తాజాగా ఈ వెర్సటైల్ నటుడు మరొక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వివి గోపాలకృష్ణ దర్శకత్వంలో ‘కృష్ణమ్మ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో ఈ మూవీ తెరకెక్కింది. అరుణాచల క్రియేషన్స్ బ్యారన్‌పై కృష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మించారు. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలైన మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు సంయుక్తంగా ఈ చిత్రాన్ని మే 10న థియేటర్లలో రిలీజ్ చేశారు.
ఈ మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచే మంచి టాక్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమాలో నటుడు సత్యదేవ్ మాస్ అండ్ రగ్గడ్ లుక్‌లో కనిపించి అదరగొట్టేశాడు. అంతేకాకుండా ఈ మూవీలోని యాక్షన్ సన్నివేశాలు సినీ ప్రియుల్ని బాగా ఆకట్టుకున్నాయి. ఇక థియేటర్లలో అదరగొడుతున్న ఈ చిత్రం సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్‌గా తొలి రోజే బాక్సాఫీసు వద్ద రూ.1 కోటి గ్రాస్ వసూళ్ళు రాబట్టి అబ్బురపరచింది. ఇది సత్యదేవ్ కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్స్ అని చెప్పొచ్చు.
Also Read: ఎందుకు చస్తున్నామో తెలియకపోవడమే అసలైన బాధ.. ఆసక్తి రేపుతున్న కృష్ణమ్మ ట్రైలర్
అయితే రెండో రోజుకు వచ్చేసరికి ఈ చిత్రానికి మరింత కలెక్షన్లు పెరిగాయి. మొదటి రోజు పర్వాలేదనిపించుకున్న ఈ చిత్రం రెండో రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.2.24 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి అదరగొట్టేసింది. మొత్తంగా ఈ మూవీ మంచి కలెక్షన్లతో దూసుకుపోతుందని చెప్పొచ్చు. కాగా ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ.2.70 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.
#Krishnamma Grosses 2.24 CRORES worldwide in 2 days pic.twitter.com/fa2bpMQ5wm
— Suresh PRO (@SureshPRO_) May 12, 2024
Also Read: Allu Arjun: పవన్ కల్యాణ్‌కే నా సపోర్ట్.. నంద్యాల టూర్‌పై అల్లు అర్జున్ క్లారిటీ.. వీడియో వైరల్
దీంతో దాదాపు రూ.3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రంగం లోకి దిగిన ఈ మూవీ మరిన్ని కోట్లు కలెక్ట్ చేస్తేనే క్లీన్ హిట్ సినిమాగా నిలుస్తుంది. చూడాలి మరి ఇంకెన్ని వసూళ్లను రాబడుతుందో. ఈ మూవీలో సత్యదేవ్‌కి జోడీగా అనిత రాజ్ హీరోయిన్‌గా నటించింది. అలాగే కృష్ణ బూరుగుల, లక్ష్మణ్ మీసాల, అతీరా రాజ్, రఘు కుంచె కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. అలాగే కాలభైరవ సంగీతం సినీ ప్రియుల్ని ఆకట్టుకుంది.