Saripodhaa Sanivaaram: నేచురల్ స్టార్ నాని హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు. గతేడాది దసరా, హాయ్ నాన్న సినిమాలతో హిట్ అందుకున్న తరువాత నాని నటిస్తున్న చిత్రం సరిపోదా శనివారం. దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో ఎస్.జె.సూర్య విలన్ పాత్రలో కనిపించనున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. అంచనాలకు తగ్గట్టే పోస్టర్స్, సాంగ్స్, వీడియో గ్లింప్స్‌లు ఉండడంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూస్తామా అని అభిమానులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. సరిపోదా శనివారం ఆగస్టు 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. తాజాగా ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు చేశారు.
ఇక ఈ చిత్ర ట్రైలర్‌ను ఆగస్టు 13న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ట్రైలర్ కోసం అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సరిపోదా శనివారం సినిమాలో నాని.. సూర్య అనే పాత్రలో నటిస్తున్నాడు. చిన్నతనం నుంచి కోపంతో పెరిగిన సూర్య తల్లి మాట వలన ఆదివారం నుంచి శుక్రవారం వరకు సైలెంట్ గా ఉంటూ. శనివారం మాత్రం తనలోని వైలెంట్ ను మొత్తం చూపిస్తాడు.
ఇప్పటివరకు ఇలాంటి ఒక కాన్సెప్ట్ ఇప్పటివరకు రాకపోవడంతో.. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. అంతేకాకుండా నాని – వివేక్ ఆత్రేయ కాంబోలో ఇప్పటికే అంటే సుందరానికీ అనే సినిమా వచ్చింది. అప్పట్లో ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేనప్పటికీ.. ఈ సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. మరి ఈ కాంబోలో వస్తున్న రెడీనా సినిమా సరిపోదా శనివారం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Starts with a drizzle.
Ends with a STORM. #SaripodhaaSanivaaram Trailer on 13th 🔥 pic.twitter.com/sZFTGuCLID— Nani (@NameisNani) August 10, 2024