Shekhar Kammula : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న దర్శకులలో శేఖర్ కమ్ముల ప్రత్యేకం. డాలర్ డ్రీమ్స్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు శేఖర్. ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించక పోయినా కూడా, నేషనల్ అవార్డు సాధించుకుంది. ఆ తర్వాత శేఖర్ చేసిన సినిమా ఆనంద్. ఈ సినిమా కథను చాలామందికి చెప్పినప్పుడు పెద్దగా ఎవరికి అర్థం కాలేదు. కృష్ణవంశీ లాంటి దిగ్గజ దర్శకుడు కూడా ఆ రోజుల్లో ఇంటర్వెల్ వరకు కథ వినగానే అయిపోయిందా అని అడిగారు. ఈ సినిమా మొత్తానికి పూర్తి చేసిన శేఖర్ కమ్ముల అనుకొని విధంగా శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాతో పాటు విడుదల చేశారు. శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా టికెట్స్ దొరక్కపోతే ఈ సినిమా చూసే అవకాశం ఉంది అనే ప్లాన్ కూడా మరోవైపు ఉంది. ఈ సినిమాకి సంబంధించి ట్యాగ్ లైన్ విపరీతంగా ఆకట్టుకుంది. మంచి కాఫీలాంటి సినిమా అనే లైన్ చాలామందికి బాగా కనెక్ట్ అయింది.
ఆనంద్ సినిమాతో మంచి గుర్తింపు
అయితే ఒక మంచి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారు అనేది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అలానే శంకర్ దాదా ఎంబిబిఎస్ లాంటి సినిమా ఉన్నా కూడా ఆనంద్ సినిమాను ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. ఆ తర్వాత వచ్చిన హ్యాపీడేస్, గోదావరి వంటి సినిమాలుకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా శేఖర్ కమ్ముల సినిమాలకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. తన సినిమాల్లో హీరోయిన్ పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉంటుంది. ఇండిపెండెంట్ గా ఉండే పాత్రలను శేఖర్ తన సినిమాల్లో హీరోయిన్లకు రాస్తాడు. శేఖర్ తీసిన మొదటి సినిమా 2000 సంవత్సరంలో విడుదలైంది. ఇక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో శేఖర్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.
శేఖర్ కమ్ముల మెగా మూమెంట్
teenage లో ఒక్కసారి చూశాను చిరంజీవి గారిని. దగ్గరగా చూశాను.’ఈయనతో సినిమా తీయాలి’ అనే ఫీలింగ్. అంతే. నేను ఇండస్ట్రీకి వచ్చి 25 years. ‘lets celebrate’ అని team అంటే నాకు గుర్తొచ్చింది చిరంజీవి గారే. కొన్ని generations ని inspire 2 personality ఆయనే. ‘chase your dreams, success మనల్ని follow అయి తీరుతుంది’ అన్న నమ్మకం ఇచ్చింది చిరంజీవి గారే. so, నా 25 years journey celebration అంటే ఆయన presence లోనే చేసుకోవాలి అనిపించింది. Thank You Sir. ఈ moments లోనే కాదు, నా టీనేజ్ నుండి మీరు నా ముందు ఇలాగే ఉన్నారు. అంటూ శేఖర్ కమ్ముల తన భావోద్వేగాన్ని తెలిపారు.
Also Read : Narne Nithin – Sangeeth Sobhan: పేరు వచ్చింది కాబట్టి పాత ప్రాజెక్టులు రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు