BigTV English

Rajinikanth Birthday Special : 70లో కూడా దూసుకుపోయే మన బాషా .. బర్త్‌డే స్పెషల్ ..

Rajinikanth Birthday Special : 70లో కూడా దూసుకుపోయే మన బాషా .. బర్త్‌డే స్పెషల్ ..
Tollywood news in telugu

Rajinikanth Birthday Special(Tollywood news in telugu):

సూపర్ స్టార్ రజినీకాంత్.. సినీ ఇండస్ట్రీ భాష .. ఒక మనిషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలడు అనేదానికి నిలువెత్తు నిదర్శనం. ఏడు పదుల వయసు దాటుతున్న.. ఇప్పటికీ వన్నె తగ్గని స్పీడ్ తో.. రేసుగుర్రంలో దూసుకుపోతారు. ఈ సంవత్సరం వచ్చిన జైలర్ చిత్రంతో బాక్సాఫీస్ ని బంతాట ఆడింది కాకుండా.. కుర్ర హీరోలకి సైతం రికార్డులతో మైండ్ బ్లాక్ చేసే అద్భుతమైన నటుడు రజని. 1990లో.. ఎలా ఉండేవాడు ఇప్పటికీ ఆన్ స్క్రీన్ రజని అలాగే ఉంటారు. హిట్ ..ఫ్లాప్.. ఏదైనా రజనీకాంత్ క్రేజ్ మాత్రం తగ్గదు.


రజనీకాంత్ స్టైల్ అఫ్ యాక్టింగ్ ఇమిటేట్ చేయగలిగే మరొక నటుడు లేడు. రజనీకాంత్ నటించిన నరసింహ చిత్రం ఎంత రికార్డు సృష్టించిందో అందరికీ తెలుసు. సక్సెస్ అందుకునే కొద్ది నా మీద గొప్ప అని ఫీల్ అయ్యే స్టార్లను మనం ఎందరినో చూసాం.. అయినా ఇప్పటికి కూడా ఎంతో నిరాడంబరంగా.. ఒక మనిషికి కావలసింది మానసిక ప్రశాంతత మాత్రమే తప్ప హంగు ఆర్భాటం కాదు అనే దానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న ఏకైక సెలబ్రిటీ రజినీకాంత్ అనడంలో ఎటువంటి డౌట్ లేదు.

సినీ ఇండస్ట్రీలో మహోగ్ర శిఖరాలను తాకిన రికార్డు ఉన్న.. కించెత్తు గర్వం కూడా లేకుండా.. అందరితో ఎంతో స్నేహంగా మెలుగుతూ ముందుకు సాగే సామాజిక సేవా దృక్పథం కలిగిన వ్యక్తి రజనీకాంత్. అతన్ని సెలబ్రిటీ అనడం కంటే కూడా ఒక సూపర్ హ్యూమన్ అనడం సబబుగా ఉంటుంది. ఈరోజు తలైవా పుట్టినరోజు.. ఈ సందర్భంగా ట్విట్టర్లో అభిమానులు తమ ఫేవరెట్ హీరోకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


ఈ నేపథ్యంలో రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ చిత్రాలకు సంబంధించిన కొన్ని ఎపిక్ డైలాగ్స్ తో మీమర్స్ మీమ్స్ చేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇండస్ట్రీ మొత్తం మీద అజాతశత్రువు ఎవరు అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు రజనీకాంత్. ఎప్పటికీ వన్నె తగ్గని నటన రజనీకాంత్ ది అని చెప్పడానికి నిదర్శనం ఒక నెటిజన్ పెట్టిన సరదా అయిన ట్వీట్.. ఇంతకీ అతను అ ట్వీట్ లో ఏమి రాసాడు అంటే.. 9 ఏళ్ల వయసులో నేను రజిని సినిమా ని చూశాను.. ఇప్పుడు 24 ఏళ్ల వయసులో కూడా అదే రకంగా ఉన్న రజనీకాంత్ సినిమాని చూస్తున్నాను.. అంటూ పోస్ట్ చేశాడు.

చూసే వాళ్ళ వయసు పెరుగుతుంది తప్ప నటిస్తున్న రజనీకాంత్ జోరు మాత్రం తగ్గడం లేదు. జోష్ తో పాటు మంచి మనసు ఉన్న అద్భుతమైన నటన ప్రావీణ్యం కలిగిన ఒక యాక్టర్.. సమాజ సేవ కోసం ముందుకు వచ్చే ఒక సైనికుడు.. నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ఎందరో అభాగ్యుల పాలిట ఆపద్బాంధవుడు.. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన చరిత్ర సృష్టించిన లెజెండరీ యాక్టర్.. తలైవా రజనీకాంత్ కు బిగ్ టివి తరఫున జన్మదిన శుభాకాంక్షలు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×