Kakinada District : న్యూ ఇయర్ వేడుకల (New Year celebrations)వేళ ప్రత్యేక తనిఖీలు చేపట్టిన పోలీసుల్ని కారుతో గుద్ది పారిపోయిన ఘటన కాకినాడలో చోటు చేసుకుంది. దీంతో.. కారులో గంజాయి (Ganja)తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలు(Conistables Injured) కాగా.. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాకినాడలోని(Kakinada) కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో జాతీయ రహదారిపై (National Highway)టోల్ ప్లాజా వద్ద అర్థరాత్రి వేళ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వచ్చిన ఓ కారును ఆపిన పోలీసులు.. అందులోని వారిని కిందకి దిగాల్సిందిగా కోరారు. దాంతో.. కారును రోడ్డు పక్కకు ఆపుతున్నట్లు నటించిన డ్రైవర్.. ఆపకుండా ముందుకు పోనిచ్చాడు. దీంతో.. అనుమానం వచ్చిన పోలీసులు.. మరికొందరు కారును చుట్టుముట్టారు.
అర్ధరాత్రి ఒకటిన్నర సమయంలో విశాఖ(Visakha) వైపు నుంచి రాజమహేంద్రవరం (Rajamundry)వైపు వెళుతున్న కారును పోలీసులు ఆపారు. కారు డ్రైవర్ ఒక్కసారిగా వేగంగా కారును దూకించుకుని వెళ్లడంతో.. కారు ముందు నిలుచున్న కిర్లంపూడి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ రాజీ లోవరాజుతో పాటు మరో కానిస్టేబుల్ కింద పడిపోయారు. దాంతో వారు తీవ్రగాయాల పాలైయ్యారు. లోవరాజు అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
కాగా.. కారు టోల్ ప్లాజా దాటి వెళ్లిపోయిన తర్వాత అప్రమత్తమైన పోలీసులు వెంటనే పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించారు. దాంతో.. అప్రమత్తమైన పోలీసులు కారు ఆచూకీ కనుక్కునేందుకు రంగంలోకి దిగారు. అప్పటికే.. కారును రాజానగరం సమీపంలోని కెనాల్ రోడ్డులో వదిలి డ్రైవర్ పరారయ్యాడు. కాగా.. అనంతరం నిందితులను పశ్చిమగోదావరి(West Godavari) జిల్లా పరిధిలో పట్టుకున్నట్లు సమాచారం.
పోలీసుల్ని గుద్దించి పారిపోయిన కారును ఉత్తర్‌ప్రదేశ్‌కు(Uttarpradesh) చెందినదిగా గుర్తించిన పోలీసులు.. అందులో అక్రమంగా గంజాయిని తరలిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి.. ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి వివరాల్ని వెల్లడించడం లేదు. కాగా.. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు టోల్ ప్లాజా దగ్గర సీసీ టీవీల్లో రికార్డు (CC Tv Recordings) కావడంతో.. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. నిందితులపై కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించే ఏర్పాట్లల్లో ఉన్నారు.
Also Read : అమెరికాలో కూతురికి కొరియర్ పంపిన మహిళ.. రూ.1.5 కోట్లు దోచుకున్న సైబర్ మోసగాళ్లు
ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల రవాణాపై కఠినంగా వ్యవహరిస్తోంది. ఏకంగా.. సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు నేరుగానే ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రాన్ని గంజాయి మాఫీయా నుంచి విముక్తి కల్పించాలని, మాదక ద్రవ్యాల వినియోగాన్ని కఠినంగా అణిచివేయాలని నిర్ణయించారు. ఆ ఆదేశాల మేరకు.. పోలీసులు నిత్యం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తూ.. గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణాను అడ్డుకుంటున్నారు.