Ajay Devgan:బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో అజయ్ దేవగన్ (Ajay Devgan) కూడా ఒకరు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి, తన అద్భుతమైన నటనతో ఒక నార్త్ ఆడియన్స్ ను మాత్రమే కాదు తెలుగు ఆడియన్స్ ను కూడా మెప్పించారు. రాజమౌళి (Rajamouli ) దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కూడా అజయ్ దేవగన్ నటించి తన నటనతో తెలుగు ఆడియన్స్ హృదయాలను దోచుకున్నారు. ఇకపోతే ఈరోజు అజయ్ దేవగన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే అజయ్ దేవగన్ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి నెటిజన్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు.
అజయ్ దేవగన్ ఆస్తుల వివరాలు..
అజయ్ దేవగన్ ఆస్తుల వివరాల విషయానికొస్తే.. ఇప్పటివరకు సుమారుగా రూ.430 కోట్ల వరకు కూడా పెట్టినట్లు సమాచారం. దాదాపు గత కొన్ని సంవత్సరాలుగా సినీ రంగంలో చురుగ్గా కొనసాగుతున్న ఈయన అటు సినిమాలు, ఇటు ప్రకటనలు, నిర్మాణ సంస్థల ద్వారా కూడా భారీగా సంపాదిస్తున్నారు. ముంబైలో ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాంతంలో సుమారుగా రూ.60 కోట్ల విలువైన లగ్జరీ ఇల్లు కూడా ఆయన కొనుగోలు చేశారు. 2000 సంవత్సరంలో దేవగన్ ఫిలిమ్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించిన ఈయన.. ఈ సినిమా ద్వారా పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. అంతేకాదు వీఎఫ్ఎక్స్ కంపెనీ కూడా ఉంది. దీనికి తోడు NYs మల్టీప్లెక్స్ చైన్ ను కూడా ప్రారంభించారు. అంతే కాదు ఈయన రియల్ ఎస్టేట్ రంగంలో సిద్ధహస్తుడు కూడా.
రియల్ ఎస్టేట్ రంగం నుండి భారీ ఆదాయం..
2010లో అటు రియల్ ఎస్టేట్ ,ఇటు నిర్మాణ వ్యాపారాన్ని ప్రారంభించిన ఈయన ఛారిటీ పనులు కూడా చేస్తున్నారు.
NY అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించిన అజయ్ దేవగన్.. గుజరాత్లో ఒక సోలార్ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టారు. ఇలా
వివిధ మార్గాల ద్వారా భారీ ఆదాయాన్ని పొందుతున్నారు అజయ్ దేవగన్.
అజయ్ దేవగన్ కార్ కలెక్షన్స్..
అజయ్ దేవగన్ కు మెర్సిడెస్ బెంజ్ , ఆడి Q7, బీఎండబ్ల్యూ జెడ్ 4, మినీ కంట్రీ మ్యాన్, రోల్స్ రాయిస్ వంటి కార్లు ఉన్నాయి. జుహూలో శివశక్తి పేరిట రూ.60 కోట్ల విలువైన బంగ్లాను కొనుగోలు చేశారు.
పద్మశ్రీ గ్రహీత..
అజయ్ దేవగన్ నటుడు మాత్రమే కాదు దర్శకుడు కూడా.. 2008లో వచ్చిన యు మీ ఔర్ హామ్, 2016 లో వచ్చిన శివాయ్, 2022లో వచ్చిన రన్ వే 34 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇకపోతే ఈయన తండ్రి వీరూ దేవగన్. బాలీవుడ్ దర్శకుడు, స్టంట్ మాస్టర్ కూడా .. తండ్రి వల్లే అజయ్ కి మొదటి నుంచి మార్షల్ ఆర్ట్స్ పై ఇష్టం పెరిగింది ఇక తర్వాత వెండితెరకు పరిచయమైన ఈయన.. తన నటనతో 2016లో పద్మశ్రీ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు.
Hollywood: ఇండస్ట్రీలో విషాదం.. ‘బ్యాట్ మ్యాన్’ మూవీ నటుడు మృతి..!