BigTV English

Arvind Kejriwal 10 Guarantees: 10 గ్యారంటీలతో అరవింద్ కేజ్రీ’వార్’..

Arvind Kejriwal 10 Guarantees: 10 గ్యారంటీలతో అరవింద్ కేజ్రీ’వార్’..

Delhi CM Arvind Kejriwal’s 10 Guarantees: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో అరెస్ట్ అయ్యి, మధ్యంతర బెయిల్‌పై తీహార్ జైలు నుంచి విడుదలైన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. తాజాగా ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అమలు చేసే 10 గ్యారంటీలను ప్రకటించారు కేజ్రీవాల్.


ఆదివారం ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆప్ జాతీయ కన్వీనర్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 24 గంటల విద్యుత్, ఉచిత విద్య , ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదాతో సహా పలు హామీలను ఇచ్చారు. భారత సరిహద్దు వెంబడి చైనా ఆక్రమించుకున్న భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని హామీ ఇచ్చారు.

తాను జైలులో ఉన్నందున ఈ పది హామీల ప్రకటన ఆలస్యమైందని కేజ్రీవాల్ అన్నారు. దేశంలో ఇంకా ఎన్నికలు మిగిలి ఉన్నాయన్నారు. ఈ హామీలపై తాను ఇతర ఇండియా కూటమి భాగస్వాములతో చర్చించలేదని.., అయితే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదని కేజ్రీవాల్ అన్నారు.


ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీలు అమలయ్యేలా చూస్తానని హామీ ఇస్తున్నానని కేజ్రీవాల్ అన్నారు.

Also Read: జరగబోయే ఎన్నికల్లో కేజ్రీవాల్ ఎఫెక్ట్ ఎంత?

అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన 10 హామీలు ఇవే:

  • ఉచిత విద్యుత్ హామీ: దేశవ్యాప్తంగా మొదటి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో 24 గంటల విద్యుత్ సరఫరా
  • విద్యకు భరోసా: అందరికీ ఉచిత విద్యనందించే ఏర్పాట్లు చేస్తామని, ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు.
  • ఆరోగ్యానికి గ్యారంటీ: ప్రైవేట్ ఆసుపత్రులతో సమానంగా ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు కల్పిస్తాం
  • చైనా నుంచి భూసేకరణకు హామీ: భారతదేశం భూమిని చైనా నుంచి విముక్తి చేయాలి, సైన్యానికి స్వేచ్ఛా హస్తం ఇస్తాం
  • అగ్నివీర్ పథకానికి ముగింపు గ్యారంటీ: నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రారంభించిన అగ్నివీర్ పథకం రద్దు చేస్తాం
  • MSP హామీ: రైతులు పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తాం
  • రాష్ట్ర హోదా హామీ: కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న ఢిల్లీకి రాష్ట్ర హోదా

Also Read: Lok Sabha Elections 2024 Live Updates: మధ్యాహ్నం ఒంటి గంట వరకు దేశంలో ఓటింగ్ శాతం ఎంతంటే..?

  • ఉపాధి హామీ: ఏటా రెండు కోట్ల ఉద్యోగాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేశాం
  • అవినీతికి వ్యతిరేకంగా హామీ: అవినీతిపరులకు సురక్షితమైన స్వర్గధామాన్ని అందించే విధానాన్ని తొలగిస్తామని, అవినీతి నుంచి దేశాన్ని విముక్తి చేస్తాము
  • GSTపై హామీ: వస్తువులు, సేవల పన్ను (GST) సరళీకృతం చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది

Related News

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Big Stories

×