RC16 : ఉప్పెన సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు బుచ్చిబాబు. డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కొన్ని ఏళ్లుపాటు పనిచేసి మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా బుచ్చిబాబు సినిమా స్టార్ట్ అవుతుందని చాలామంది ఊహించారు. కానీ ఎందుకు ఆ కాంబినేషన్ వర్కౌట్ కాలేదు. వాస్తవానికి సుకుమార్ దర్శకత్వం వహించిన నాన్నకు ప్రేమతో సినిమాకి బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఆ తరుణంలోనే ఎన్టీఆర్ తో కూడా మంచి అనుబంధం బుచ్చిబాబుకి ఏర్పడింది. అయితే కొన్ని రోజుల తర్వాత ఈ కాంబినేషన్ అనౌన్స్ అవుతుందని కొన్ని తరుణంలో రామ్ చరణ్ తో సినిమాను అనౌన్స్ చేశాడు బుచ్చిబాబు. రామ్ చరణ్ తన కెరీర్ లో ప్రస్తుతం 16వ సినిమాను చేస్తున్నాడు. అలానే చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా జనవరి 10న రిలీజ్ కి సిద్ధంగా ఉంది.
Also Read : AR Rahman: అందుకే విడాకులు తీసుకున్నాను, తన తప్పేం లేదు.. క్లారిటీ ఇచ్చిన సైరా బాను
ఇక బుచ్చిబాబు సినిమా పైన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు చిత్ర యూనిట్. ఈ కథ గురించి పలు సందర్భాలలో విజయసేతుపతి కూడా ఎలివేషన్ ఇస్తూ వచ్చారు. ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి రాయణం అనే పాత్రలో కనిపించి నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. అప్పటినుంచి విజయసేతుపతికి బుచ్చిబాబుకి మధ్య మంచి పరిచయం ఉంది. ఇక చరణ్ నటిస్తున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ లో జరగనున్నట్లు ఇదివరకే వార్తలు వచ్చాయి. అలానే ఈ సినిమాలో చరణ్ ఉత్తరాంధ్ర స్లాంగ్లో మాట్లాడబోతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన కొంతమంది ఉత్తరాంధ్ర ఆర్టిస్టుల కోసం ఆ ఏరియాలో ఆడిషన్స్ కూడా చేశారు. ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన కొమరం పులి సినిమా తర్వాత ఇప్పటివరకు రెహమాన్ తెలుగులో సంగీతం అందించలేదు. ఈ సినిమా కూడా రెహమాన్ కు నచ్చడం వలనే చేస్తున్నారని టాక్ కూడా వినిపిస్తుంది.
Also Read: Allu Arjun: స్టార్ హీరోయిన్ తో చెన్నైకి వెళ్ళిన బన్నీ.. పోస్ట్ వైరల్..!
ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం దివ్యేందు శర్మను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన లుక్ టెస్ట్ కూడా జరిగినట్లు సమాచారం వినిపిస్తుంది. పాత్రకు ఇంకా శర్మ ఫిక్స్ కాలేదు. శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఎంతగా ఫేమస్ అయ్యింది అని అందరికీ తెలిసిన విషయమే. ఆ సినిమాలో మున్నాభాయ్ పాత్రను ఎవరు మర్చిపోలేరు. అటువంటి మున్నాభాయ్ ని చరణ్ సినిమా కోసం బుచ్చిబాబు ఒప్పించాడు అంటేనే నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేశాడు అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని గురించి అధికారకి ప్రకటన రావాల్సి ఉంది.