BigTV English

Arjun Daughter wedding : సీనియర్ నటుడు అర్జున్ కుమార్తె పెళ్లి.. ఆ హీరోతో..

Arjun Daughter  wedding : సీనియర్ నటుడు అర్జున్ కుమార్తె పెళ్లి.. ఆ హీరోతో..

Big tv live news, big tv telugu news, big tv news


Arjun Daughter wedding : ఈరోజుల్లో సినీ పరిశ్రమలో ప్రేమ వివాహాలు ఎక్కువవుతున్నాయి. ఒకప్పుడు ఎవరైనా హీరో, హీరోయిన్ ప్రేమించి పెళ్లి చేసుకుంటే అది పెద్ద విషయంగా భావించేవారు. కానీ ఈరోజుల్లో చాలామంది నటీనటులు తమ ప్రేమను డేటింగ్‌తో ఆపేయకుండా పెళ్లి వరకు తీసుకెళ్లాలని ఆశపడుతున్నారు. అందులో తాజాగా సీనియర్ నటుడు అర్జున్ కుమార్తె కూడా చేరనుంది. ఒక అప్‌కమింగ్ హీరోతో తను ప్రేమలో ఉందని, త్వరలోనే వీరి వివాహం కూడా జరగనుందని వార్తలు వైరల్ అయ్యాయి.

తెలుగుతో పాటు ఇతర సౌత్ సినీ పరిశ్రమల్లో కూడా నటుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు అర్జున్. హీరోగా మాత్రమే కాకుండా సహాయ నటుడిగా కూడా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. గత కొంతకాలంగా విలన్ పాత్రలు చేస్తూ ఆడియన్స్‌ను అలరించడం మొదలుపెట్టాడు. అదే క్రమంలో తన కుమార్తె ఐశ్వర్యను కూడా హీరోయిన్‌గా పరిచయం చేశాడు. తమిళంలో పలు సినిమాల్లో ఐశ్వర్య హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం తన చేతిలో హీరోయిన్‌గా పెద్ద ప్రాజెక్ట్స్ ఏమీ లేవు. అదే సమయంలో ఐశ్వర్య త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.


తమిళంలో ఎన్నో చిత్రాల్లో సహాయ నటుడిగా చేసి నేషనల్ అవార్డ్ సైతం గెలుచుకున్న తంబి రామయ్య కుమారుడు ఉమాపతి రామయ్యతో ఐశ్వర్య ప్రేమలో ఉందని కోలీవుడ్ అంతా మాట్లాడుకుంటోంది. అంతే కాకుండా వీరిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారట. అయితే వీరిద్దరూ హీరో, హీరోయిన్లుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు. అయినా వీరిద్దరూ ఎలా ప్రేమలో పడ్డారని చాలామంది సందేహపడుతున్నారు. అలాంటి వారికి ఒక సమాధానం దొరికింది.

ఉమాపతి రామయ్య హీరోగా మాత్రమే కాకుండా ఒక రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా కూడా కనిపించాడు. ఆ షోను అర్జున్ హోస్ట్ చేశాడు. అదే సమయంలో ఉమాపతి, ఐశ్వర్య కలుసుకున్నారని మెల్లగా వారి స్నేహం ప్రేమగా మారిందని సన్నిహితులు చెప్తున్నారు. ప్రస్తుతం హీరోయిన్‌గా ఐశ్వర్య.. తన తండ్రి అర్జున్ దర్శకత్వంలో నటించాల్సి ఉన్నా.. పలు కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఉమాపతి మాత్రం దేవదాస్ అనే చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. మరి ఈ పెళ్లి వార్తలపై వీరిద్దరూ ఎలా స్పందిస్తారో చూడాలి.

Related News

Avika Gor : ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసిన చిన్నారి పెళ్ళికూతురు.. చెప్పినట్టే చేసిందిగా!

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Big Stories

×