Cobra: మన కళ్ల ఎదురుగా పాము కనబడితేనే వెనక్కి తిరిగి ఒక్కటే పరుగులు తీస్తాం. పాము మనవైపు వస్తుందంటేనే గజగజ వణికిపోతాం. ఆమడ దూరంలో ఉంటాం. ప్రస్తుతం వర్షాకాలం వచ్చేసింది. పాములు బెడద ఎక్కువగా ఉంటుంది. ఇంటి చుట్టూ చెట్లు, చెత్తా చెదారం ఉంటే ఇక పాములకు పండగే. వర్షాకాలంలో పాములు ఇంట్లోకి దూరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వరదలు వచ్చే సమయంలో.. నీరు లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్తోంది. అప్పుడు కూడా పాములు కొట్టుకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్ లో పాములు ఇంట్లోకి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తాజాగా విశాఖపట్నంలో జరిగిన నాగు పాముల ఘటన సోషల్ మీడియా తెగ వైరల్ అవుతోంది.
విశాఖపట్నం డాక్ యార్డులో రెండు నాగు పాములు హల్‌చల్ చేశాయి. పాములను చూసిన స్థానికులు వెంటనే స్నేక్ క్యాచర్ లకు సమాచారం అందజేశారు. వెంటనే సమీపంలో ఉన్న స్నేక్ క్యాచర్ నాగరాజు సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. నాగరాజు అక్కడ ఉన్న రెండు నాగుపాములను చాలా జాగ్రత్తగా పట్టుకుని సంచిలో బంధించాడు. ఆ తర్వాత మరుసటి రోజు అడవిలో పాము వదిలేద్దామని పాములు ఉన్న సంచిని తన ఇంట్లో దాచిపెట్టాడు.
ALSO READ: Snakes At Airport: బ్యాగు నిండా పాములు, ఓపెన్ చేసి చూసి షాకైన ఎయిర్ పోర్టు అధికారులు!
అయితే, ఉదయం లేచిన తర్వాత నాగరాజు పాముల సంచిని పట్టుకుని సమీపంలో ఉన్న అడవికి వెళ్లాడు. సంచిని తెరిచి చూడగానే.. అతను షాక్ అయ్యాడు. అందులో రెండు పాములతో పాటు 12 గుడ్లు కనిపించాయి. నాగుపాములు రాత్రికి రాత్రే అన్ని గుడ్లు పెట్టడంతో అతను అవాక్కయ్యాడు. అతను వెంటనే ఈ వింత ఘటన ఫోన్ లో బంధించి రికార్డ్ చేశాడు.
రాత్రంతా రెండు నాగు పాములు డజన్ గుడ్లు పెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత స్నేక్ మెన్ నాగరాజు ఆ పాములను దగ్గరలో ఉన్న అడవిలోకి తీసుకుని వెళ్లి వదిలిపెట్టాడు.అతను పాము గుడ్లను అటవీ అధికారులకు ఇచ్చాడు. అటవీ సిబ్బంది ఆ గుడ్లను జూకి తరలించారు. నాగరాజు ఆ పాములను సురక్షితంగా ఫారెస్టులో వదిలేశాడు. అయితే ఇందుకు సబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ALSO READ: Northeastern: దంచికొడుతున్న వర్షం.. కొండచరియలు విరిగిపడి ముగ్గురు జవాన్లు మృతి