BigTV English

‘Manamey’ Official Teaser: శర్వానంద్ ‘మనమే’ నుంచి టీజర్ రిలీజ్.. చూడండి ఎలా ఉందో!

‘Manamey’ Official Teaser: శర్వానంద్ ‘మనమే’ నుంచి టీజర్ రిలీజ్.. చూడండి ఎలా ఉందో!

Sharwanand’s Manamey Official Teaser: హీరో శర్వానంద్‌కు హిట్ పడి చాలా కాలమే అయింది. వరుస సినిమాలు చేస్తున్నా పెద్దగా ఫలితం దక్కడం లేదు. ఈ హీరో ఎక్కువగా మాస్ యాక్షన్ సినిమాల జోలికి పోకుండా.. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు క్లాసిక్ సినిమాలనే తీస్తుంటాడు. అయితే అందులో కొన్ని హిట్ అయితే.. మరికొన్ని పర్వాలేదనిపించుకున్నాయి.


అయితే శర్వా ఈ సారి కూడా క్లాసిక్ సినిమాతో ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు తన కెరీర్‌లో 35వ సినిమా చేస్తున్నాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి ‘మనమే’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసి అందరిలోనూ ఆసక్తిని రేకిత్తించారు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది.


Also Read: Darling Movie Glimpse: భార్యలతో ఇబ్బందులు పడే భర్తల కథే ‘డార్లింగ్’.. గ్లింప్స్ రిలీజ్

ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. అలాగే వివేక్ కూచిబొట్ల సహ నిర్మాతగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే ఇది వరకే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, సాంగ్ సినిమాపై అంచనాలు పెంచాయి.

ఇక ఇప్పుడు ఈ మూవీ నుంచి మరో అదిరిపోయే అప్డేట్‌ను మేకర్స్ అందించారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ ప్రకారం.. ముందుగా విదేశాల లోకేషన్లను చూపిస్తూ.. ‘మంచిగా కనిపించేవాళ్లందరూ మంచి వాళ్లు కాదా.. ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా మంచోడిలా కనిపిస్తా’’ అని శర్వా ఓ డైలాగ్‌ చెప్తాడు. ఆ తర్వాత ఓ అమ్మాయితో రొమాన్స్ సీన్ చూపించాడు.

Also Read: శర్వానంద్ ‘మనమే’ నుండి ఆకట్టుకుంటున్న ఫస్ట్ సాంగ్

ఆ తర్వాత కృతి ఎంట్రాన్స్ బాగుంది. అయితే ఒక హాస్పిటల్‌ నుంచి నడుచుకుంటూ వస్తున్న శర్వాకు హీరోయిన్ కృతి గుద్దేస్తుంది. అప్పుడే మనవాడి గుండె గుబేలుమంటుంది. అయితే శర్వానంద్‌తో ఓ బాబు ఉంటాడు. ఆ బాబు శర్వా ఇంటిని చిందర వందరగా చేస్తూ ఉంటాడు. అయితే ఇక కట్ చేస్తే.. శర్వా, కృతి ఒకే ఇంట్లో ఉంటూ బాబుని చూసుకుంటుంటారు.

అక్కడ నుంచి మన హీరో అష్టకష్టాలు పడినట్లు తెలుస్తోంది. హీరోయిన్‌తో తిట్లు తింటూనే ఉంటాడు. మొత్తంగా ఈ టీజర్ చూస్తుంటే.. ఒక బాబు చుట్టూ తిరిగే కథలా అనిపిస్తుంది. అయితే ఇలాంటి సినిమాలు ఈ మధ్య కాలంలో హిట్ అవడం కష్టమే కానీ డైరెక్టర్ ప్రెజెంట్ చేసే తీరు ఎలా ఉంటుందో చూడాలి.

Tags

Related News

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Venuswamy: గుడి నుంచి తరిమేశారు… వేణు స్వామికి ఘోర అవమానం.. ఎక్కడంటే ?

Sitara Ghattamaneni : అది నేను కాదు… దయచేసి నమ్మి మోసపోకండి

Alekhya Chitti Sisters: దెబ్బకు ఆపరేషన్‌ చేసుకుని జెండర్ మార్చేసిన అలేఖ్య.. ట్రోల్స్‌పై సుమ రియాక్షన్!

Big Stories

×