BigTV English

Election Commission: బన్నీ టూర్ ఎఫెక్ట్.. నంద్యాల ఎస్పీపై చర్యలకు ఈసీ ఆదేశం..!

Election Commission: బన్నీ టూర్ ఎఫెక్ట్.. నంద్యాల ఎస్పీపై చర్యలకు ఈసీ ఆదేశం..!

Election Commission Action on Nandyala SP: శనివారం సినీ నటుడు అల్లు అర్జున్ నంద్యాలలో సందడి చేశాడు. బన్నీ నంద్యాలకు చేరుకోవడంతో అభిమానులు పెద్ద ఎత్తున్న స్వాగతం పలికారు. నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పారవిచంద్రారెడ్డి ఇంటికి బన్నీ భారీ ర్యాలీతో బయలుదేరాడు. ఇప్పటివరకు బాగానే ఉన్నా నంద్యాలలో అల్లు అర్జున్ టూర్ ఎఫెక్ట్.. ఆ జిల్ల పోలీస్ బాస్‌పై పడింది.


బన్నీ టూర్‌లో భారీ ఎత్తున జనం గుమికూడటం, అనుమతి లేకుండా ర్యాలీ తీయడంతో బన్నీపై కేసు నమోదయ్యింది. ఇటు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదులు అందడంతో ఏపీ పోలీసుల తీరుపై ఈసీ సీరియస్ అయ్యింది. ఎన్నికల కోడ్ అమలలో నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి పై ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. దీంతో అతనిపై శాఖాపరమైన విచారణ జరపాలని ఈసీ ఏపీ డీజీపీకి సూచించింది.

నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డితో పాటు, డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని ఈసీ డీజీపీని ఆదేశించింది. ఇక నంద్యాల టూటౌన్ సీఐ రాజారెడ్డిపై ఛార్జ్ షీట్ ఓపెన్ చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. శాఖాపరమైన విచారణ జరిపి 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. తమ అనుమతి లేకుండా కేసు క్లోజ్ చేయొద్దని హెచ్చరించింది.


Also Read: కోడ్ ఉల్లంఘన.. అల్లు అర్జున్‌పై కేసు నమోదు..!

అటు తిరుపతికి చెందిన ఐదుగురు సీఐలను అనంతపురం బదిలీ చేస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. వైసీపీ అనుకూలంగా పనిచేస్తున్నారని తెలుగుదేశం నాయకులు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో సీఐలు జగన్‌మోహన్ రెడ్డి, అంజూ యాదవ్, అమర్ నాథ్ రెడ్డికి అనంతపురం విధులు, సీఐలు శ్రీనివాసులు, వినోద్ కుమార్‌కు అనంతపురంలో ఎన్నికల విధుల బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది ఎన్నికల కమిషన్.

Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×