Srikanth Odela: ఒకప్పుడు తమ సినిమాలతో ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన సీనియర్ హీరోలు.. ఇప్పుడు ఒక్క హిట్ దొరికితే చాలు అని కష్టపడుతున్నారు. చాలావరకు సీనియర్ హీరోలు ఇప్పుడు ఫామ్‌లో లేరు. ఒక హిట్ పడగానే వెంటనే వారిని ఫ్లాపులు వెంటాడుతున్నాయి. అందుకే వారు కూడా రూటు మార్చారు. సీనియర్ దర్శకులకు కాకుండా యంగ్ టాలెంట్‌కు ఛాన్స్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. అందుకే మెగాస్టార్ చిరంజీవి సైతం కేవలం ఒకటే సినిమా అనుభవం ఉన్న శ్రీకాంత్ ఓదెలకు దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చారు. తాజాగా వీరి కాంబినేషన్‌లో సినిమా ఎలా ఉండబోతుందా అని చిన్న హింట్ ఇస్తూ మెగా ఫ్యాన్స్‌కు షాకిచ్చాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.
ఓదెల స్టేట్‌మెంట్
శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) లాంటి కొత్త డైరెక్టర్‌తో చిరంజీవి సినిమా చేయడానికి ఒప్పుకున్నాడని తెలియగానే చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శ్రీకాంత్ ఇప్పటివరకు దర్శకుడిగా తెరకెక్కించింది ఒక్క సినిమానే. అదే నాని హీరోగా నటించిన ‘దసరా’. ఈ మూవీ మాస్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. పైగా నానిలోని కొత్త అవతారాన్ని చూపించింది. అలా ‘దసరా’ సూపర్ హిట్‌గా నిలిచింది. శ్రీకాంత్ డైరెక్షన్ నచ్చి తనకే మరో సినిమా ఛాన్స్ ఇచ్చాడు. దాని తర్వాత ఏకంగా చిరంజీవినే తన సినిమాకు ఒప్పించాడు శ్రీకాంత్ ఓదెల. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ అందించాడు ఈ యంగ్ డైరెక్టర్. వింటేజ్ చిరును చూపించను అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాడు.
Also Read: ‘బరోజ్’ మూవీకి ఫ్లాప్ టాక్.. మోహన్‌లాల్ షాకింగ్ రియాక్షన్
డిఫరెంట్ కథ
‘‘నేను చిరంజీవి (Chiranjeevi) సినిమాలు చూస్తూ పెరిగాను. ఇప్పుడు ఆయనతో కలిసి పనిచేస్తున్నాను అంటే నమ్మలేకపోతున్నాను. దాదాపు 48 గంటల్లో స్క్రిప్ట్ ఫైనల్ చేసేశాం. నేను గాలిలో తేలిపోయాను. ముందు సినిమాలకంటే ఇది డిఫరెంట్‌గా ఉంటుంది. వింటేజ్ మెగాస్టార్‌ను మీరు చూడరు. అలా కాకుండా ఆయనను ఒక కొత్త అవతారంలో చూస్తారు. వయసుకు తగిన క్యారెక్టర్‌లో కనిపిస్తారు. ఆయన క్యారవ్యాన్ నుండి బయటికి వచ్చే వరకే చిరంజీవికి నేను ఫ్యాన్. ఆయన బయటికి వచ్చిన తర్వాత నా సినిమాలో క్యారెక్టర్ మాత్రమే అవుతారు’’ అని శ్రీకాంత్ ఓదెల తెలిపాడు. దీంతో ఫ్యాన్స్‌లో దీని గురించి చర్చలు మొదలయ్యాయి.
ట్రోల్స్ ఆగిపోవాలి
సీనియర్ హీరోల్లో.. ముఖ్యంగా చిరంజీవిపై గత కొన్నేళ్లుగా ఎన్నో ట్రోల్స్ వినిపిస్తున్నాయి. ఒరిజినల్ కథలను వదిలేసి, రీమేక్స్ వైపు మొగ్గుచూపుతున్నారని, వయసుకు తగిన క్యారెక్టర్లు చేయకుండా హీరోయిన్స్‌తో రొమాన్స్ చేస్తున్నారని.. ఇలా ఆయన గురించి అందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. దీంతో ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన ఇండస్ట్రీ హిట్స్ గురించి అందరూ మర్చిపోయారు. రీమేక్స్ వద్దని చెప్తున్నా కూడా ఆయన మళ్లీ మళ్లీ అవే చేస్తుండడంతో ‘భోళా శంకర్’ను డిశాస్టర్ చేసి రిజల్ట్ చూపించారు. ఇప్పటికైనా ఆయన మునుపటి సినిమాలు మర్చిపోయేలా నిజంగానే చిరును కొత్త అవతారంలో చూపించాలని శ్రీకాంత్ ఓదెల తీసుకున్న నిర్ణయం బెస్ట్ అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.