Rajendra prasad:తెలుగు చిత్ర సీమలో ఎంతోమంది హీరోలు ఏదో ఒక జానర్ లో కింగ్ లుగా నిరూపించుకుంటున్నారు. అలా యాక్షన్ సినిమాలు అనగానే అందరికీ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఎక్కువగా గుర్తుకు వస్తారు.అలాగే కామెడీ జానర్ సినిమాలు అనగానే అందరికీ రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad), అల్లరి నరేష్ (Allari Naresh)లు గుర్తుకు వస్తారు. ఇక ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీస్ అనగానే అందరికీ వెంకటేష్ (Venkatesh), శ్రీకాంత్(Srikanth ), జగపతిబాబు (Jagapathi babu) వంటి హీరోలు గుర్తుకు వస్తారు. అలా టాలీవుడ్ లో ఉన్న ఒక్కో హీరో ఒక్కో జానర్ లో కింగ్ అనిపించుకుంటున్నారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నట కిరీటి గా పేరు తెచ్చుకున్న కామెడీ హీరో రాజేంద్రప్రసాద్.. తన సినీ కెరీర్ లో వందలాది సినిమాల్లో హీరోగా నటించారు. కానీ ప్రస్తుతం వయసు మీద పడడంతో.. వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. అలా ఓవైపు సినిమాలతో పాటు మరోవైపు వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్నారు. అయితే అలాంటి రాజేంద్రప్రసాద్ పై సినీ ఇండస్ట్రీలో ఒక రూమర్ ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే కొంతమంది హీరోయిన్లు బహిరంగంగానే రాజేంద్రప్రసాద్ నిజస్వరూపం ఎలాంటిదో బయటపెట్టారు.
రాజేంద్రప్రసాద్ పై మాళవిక ఆరోపణలు..
అలా అప్పట్లో రాజేంద్రప్రసాద్ పై తీవ్రమైన నెగిటివిటీ ఏర్పడింది. గతంలో హీరోయిన్ మాళవిక (Malavika) తనని రాజేంద్రప్రసాద్ లైంగికంగా వేధించారు అంటూ ఫిలిం ప్రొడ్యూసర్ అసోసియేషన్ కి ఫిర్యాదు చేసి సంచలనం సృష్టించింది. అయితే ఈ విషయంలో మాళవికనే ప్రొడ్యూసర్లు తప్పు పట్టారని అప్పట్లో వార్తలు వినిపించాయి.కానీ రాజేంద్రప్రసాద్ సినిమా తర్వాత మళ్లీ మాళవిక సినిమాల్లో నటించలేదు. ఇక రాజేంద్రప్రసాద్ – మాళవిక కాంబినేషన్లో ‘అప్పారావు డ్రైవింగ్ స్కూల్’ మూవీ వచ్చింది. ఇక ఈ హీరోయిన్ మాత్రమే కాకుండా కొంతమంది హీరోయిన్లు రాజేంద్రప్రసాద్ పై పరోక్ష కామెంట్లు చేశారు. ఇది ఇలా ఉంటే తాజాగా మరో హీరోయిన్ రాజేంద్రప్రసాద్ నిజ స్వరూపం బయట పెట్టింది. ఇక రాజేంద్ర ప్రసాద్ గురించి చెప్పిన ఆ హీరోయిన్ ఎవరో కాదు దివ్యవాణి (Divya Vani)..
రాజేంద్రప్రసాద్ వల్లే నాకు అవకాశం రాలేదు..
దివ్యవాణిని అందరూ బాపు బొమ్మ అంటారు. ఎందుకంటే ఈమె బాపు దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లి పుస్తకం’ సినిమా ద్వారా పాపులర్ అయింది.దాంతో దివ్యవాణి ఇండస్ట్రీలో బాపు బొమ్మగా మారిపోయింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ కలర్ తక్కువగా ఉన్నప్పటికీ చూడ్డానికి బాపూ బొమ్మలాగే ఉండడంతో ఈమెకు వరుస అవకాశాలు తలుపు తట్టాయి. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో రాజేంద్రప్రసాద్ గురించి దివ్యవాణి మాట్లాడుతూ.. “నేను రాజేంద్రప్రసాద్ తో కలిసి ‘పెళ్లి పుస్తకం’ సినిమాలో నటించాను. అయితే ఆ తర్వాత నాకు రాజేంద్రప్రసాద్ తో కలిసి ‘మిస్టర్ పెళ్ళాం’ సినిమాలో కూడా హీరోయిన్ గా అవకాశం వచ్చింది. అయితే ఈ సినిమా బాపు గారి దర్శకత్వంలో రావడంతో బాపుగారు నన్ను సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ చేశారు.కానీ రాజేంద్ర ప్రసాద్ మాత్రం నా సినిమాలో హీరోయిన్ గా దివ్యవాణి వద్దు అంటూ రిజెక్ట్ చేశారు.ఇక బాపుగారు ఎన్నిసార్లు సర్ధి చెప్పినా కూడా ఆయన వినలేదు. దాంతో చేసేదేమీ లేక డైరెక్టర్ నన్ను తొలగించి హీరోయిన్ ఆమనిని మిస్టర్ పెళ్ళాం సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. రాజేంద్రప్రసాద్ ఆమని కాంబినేషన్లో వచ్చిన మిస్టర్ పెళ్ళాం సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఇక ఈ సినిమా లో ఛాన్స్ మిస్ చేసుకున్నందుకు బాధపడినప్పటికీ నేను సినిమా మిస్ చేసుకున్నా గానీ ఆమనికి ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు లభించింది అని ఆనందం కలిగింది” అంటూ దివ్యవాణి ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పింది. అయితే ఈ విషయం విని దివ్యవాణి అభిమానులు మాత్రం రాజేంద్రప్రసాద్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సినిమాలో గనుక దివ్యవాణి చేసి ఉండుంటే ఆమె కెరియర్ మరో స్థాయికి వెళ్ళేది. ఒకరకంగా ఆయన వల్లే ఆమె కెరియర్ నాశనం అయ్యింది అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.