
Israel bomb Hospital : హమాస్‌పై చేస్తున్న యుద్ధంలో ఇజ్రాయెల్ విచక్షణ కోల్పోయి ఆస్పత్రలు, శరణార్థి శిబిరాలు, పాఠశాలలపై వైమానిక దాడులు చేస్తోంది. శుక్రవారం గాజాలోని మూడు ఆస్పత్రులు, ఒక పాఠశాలపై క్షిపణులతో ఇజ్రాయెల్ వైమానిక దళాలు దాడి చేశాయి. ఈ దాడుల్లో 22 మందికిపైగా మరణించినట్లు సమాచారం. మరో ఆస్పత్రిపై కూడా ఇజ్రాయెల్ మిలిటిరీ భూదాడి చేసింది.
ఆ మూడు ఆస్పత్రులలో గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అల్ షిఫాపై తెల్లవారుజామున క్షిపణులతో దాడి జరిగింది. అలాగే ఇండోనేషియా ఆస్పత్రి, నాసర్ రాంటిస్సీ పీడియాట్రిక్ క్యాన్సర్ ఆసుపత్రి ధ్వంసం అయ్యాయి. ఉత్తర గాజాలో ఉన్న ఈ మూడు ఆస్పత్రులలో రోగులు, వైద్యులు, సహాయక సిబ్బంది అధిక సంఖ్యలో పనిచేస్తున్న సమయంలో ఈ దాడులు జరిగాయని పాలస్తీనా అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ఇద్దరు పాలస్తీనా పౌరులు మరణించగా.. అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. అలాగే గాజా నగరంలోని అల్ బురాక్ పాఠశాలపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 20 మంది చనిపోయారు.
హమాస్ ఉగ్రవాదులు అల్ షిఫా ఆస్పత్రి బేస్‌లో దాగిఉన్నారని సమాచారం అందడంతో ఆస్పత్రిపై క్షిపణులు ప్రయోగించామని ఇజ్రాయెల్ ప్రభుత్వ ప్రతినిధి ఐలాన్ లెవీ తెలిపారు.
అయితే ఇజ్రాయెల్ ఆస్పత్రులపై దాడి చేయడం.. ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా క్రిస్టియన్ అల్ అహ్లీ హాస్పిటల్‌పై కూడా రాకెట్లతో దాడి చేసి 500 మంది చంపింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం యుద్ధ సమయంలో ఆస్పత్రులు, శరణార్థి శిబిరాలు, పాఠశాలలపై దాడి చేయకూడదు. ఈ నియమాలని ఇజ్రాయెల్ యథేచ్ఛగా ఉల్లఘిస్తుండడంతో ప్రపంచదేశాలలో ఇజ్రాయెల్ పట్ల వ్యతిరేకత కనిపిస్తోంది.
ఇజ్రాయెల్‌ని మద్దతుగా నిలిచిన బ్రిటన్, అమెరికా, ఫ్రాంస్, జర్మనీ లాంటి దేశాలలో ముస్లింలు, క్రిస్టియన్లతోపాటు యూదులు కూడా భారీ సంఖ్యలో నిరసనలు చేస్తున్నారు. గాజాలో చనిపోయిన వారిలో అమాయక పౌరులు, చిన్నపిల్లలు, మహిళలే ఎక్కువగా ఉన్నారు.
దీనిపై అల్ షిఫా హాస్పిటల్ డైరెక్టర్ మాట్లాడుతూ.. ఆస్పత్రిలో కరెంటు, నీరు, నిలపివేశారు. విషమ స్థితిలో ఉన్న రోగులు మృత్యువుకు చేరువలో ఉన్నారు అని చెప్పిరు. గాజాలోని పరిస్థిులను పాలస్తీనా రెడ్ క్రిసింట్ చీఫ్ ఐక్య రాజ్య సమితి వివరించారు. ఇజ్రాయెల్ యుద్ధం పేరుతో గాజాలోని పౌరులను బలవంతంగా ఖాళీ చేయింస్తోందని, గాజాను ఆక్రమించుకునేందుకే ఆస్పత్రులపై పథకం ప్రకారమే దాడులు ఇజ్రాయెల్ దాడి చేస్తోందని చెప్పారు.