Indian Railways: చాలా మంది రైల్వే టికెట్లు బుక్ చేయడానికి నానా ఇబ్బందులు పడుతుంటారు. అదో పెద్ద ప్రయాసగా భావిస్తుంటారు. అయితే, ప్రయాణీకులు సులభంగా, వేగంగా టికెట్లు బుక్ చేసుకునేలా IRCTC చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే, IRCTC eWalletను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా రైల్వే టికెట్లను బుక్ చేసుకునేందుకు ఈ వ్యాలెట్ ఉపయోగపడుతుంది. ఇంతకీ దీనిని ఎలా ఉపయోగించాలంటే..
IRCTC eWalletతో కలిగే లాభాలు ఏంటంటే?
⦿ గేట్ వే ఛార్జీలు ఉండవు: ఇరత యాప్స్ లో మాదిరిగా అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.
⦿ వేగవంతమైన బుకింగ్: రైల్వే టికెట్ బుకింగ్ అనేది అత్యంత వేగంగా కొనసాగుతుంది.
⦿ ఇన్ స్టంట్ రీఫండ్: ఒకవేళ మీరు టికెట్లు రద్దు చేసుకుంటే వెంటనే మీ వ్యాలెట్ లోని రీఫండ్ వచ్చేస్తుంది.
⦿ ఈజీ టాప్ అప్స్: BHIM UPI, Paytm, Amazon Pay, నెట్ బ్యాంకింగ్ లేదంటే డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా మీ ఇ-వాలెట్ ను రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
⦿ సురక్షిత లావాదేవీలు: భారతీయ రైల్వే సంస్థ అధికారిక వెబ్ సైట్ తీసుకొచ్చిన ఈ ఇ-వాలెట్ ద్వారా చేసే లావాదేవీలు చాలా సురక్షితమైనవి.
Read Also: దేశంలో అత్యంత చెత్త రైల్వే స్టేషన్లు ఇవే.. టాప్ 10లో 6 స్టేషన్లు ఆ రాష్ట్రంలోనే!
IRCTC ఇ-వాలెట్ ద్వారా టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలంటే?
IRCTC ఇ-వాలెట్‌ని ఉపయోగించి రైలు టికెట్లను బుక్ చేసుకోవడానికి సింఫుల్ గా కింది స్టెప్స్ ను ఫాలో అయితే సరిపోతుంది.
⦿ అధికారిక IRCTC వెబ్ సైట్ కి వెళ్లి మీ ప్రూఫ్స్ తో లాగిన్ కావాలి.
⦿ తొలిసారి eWalletని ఉపయోగించినట్లు అయితే, IRCTC ఎక్స్ క్లూజివ్ లోకి వెళ్లి, eWallet అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.
⦿ మీ IRCTC లావాదేవీ పాస్ వర్డ్ ను ఎంటర్ చేసి సబ్ మిట్ చేయాలి. మీ PAN, ఆధార్ ను ధృవీకరించకపోతే కన్ఫార్మ్ చేసుకోండి.
⦿ మీ ఇ-వాలెట్ ను రీఛార్జ్ చేయడానికి ఇ-వాలెట్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. BHIM UPI, Paytm, Amazon Pay, నెట్ బ్యాంకింగ్ లేదంటే డెబిట్/క్రెడిట్ కార్డులను ఉపయోగించి రీఛార్జ్ చేసుకోవచ్చు. కనీసం రూ. 100 నుంచి గరిష్టంగా రూ. 10,000 వరకు మీ వ్యాలెట్ లో యాడ్ చేసుకోవచ్చు.
⦿ రీఛార్జ్ చేసిన తర్వాత, మీ eWallet బ్యాలెన్స్ ను ఉపయోగించి ఈజీగా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
Read Also: రైల్వేలో W/D బోర్డులు కనిపిస్తాయి.. వీటిని ఎందుకు ఏర్పాటు చేస్తారో తెలుసా?
IRCTC eWalletతో వేగవంతమైన టికెట్ల బుకింగ్
IRCTC eWallet ద్వారా రద్దీ సమయాల్లో, తత్కాల్ బుకింగ్ టైమ్ లో ఈజీగా టికెట్లను బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ eWallet ద్వారా జరిపే లావాదేవీలు చాలా సురక్షితమైనవి. eWallet ఇన్ స్టంట్ టికెట్ బుకింగ్ లను నిర్ధారిస్తుంది.
Read Also: రైల్వే స్టేషన సమీపంలో FM బోర్డు.. దీని అర్థం ఏంటో తెలుసా?