BigTV English

Global warming : సముద్రాలు సలసల కాగిపోతున్నాయి.. ఇలాగైతే రానున్న రోజుల్లో ఈ విపత్తులు తప్పవు

Global warming : సముద్రాలు సలసల కాగిపోతున్నాయి.. ఇలాగైతే రానున్న రోజుల్లో ఈ విపత్తులు తప్పవు

Global warming : భూతాపం, వాతావరణ కాలుష్యం కారణంగా అంతర్జాతీయంగా సముద్రాలు వేగంగా వేడెక్కుతున్నాయి. అయితే.. అది ఎంత వేగంగా జరుగుతుందనే విషయాన్ని సాంకేతిక ఆధారాలతో సహా తేల్చారు శాస్త్రవేత్తలు. గతంతో పోల్చితే ఇప్పుడు మరింత వేగంగా సముద్రాల ఉపరితలాలు వేడెక్కుతున్నాయని, ఇది రానున్న భారీ ముప్పులకు సంకేతం అంటూ హెచ్చరిస్తున్నారు. ఈ విషయాన్ని ఎన్విరాన్‌మెంటల్ రీసెర్చ్ లెటర్స్ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం కళ్లకు కడుతోంది.


గత నాలుగేళ్లల్లో సముద్రం నాలుగు రెట్లు అధికంగా వేడెక్కుతుందని పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా.. గత రెండేళ్లలో అంటే 2023, 2024 లలో సముద్ర ఉష్ణోగ్రతలు ఎందుకు పెరిగాయో స్పష్టంగా తెలుపుతూ అనేక విషయాల్ని ఈ రిసెర్చ్ వెల్లడించింది. ఇందులో.. 1980 చివరి నాటికి ఏడాదికి సముద్ర ఉష్ణోగ్రతలు 0.06 డిగ్రీల సెల్సియస్‌ మాత్రమే పెరుగుతూ వచ్చింది. కానీ.. ఆ తర్వాత మాత్రం ఈ పెరుగుదలలో భారీ మార్పులు చోటుచేసుకోగా.. ప్రస్తుతం అవి దశాబ్దానికి 0.27 డిగ్రీల సెల్సియస్‌ చొప్పున పెరుగుతున్నట్లు చెబుతున్నారు. అంకెల రూపంలో ఇవి పాయింట్ల పరంగానే తేడా ఉన్నట్లు కనిపిస్తున్నా.. ప్రతీ పాయింటుకు భారీ మార్పులు చోటుచేసుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతిమంగా ఆ మార్పులకు వివిధ రూపాల్లో మానవుడే బాధ్యత వహించాలని చెబుతున్నారు.

ఇదే విషయాన్ని వివరిస్తూ.. సముద్రం భూమికి ఓ నీటి తొట్టి అనుకుంటే.. ఇందులోని నీరు వేగంగా వేడెక్కుతుంది. గత నాలుగు దశాబ్దాల క్రితం ఏటా ఓ డిగ్రిలో కొంత మేరకు మాత్రమే మార్పులు ఉండేవి, కానీ ఇప్పుడు ఆ మార్పులు భారీగా ఉన్నాయి అంటున్నారు లండన్ లోని యూనివర్శిటీ ఆఫ్ రీడింగ్‌లో ప్రధాన రచయిత ప్రొఫెసర్ క్రిస్ మర్చంట్. 2023 నుంచి 2024 ప్రారంభం వరకు అంతర్జాతీయ సముద్ర ఉష్ణోగ్రతలు వరుసగా 450 రోజుల పాటు రికార్డు స్థాయిలో నమోదు అయినట్లు పరిశోధకులు గుర్తించారు.


సముద్రాలు వేడెక్కడాన్ని చాలా ప్రభావవంతమైన చర్యగా అర్థం చేసుకోవాలని, దీనిపై అన్ని దేశాలు దృష్టి సారించాలని కోరుతున్నారు. సముద్రంలోని మత్స్య సంపదతో పాటు వర్షాలతో నేరుగా సంబంధం ఉన్న సముద్రాలు వేడెక్కుతుంటే తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయంగా పెరిగిపోతున్న కర్భన ఉద్గారాలను తగ్గించడం, నెట్ జీరో కార్బన్ ఉద్గారుల వాహనాలు, పరిశ్రమల వైపు వెళ్లడం ద్వారా ఈ సమస్యకు నెమ్మదిగా పరిష్కరించాలని సూచిస్తున్నారు. ఎల్ నినోతో పాటు, పసిఫిక్‌ సముద్రం సహజంగా వేడెక్కే సంఘటనలతో పాటు అనేక విషయాల్ని రికార్డు చేస్తున్న పరిశోధకులు.. మునుపటి దశాబ్దాల కంటే గత 10 ఏళ్లల్లో సముద్ర ఉపరితలం వేడెక్కే వేగం పెరిగినట్లు పరిశోధకుల బృందం కనుక్కుంది. సముద్రాలు వేగంగా వేడెక్కడంతో సముద్ర ఉపరితలాలపై రికార్డు స్థాయిలో 44 శాతం వెచ్చదనం ఉన్నట్లు అధ్యయనంలో గుర్తించారు.

ఇటీవలి దశాబ్దాలుగా గమనించిన గ్లోబల్ ఓషన్ వార్మింగ్ యొక్క మొత్తం రేటు తదుపరి ఏమి జరుగుతుందనేదానికి ఖచ్చితమైన మార్గదర్శిని కాదని పరిశోధనలు చూపిస్తున్నాయి: గత 40 సంవత్సరాలలో చూసిన సముద్ర ఉష్ణోగ్రత పెరుగుదల కేవలం రాబోయే 20 సంవత్సరాలలో మించిపోతుందని నమ్మదగినది. ఉపరితల మహాసముద్రాలు గ్లోబల్ వార్మింగ్‌కు వేగాన్ని నిర్దేశించినందున, ఇది మొత్తం వాతావరణానికి సంబంధించినదని బృందం వివరించింది.

Also Read : 20 మంది ప్రాణాలు తీసిన విమానం.. మరో ఘోర దుర్ఘటన!

ఈ వేగవంతమైన వేడెక్కడం భవిష్యత్తులో ఎన్నో ప్రమాదాలను మోసుకొస్తుందని హెచ్చరిస్తున్నారు. ఉష్ణోగ్రత పెరుగుదలను నివారించేందుకు శిలాజ ఇంధనాల వినియోగాన్ని వేగంగా తగ్గించుకోవాలని ప్రత్యమ్నాయ ఇంధన వనరులపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. కాదని ఇలానే వ్యవహరిస్తే.. సముద్ర జాతులలో వ్యాధుల వ్యాప్తిని పెంచుతుందని, దాంతో.. వాటి సంపద తగ్గిపోయి ఆహాన సంక్షోభం ఏర్పడుతుందని చెబుతున్నారు.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×