Ram Charan – Hardik Krunal: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లీడ్ రోల్ లో కియారా అద్వానీ హీరోయిన్ గా దక్షిణాది స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం గేమ్ చేంజర్. ఈ మోస్ట్ ప్రెస్టీజియస్ చిత్రం జనవరి 10వ తేదీన సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, అంజలి, సునీల్, ఎస్.జె సూర్య, సముద్రఖని, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Also Read: Clarke on Virat Kohli: టీమిండియాలో కల్లోలం.. కోహ్లీకి మళ్లీ కెప్టెన్సీ ?
ఇక ఈ చిత్రానికి ఎస్.ఎస్ థమన్ సంగీతం అందించారు. ఈ మూవీ నుండి ఇప్పటికే వచ్చిన గ్లింప్స్, పోస్టర్లు, సాంగ్స్ మంచి హిట్ అయ్యాయి. ఇక మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ లో జోరు పెంచింది చిత్ర బృందం. ఈ మూవీ ప్రమోషన్స్ తో బిజీబిజీగా గడుపుతున్నాడు రామ్ చరణ్. ఇప్పటికే బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో కి వెళ్ళి సందడి చేసిన చెర్రీ.. నేడు జరగబోయే గేమ్ చేంజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కూడా పాల్గొననున్నాడు.
అయితే రామ్ చరణ్ కి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చెర్రీ చాలాసార్లు ఐపీఎల్ మ్యాచ్ లను, అలాగే టీమిండియా మ్యాచ్ లను కూడా ప్రత్యక్షంగా స్టేడియంలో వీక్షించాడు. 2022వ సంవత్సరము సెప్టెంబర్ లో కొంతమంది క్రికెటర్స్ కూడా మెగాస్టార్ ఇంటికి ప్రత్యేకంగా వెళ్లి భోజనాలు కూడా చేశారు. ఇక భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాతో చెర్రీ కి {Ram Charan – Hardik Krunal} మంచి స్నేహం ఉంది.
గతంలో కూడా హార్దిక్ మెగా ఇంటికి వెళ్ళాడు. అయితే 2025 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రామ్ చరణ్ క్రికెటర్స్ తో చేసుకున్నట్లు సమాచారం. రామ్ చరణ్ (పాండ్యా బ్రదర్స్) హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాతో కలిసి ఉన్న ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ చరణ్, పాండ్యా బ్రదర్స్ {Ram Charan – Hardik Krunal} తో పాటు మరో ఇద్దరు కూడా ఈ ఫోటోలో ఉన్నారు. వీరంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
Also Read: Shubman Gill: రూ.450 కోట్ల స్కాం.. గిల్ తో పాటు మరో నలుగురికి CID నోటీసులు !
అయితే ఈ సెలబ్రేషన్స్ ఎక్కడ జరిగాయి..? వీరితోపాటు ఇంకా ఏ సెలబ్రిటీస్ ఇందులో పాల్గొన్నారు అనేది తెలియదు. ఇక గేమ్ చేంజర్ తెలుగు వెర్షన్ కి తాజాగా సెన్సార్ పూర్తయింది. ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్. ఈ సినిమా నిడివి 2 గంటల 45 నిమిషాలు అని సెన్సార్ వర్గాల టాక్. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ లాంచ్ సందడి షురూ అయింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ ట్రైలర్ వీడియోలో బిజిఎం, డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.