BigTV English

Actress Vijayalakshmi: సూసైడ్ అంటూ ‘హనుమాన్‌ జంక్షన్‌’ నటి వీడియో.. అతడే నా చావుకి కారణమంటూ..

Actress Vijayalakshmi: సూసైడ్ అంటూ ‘హనుమాన్‌ జంక్షన్‌’ నటి వీడియో.. అతడే నా చావుకి కారణమంటూ..
Hanuman Junction
Hanuman Junction

Actress Vijayalakshmi Sensational Video: సినీ పరిశ్రమ.. ఇదో రంగుల ప్రపంచం. ఎవరి జీవితాన్ని ఎప్పుడు.. ఎలా మలుస్తుందో చెప్పలేం. సినీ పరిశ్రమలో కొందరు తక్కువ టైమ్‌లో సక్సెస్ అయితే.. మరికొందరు ఏళ్ల తరబడి ప్రయత్నించినా.. సక్సెస్ కాలేరు. వెండితెరపై కనిపించే రంగులు నిజ జీవితంలో ఉండవని ఎన్నో సందర్భాల్లో రుజువయ్యింది. సినీ రంగంలో రాణించలేక, ఆర్థిక పరిస్థితులు, ఇతర కారణాలతో ఎందరో తారలు తమ జీవితాలను కోల్పోయారు. తాజాగా అటువంటి పరిస్థితులతో ఆత్మహత్య చేసుకోబోతున్నా అంటూ ఓ ప్రముఖ తమిళ నటి ఓ వీడియోను విడుదల చేసింది. ఈ ఘటనతో అందరూ షాక్ అవుతున్నారు.


ప్రముఖ తమిళ నటి విజయలక్ష్మీ ఆత్మహత్య చేసుకోబోతున్నా అంటూ ఓ షాకింగ్ వీడియో విడుదల చేసింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు జరిగిన అన్యాయంపై ఎవరూ స్పందించడం లేదని అన్నారు. అందుకే చనిపోవాలని డిసైడ్ అయ్యానంటూ వీడియోలో వివరించారు.

ఈ వీడియోలో విజయలక్ష్మీ మాట్లాడుతూ.. “మీడియా మిత్రులకు నమస్కారం. ఫబ్రవరి 29న ఓ వీడియోను షేర్ చేశా. నామ్‌ తమిళర్‌ కట్చి సమన్వయకర్త సీమాన్‌ నాతో మాట్లాడాలని, ఆయన నాతో కలిసి జీవించాలని కోరాను. కానీ, ఆయన నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఇప్పుడు మార్చి 5 పూర్తయింది. నా ఆవేదన ఎంటో ఆ వీడియో ద్వారా తెలియజేశాను. నువ్వు నా జీవితంలో లేకుంటే చనిపోతానని చెప్పాను. నున్న పెళ్లి చేసుకుంటానని చెప్పి మూడేళ్లపాటు నాతో రహస్య జీవితాన్ని కొనసాగించాడు. శారీరక అవసరాలు తీరాక నన్ను రోడ్డుపై వదిలేశాడు. న్యాయం కోసం ప్రయత్నించినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎవరైనా సహకరించినా వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. బతకడంకంటే చావడం మేలు అనుకుంటున్నాను. ఇది నా చివరి వీడియో” అంటూ పేర్కొన్నారు.

READ MORE: ఖడ్గం మూవీలో కీ రోల్‌ని మిస్సయిన స్టార్ హీరోయిన్

విజయలక్ష్మీ ఎవరు?

విజయలక్ష్మీ తమిళ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1997 సినీ ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించారు. జోడిహక్కి, భూమితై చొచ్చల మగా, అరుణోదయ, స్వస్తిక్, హబ్బా లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా తెలుగులో హనుమాన్‌ జంక్షన్‌ సినిమాలో జగపతిబాబు, అర్జున్‌ చెల్లెలిగా నటించారు. మోహన్‌లాల్‌తో కలిసి మలయాళ చిత్రం దేవదూతన్‌లో కూడా నటించింద. ఇలా తెలుగు, తమిళ, మలయాళంతో కలిపి మొత్తం 40 సినిమాలకు పైగా నటించిందారు విజయలక్ష్మీ.

సీమాన్‌పై ఉన్న వివాదం

సీమాన్‌.. తమిళనాడు నామ్ తమిళర్ కట్చి పార్టీ అధినేత, నటుడు, దర్శకుడు. నటి విజయలక్ష్మీ ఆయనపై గత కొంతకాలంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. సీమాన్ తనను పెళ్లి చేసుకొంటానని మోసం చేశాడని.. 7 సార్లు తనకు బలవంతంగా అబార్షన్ చేయించాడంటూ ఆత్మహత్యాయత్నం చేసింది. సోషల్ మీడియా లైవ్ లోనే నిద్రమాత్రలు మింగింది. అప్పుడు వెంటనే ఆస్పత్రికి తరలించడంతో బతికి బయపడ్డారు. ఇప్పుడు తాజాగా మరో వీడియో షేర్ చేశారు విజయలక్షీ.

Tags

Related News

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Big Stories

×