OTT Movie : బాలీవుడ్ నుంచి కిర్రాక్ స్టోరీలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. వీటిలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, మతి పోగొట్టే ట్విస్టులతో కేక పెట్టిస్తున్నాయి. అందాల భామ కృతి సనోన్ నటించిన ఒక బాలీవుడ్ మూవీ మంచి వ్యూస్ తో దూసుకెళ్తోంది. ఇందులో కృతి డ్యూయల్ రోల్ లో అదరగొట్టింది. ఈ సినిమా స్టోరీ డొమెస్టిక్ అబ్యూస్ తో మొదలై, ఒక రివేంజ్ థ్రిల్లర్ గా టర్న్ తీసుకుంటుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
షైలీ, సౌమ్య ట్విన్ సిస్టర్స్. సౌమ్య, షైలీ ఒకరికొకరు భిన్నంగా ఉంటారు. సౌమ్య సాఫ్ట్ గా ఉంటే, షైలీ బో*ల్డ్ గా ఉంటుంది. ఇద్దరూ ధ్రువ్ అనే రిచ్ బిజినెస్‌మ్యాన్‌తో ప్రేమలో ఉంటారు. అయితే సౌమ్య ధ్రువ్ ని వివాహం చేసుకుంటుంది. షైలీ తన సిస్టర్ జీవితాన్ని జెలసీతో చూస్తూ, ధ్రువ్‌తో అఫైర్ మొదలుపెడుతుంది. కానీ ధ్రువ్ డార్క్ సైడ్ (అల్కహాల్, డొమెస్టిక్ అబ్యూస్) బయటపడుతుంది. ఇది రివెంజ్, బెట్రయల్‌ల మైడ్‌లో ట్విస్ట్‌లు తీసుకుంటుంది. ధ్రువ్ కూడా సౌమ్యని ఇంట్లో కొడుతూ చాలా దారుణంగా ప్రవర్తిస్తాడు. ఒక రోజు పారాగ్లైడింగ్ ట్రిప్‌లో ధ్రువ్ సౌమ్యని చంపడానికి ట్రై చేస్తాడు. కానీ ఆమె తప్పించుకుంటుంది. ఈ కేసుని విద్యా అనే ఒక స్ట్రాంగ్ పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేస్తుంది.
ఈ కేసులో ధ్రువ్‌ని అరెస్ట్ చేస్తారు. కానీ కథలో ఊహించని ట్విస్ట్ వస్తుంది. అసలు పారాగ్లైడింగ్‌లో ఉన్నది సౌమ్య కాదు, షైలీ! విద్యా ఈ కేసును డీప్ గా విచారిస్తే షాకింగ్ విషయాలు బయటికి వస్తాయి. సౌమ్య, షైలీ ఇద్దరూ కలిసి ధ్రువ్‌ని ట్రాప్ చేయడానికి ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ధ్రువ్ షైలీతో కూడా అఫైర్‌లో ఉన్నాడు. అతను ఇద్దరినీ బాధపెట్టాడు. ఈ ట్విన్ సిస్టర్స్ అతని దౌర్జన్యానికి బదులుగా రివెంజ్ తీసుకోవాలని నిర్ణయిస్తారు. విద్యా ఈ సీక్రెట్ తెలుసుకుని, ధ్రువ్ నిజంగానే వీళ్ళను బాధ పెట్టినట్లు తెలుసుకుంటుంది. చివర్లో ఆమె నిజాన్ని బయటపెట్టకుండా, ధ్రువ్‌కి జైలు శిక్ష పడేలా చేస్తుంది. ఈ సినిమా డొమెస్టిక్ అబ్యూస్, సిస్టర్‌హుడ్ థీమ్‌లను హైలైట్ చేస్తుంది.
‘డో పట్టి”‘ (Do Patti) 2024లో విడుదలైన హిందీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమా శశాంక చతుర్వేది దర్శకత్వంలో రూపొందింది. ఇందులో కృతి సనోన్ (షైలీ/సౌమ్య, ట్విన్ సిస్టర్స్), కాజోల్ (ఇన్స్పెక్టర్ దోరి), షాహీర్ షేఖ్ (ధ్రువ్ సూద్), రాజ్‌శ్రీ దేశ్‌పాండే (సునీతా) ప్రధాన పాత్రల్లో నటించారు. 2 గంటల 13 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా IMDbలో 6.3/10 రేటింగ్ పొందింది. 2024 అక్టోబర్ 25న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.
Read Also : ఈ అమ్మాయి పెయింటింగ్ వేస్తే పోతారు మొత్తం పోతారు… గుండె ధైర్యం ఉన్నవాళ్లే చూడాల్సిన హర్రర్ మూవీ