BigTV English
Advertisement

Freedom Teaser: మరో కొత్త కాన్సెప్ట్ తో వచ్చేసిన టూరిస్ట్ ఫ్యామిలీ హీరో.. టీజర్ అదిరిపోయింది

Freedom Teaser: మరో కొత్త కాన్సెప్ట్ తో వచ్చేసిన టూరిస్ట్ ఫ్యామిలీ హీరో.. టీజర్ అదిరిపోయింది

Freedom Teaser: చిన్న సినిమాలు.. ఈమధ్యకాలంలో ఇవే ఎక్కువ ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. పెద్ద హీరోల సినిమాలు అంటే  ప్రేక్షకులకు అంచనాలు ఉన్తయి. ఎలాంటి అంచనాలు లేకుండా కొత్త కొత్త కథలతో చిన్న సినిమాలే ఇండస్ట్రీని ఏలుతున్నాయి. రీసెంట్ గా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.


 

కోలీవుడ్ సీనియర్ హీరో శశికుమార్, సిమ్రాన్ జంటగా నటించిన ఈ సినిమాకు అభిషాన్ జీవింత్ దర్శకత్వం వహించాడు. పెద్ద పెద్ద సినిమాలతో పాటు మే 1 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక నెల తరువాత జూన్ 2 నుంచి జియో హాట్ స్టార్ లో అన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్ లో ఎంత పెద్ద హిట్ ను అందుకుందో.. ఓటీటీలో కూడా అలాంటి టాక్ నే అందుకోవడం విశేషం. ఇంకా ఈ సినిమా ఫీవర్ తగ్గనే లేదు. శశికుమార్ మరో కొత్త కాన్సెప్ట్ తో వచ్చేశాడు.


 

శశికుమార్ హీరోగా నటించిన కొత్త చిత్రం ఫ్రీడమ్. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు సత్యశివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో జై భీమ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న లిజోమోల్ జోస్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఫ్రీడమ్ తెలుగు టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

 

శ్రీలంక తమిళీయులను పోలీసులు విచారణ పేరుతో చిత్రహింసలు పెట్టడం.. వారు జైల్లో తప్పించుకుపోవాలని ప్రయత్నాలు సాగించడం.. ఇక బాధితుల కుటుంబాలు వారిని జైలునుంచి బయటకు పంపాలని నిరసన వ్యక్తం చేయడం లాంటివి  ఈ టీజర్ లో చూపించారు. బాధితులందరికీ అండగా హీరో నిలబడినట్లు చూపించారు. పోలీస్ విచారణ ఎంత భయంకరంగా ఉంటుంది.. అనేది చాలా తమిళ్ సినిమాల్లో చూపించారు. ఈ సినిమా మొత్తం వాస్తవ సంఘటనల ఆధారంగా చిత్రీకరించారని చెప్పడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

 

ఇక గిబ్రాన్ మ్యూజిక్ చాలా గ్రిప్పింగ్ గా అనిపిస్తుంది. ఇకపోతే ఈ సినిమా జూలై 10 న రిలీజ్ కానుంది. ఇప్పటికే టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో  సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాడు శశికుమార్. అంత పెద్ద హిట్ తరువాత వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమా కూడా మంచి హిట్ అందుకుంటుందని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమాతో శశికుమార్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×