Game Changer Trailer Review : శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కానుంది. ఇదివరకే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు విపరీతమైన రెస్పాన్స్ సాధించాయి. సినిమా మీద నమ్మకాన్ని మరికొంత పెంచాయి అని కూడా చెప్పొచ్చు. ఈ సినిమా టీజర్ కూడా మంచి క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఇక రిలీజ్ టైం దగ్గర పడుతున్న తరుణంలో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ట్రైలర్ మొదటినుంచి చివరి వరకు చాలా ఆసక్తికరంగా కట్ చేశారు. ముఖ్యంగా రామ్ చరణ్ ను మూడు గెటప్స్ లో చూపించిన విధానం చాలా బాగుంది. ట్రైలర్ లో రామ్ చరణ్ క్యారెక్టర్ ని చూపించడం మాత్రమే కాకుండా, స్టోరీ కూడా కొంత శాతం రీవీల్ అయ్యేటట్లు ప్లాన్ చేశారు. ట్రైలర్ లో ఒక ఐఏఎస్ అధికారికి మరియు పొలిటిషన్ కి మధ్య జరిగే కథలా చూపించారు.
ముఖ్యంగా రీసెంట్ టైమ్స్ లో శంకర్ చేసిన సినిమాలు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు శంకర్ సినిమా అంటేనే హై ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. రజినీకాంత్ నటించిన రోబో సినిమా తర్వాత ఆ స్థాయి హిట్ సినిమా ఇప్పటి వరకు శంకర్ కెరియర్ లో పడలేదు. ఇక ఎన్నో అంచనాల మధ్య వచ్చిన భారతీయుడు 2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ను మూట కట్టుకుంది. భారతీయుడు 2 సినిమా విడుదలైన తర్వాత గేమ్ చేంజర్ సినిమా మీద కూడా కొన్ని ట్రోల్స్ వచ్చాయి. చాలా మంది రామ్ చరణ్ అభిమానులు కూడా ఆందోళన చెందారు. అయితే ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్ మాత్రం అభిమానులకు భరోసా ఇచ్చింది అని చెప్పొచ్చు. శంకర్ సినిమాలలో ఏ ఏ అంశాలు అయితే ఉంటాయో అవన్నీ కూడా ఈ సినిమాలో ఉన్నాయి అనిపిస్తుంది ట్రైలర్ ను బట్టి. అయితే ఈ సినిమాకి కార్తీక్ సుబ్బరాజ్ కథ అందించిన విషయం తెలిసిందే. బహుశా అందువలనే ట్రైలర్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది అని చెప్పొచ్చు.
రామ్ చరణ్ ని రంగస్థలం సినిమా తర్వాత ఆ స్థాయిలో పరిపూర్ణంగా ఈ సినిమాలో శంకర్ వాడి ఉంటాడు అని అనిపిస్తుంది. ముఖ్యంగా ట్రైలర్ చివర్లో రామ్ చరణ్ ని ఎలివేట్ చేస్తూ కట్ చేసిన కొన్ని షాట్స్ అయితే మాత్రం ఫ్యాన్స్ కి ట్రీట్ అనే చెప్పాలి. అంతేకాకుండా శంకర్ సినిమాలు ఎంత గ్రాండ్ గా ఉంటాయో అదే రీచ్నెస్ ఈ ట్రైలర్ లో కనిపిస్తుంది. కొన్ని విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. శంకర్ సినిమాలలో కొన్ని పాటలు విజువల్ వండర్ లా అనిపిస్తాయి. ఈ సినిమాలో కూడా అదే విధంగా ప్లాన్ చేశాడు శంకర్ అని తెలుస్తుంది. శంకర్ రేంజ్ సినిమా రీసెంట్ టైమ్స్ లో పడట్లేదు అని అనుకునే చాలా మందికి ఈ సినిమా సమాధానం అయ్యే అవకాశం ఉంది.
శంకర్ సినిమాలలో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు సమాజానికి మెసేజ్ ఇచ్చే అంశాలు కూడా మనం చూస్తూ ఉంటాం. గేమ్ చేంజర్ సినిమాలో కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు శంకర్ సినిమాలలో ఉండే మార్కు కనిపిస్తుంది అని అర్థమవుతుంది. ముఖ్యంగా రామ్ చరణ్ అంజలి మధ్య ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి అనిపిస్తుంది. అలానే రామ్ చరణ్ మరియు కీయారా అద్వానీ మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది.ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ట్రైలర్ లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సీన్స్ ని బాగా ఎలివేట్ చేస్తుంది. టైలర్ బట్టి చూస్తే కార్తీక్ కథకు శంకర్ సంపూర్ణ న్యాయం చేసినట్టు ఉంది. మొత్తానికి ఊహించిన దాని కంటే కూడా ఈ ట్రైలర్ ఆసక్తిగా ఉంది. రామ్ చరణ్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే అన్ ప్రెడిక్టబుల్. ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో జనవరి 10న తెలియనుంది.