న విడుదలై, మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు ఐ ఎం డి బి లో కూడా దాదాపు 7.5 రేటింగ్ను సొంతం చేసుకోవడం గమనార్హం. అలాగే ప్రముఖ బ్యూటీ లైలా (Laila) కూడా ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు.
సర్దార్ 2..
ఇక గతంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రాబోతోంది. ఈ చిత్రానికి కూడా ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై లక్ష్మణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఇది.భారీ అంచనాల మధ్య వచ్చి సూపర్ హిట్ విజయాన్ని అందుకోవడానికి మేకర్స్ బలంగా ప్రయత్నం చేస్తున్నారు
ముఖ్యంగా కార్తీ ఇందులో కూడా ద్విపాత్రాభినయం చేశారు. ఇందులో రజీషా విజయన్ తో పాటూ మాళవిక మోహనన్, ఆశికా రంగనాథ్ కూడా నటిస్తున్నట్లు సమాచారం.
సర్దార్ 2 ఫస్ట్ లుక్ లో లోడింగ్..
ఇకపోతే ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా మేకర్స్ “#సర్దార్ 2 ఫస్ట్ లుక్ లోడింగ్ ” అంటూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. అందులో కార్తీ ఓల్డ్ గెటప్ లో ఉన్నట్లు రివీల్ చేశారు. ఈ వీడియోలో ఖైదీలకు కాపలాగా ఉన్న ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ పై ఖైదీలు మూకుమ్మడిగా దాడి చేసి తప్పించుకోవాలని చూస్తున్న సమయంలో.. సడన్గా గొడవలో భాగంగా ఒక కీ సర్దార్ ఉండే గది లోపలికి వెళ్తుంది. ఖైదీలు ఆమెను కొట్టే ప్రయత్నం చేయగా ఒక్కసారిగా తలుపు తెరుచుకొని బయటకొస్తారు సర్దార్. ఇక అలా చేతిలో పుస్తకంతో ముసలివాడి గెటప్ లో ఆకట్టుకున్నారు సర్దార్. త్వరలోనే సర్దార్ 2 ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేయబోతున్నట్లు తెలపడానికి ఈ వీడియోని రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది అని చెప్పవచ్చు. ఉత్కంఠ భరితంగా సాగుతున్న ఈ వీడియో సినిమాపై హైప్ పెంచేసింది. ఇక భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా అటు కార్తీకి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. ఇక భారీ అంచనాల మధ్య త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేస్తారేమో చూడాలి. ఇక కార్తీ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతానికి కార్తీక్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారని చెప్పవచ్చు. సర్దార్ 2 తో పాటు ఖైదీ 2 సినిమాలో కూడా నటిస్తున్నారు.