OTT Movie : ఓటీటీలో ఎన్నో రకాల కథలతో సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో హారర్ ఫాంటసీ థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో అందంగా ఉండడం కోసం ఒక రాణి అమ్మాయిల రక్తాన్ని తాగుతూ ఉంటుంది. ఆ రాణి వలలో రాజీవంశానికి చెందిన మరొక అమ్మాయి చిక్కుకుంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఎలిజబెత్ బాతోరి మిర్రర్ మిర్రర్’ (Elizabeth bathory : mirror mirror). 2018 లో వచ్చిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీకి అలైస్ ట్రాటన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) ఫ్లెక్స్ (plex) లలో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
ఎలిజబెత్ ఒక కోటలో రాణిగా ఉంటుంది. ఆమె ఉండే కోటలో ఎవరైనా పని చేయాలనుకుంటే వాళ్ళను అదృష్టవంతులుగా భావిస్తారు. ఆమె దగ్గర పని చేయడానికి హీరోయిన్ వస్తుంది. హీరోయిన్ కూడా ఒక రాజ కుటుంబానికి చెందినదే అయినా, ఆమె ఆర్థిక పరిస్థితి అంతగా బాగోలేకపోవడంతో పనిచేయడానికి వస్తుంది. ఎలిజిబెత్ తనని బాగా రిసీవ్ చేసుకుంటుంది. ఆమె తనకు ఇస్తున్న మర్యాదకి హీరోయిన్ ఫిదా అవుతుంది. అక్కడే పని చేసే మాయ అనే అమ్మాయి ఎలిజబెత్ కి మేకప్ వేస్తూ ఉంటుంది. ఒక రోజు మేకప్ కాస్ట్యూమ్ అయిపోవడంతో మాయ పై కోప్పడుతుంది. ఆ తర్వాత మాయ తన చేతిని కోసుకొని, రక్తాన్ని ఆమె మొహానికి అప్లై చేస్తుంది. అప్పుడు రాణి శాంతిస్తుంది. వాస్తవానికి రాణి, రాజు ఒకప్పుడు చాలా బాగుండేవాళ్ళు. రాజుకి అనారోగ్యం కారణంగా చనిపోతాడు. ఆ తర్వాత రాణి కి కూడా ఒక వింత జబ్బు ఆవహిస్తుంది. దాని కారణంగా ఆమె ఉన్నఫలంగా వృద్ధురాలు అయిపోతుంది. అయితే అమ్మాయిల రక్తాన్ని పూస్తే మరింత అందంగా తయారవుతుంది. దీనికి విరుగుడు అమ్మాయిల రక్తమే అని తెలుసుకుని, చాలామంది రక్తాన్ని సేకరిస్తూ ఉంటుంది.
అమ్మాయిలను ఎంత హింసించి రక్తం సేకరిస్తే, ఆ రక్తం వల్ల ఎలిజబెత్ అంత అందంగా తయారవుతుంది. ఇప్పుడు హీరోయిన్ ని కూడా టార్చర్ చేసి రక్తాన్ని సేకరించాలనుకుంటుంది. అయితే హీరోయిన్ మనస్తత్వం అమాయకంగా ఉండటంతో, తనని ఎలాగైనా కాపాడాలనుకుంటుంది మాయ. తనకి ఇక్కడ జరుగురున్న విషయాలు చెప్పి పారిపొమ్మని సలహా ఇస్తుంది. అయితే హీరోయిన్ పారిపోతూ ఎలిజబెత్ కి చిక్కుతుంది. చివరికి మాయ హీరోయిన్ ని కాపాడుతుందా? ఇంకెంతమంది రాణికి బలవుతారు? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video), ఫ్లెక్స్ (plex) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ఎలిజబెత్ బాతోరి మిర్రర్ మిర్రర్’ (Elizabeth bathory : mirror mirror) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.