BigTV English

Shavukaru Janaki : వెటరన్ యాక్టర్ ‘షావుకారు’ జానకి బర్త్‌డే స్పెషల్..

Shavukaru Janaki : వెటరన్ యాక్టర్ ‘షావుకారు’ జానకి బర్త్‌డే స్పెషల్..
Shavukaru Janaki Latest news

Shavukaru Janaki Latest news(Cinema news in telugu) :

శంకరమంచి జానకి .. ఈ పేరు గుర్తుపట్టారా.. లేదు కదా.. అదే మీకు షావుకారు జానకి గుర్తుందా.. అంటే వెంటనే గుర్తుపడతారు కదూ. షావుకారు అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి .తన అద్భుతమైన నటనతో అందరి మనసులను కట్టిపడేసి.తన మొదటి సినిమా పేరుని .. సినీ ఇండస్ట్రీలో తన ఇంటి పేరుగా మలచుకున్న అద్భుతమైన నటి షావుకారు జానకి. డిసెంబర్ 12, 1931లో అప్పటి మద్రాస్ ప్రెసిడెంట్ లో ఉన్న రాజమండ్రి ప్రాంతంలో జన్మించారు షావుకారు జానకి. టాలీవుడ్ లో అలనాటి మేటి నటి కృష్ణకుమారి జానకి సొంత చెల్లెలు.


14 సంవత్సరాల వయసులో.. ఆమె ఆకాశవాణి మద్రాసులో ప్రముఖ రేడియో ఆర్టిస్టుగా పనిచేసేవారు. అలాగే అప్పటి గొప్ప రచయితలైన పివి రాజమన్నార్.. ఆరుద్ర పద్మరాజు మొదలైన వారి రచించిన తెలుగు నాటకాలలో నటించారు. 1949లో షావుకారు అనే చిత్రంతో ఆమె ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

మంచి సక్సెస్ సాధించడంతో ఆ తరువాత 1975 వరకు వివిధ భాషలలో ఎన్నో హిట్టు చిత్రాలలో నటించి ప్రముఖ నటిగా పేరు తెచ్చుకుంది. అయితే ఆమె పేరు ఆమెకు కాస్త చిక్కులు తెచ్చి పెట్టింది .. ఎందుకంటే అప్పట్లో తెలుగు, తమిళ ఇండస్ట్రీలు ఒకటిగా కలిసి మద్రాసులోని ఉండేవి.. ఆ సమయంలో ఎంజీఆర్ మూడవ భార్య అయిన విఎన్ జానకి పేరు కి మన జానకి పేరుకి మధ్య కాస్త కన్ఫ్యూజన్ తలెత్తేదట. ఇక ఈ కన్ఫ్యూషన్ దూరం చేయడం కోసం.. అప్పటి నిర్మాతలు.. జానకి నటించిన మొదటి మూవీ షావుకారు పేరుని ఆమె పేరు ముందు ట్యాగ్ చేశారు.


1975 తర్వాత జానకి సినిమాలలో సపోర్టింగ్ రూల్స్ వేయడం మొదలుపెట్టారు. సంసారం ఒక చదరంగం సినిమాలో.. జానకి నటన అద్భుతంగా ఉంటుంది. ఆమె హిందీలో కూడా దోస్తీ దుష్మణి,ప్రేమ్ గీత్‌ లాంటి మూవీస్ లో నటించారు. షావుకారు జానకి.. వెయిటేజ్ ఉన్న పాత్రలను ఎంత సునాయాసంగా నటిస్తారు.. చలాకీ పాత్రలో కూడా అంతగానే ఒదిగిపోతారు. పాత్ర ఏదైనా దానికి పర్ఫెక్షన్ తేవాలి అంటే.. షావుకారు జానకి తర్వాతే అనేవారట ఒకప్పుడు. ఆమె కొన్ని టీవీ యాడ్స్ లో కూడా నటించారు.

ఏఎన్ఆర్ ,ఎన్టీఆర్ లాంటి లెజెండరీ యాక్టర్స్ తో ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు షావుకారు జానకి. అలనాటి మేటి తారకు.. బిగ్ టీవీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×