BigTV English

China Vs India: భారత్‌కు భారీ షాక్.. ఆ ఎగుమతులు నిలిపివేసిన చైనా..! మనకు స్విఫ్ట్ కార్ కష్టమే?

China Vs India: భారత్‌కు భారీ షాక్.. ఆ ఎగుమతులు నిలిపివేసిన చైనా..! మనకు స్విఫ్ట్ కార్ కష్టమే?

China Vs India: అమెరికా చైనా ఆధిపత్య పోరులో.. ప్రపంచం చాలా చాలా కష్టాలను ఎదుర్కోవల్సి వస్తోంది. అరుదైన లోహాలకు కేరాఫ్ చైనా. అలాంటి చైనా నుంచి ఆ లోహాలుగానీ ఆగిపోతే పరిస్థితి ఏంటి? వాటి ద్వారా.. ఈ ప్రపంచంలో ఏయే ఉత్పత్తులు నిలిచిపోతాయి? వీటి ద్వారా భారత్ ఎదుర్కునే సమస్యలు ఎలాంటివి? ఇప్పుడు చూద్దాం..


అరుదైన చైనా లోహాల ఎగుమతి ఆగితే..

శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం ఎలాగో, ఆంధ్రా ఒడిశా బోర్డర్ విశాఖ ప్రాంతంలో పండే గంజాయి ఎలాగో.. చైనా భూభాగంలోని అరుదైన లోహాలు కూడా అలాగ. అలాంటి అరుదైన చైనా లోహాల ఎగుమతులు ఆగిపోతే. అదే ప్రస్తుతం ఈ ప్రపంచాన్ని ఆందోళన పరుస్తోంది.


ఎర్త్ మేగ్నట్ ఎగుమతులపై చైనా ఆంక్షలు

అరుదైన ఎర్త్ మాగ్నెట్ ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించింది. దీంతో ఒక సప్లయ్ చైన్ కి అంతరాయం కలుగుతోంది. ఈ ఆంక్షల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ రంగంలోని పలు కీలక పరిశ్రమలను ఇవి ప్రభావితం చేసేలా తెలుస్తోంది.

US, భారత్, జపాన్ లో పలు పరిశ్రమలపై ప్రభావం

అమెరికా, భారత్, జపాన్ వంటి దేశాల్లో ఈ అరుదైన లోహాలపై ఆధారపడి నడుస్తున్న పరిశ్రమలు చాలానే ఉన్నాయి. ఇప్పుడీ లోహాల సరఫరా నిలిచి పోతే పరిస్థితి ఏంటన్నది ఎవ్వరికీ అర్ధం కావడం లేదు. వీటి ప్రత్యామ్నయ మార్గాల అన్వేషణ జరుగుతోంది. కానీ అది అంత తేలిగ్గా సాధ్యపడుతుందా? అన్న అనుమానాలున్నాయి. ఎందుకంటే చైనా తయారు చేసిన కారు- బైకు- ఇంకా ఇంకా ఎన్నో వస్తువులు కావాలంటే దానికి నఖలు తయారు చేసుకోవచ్చు. కానీ చైనా భూభాగంలాంటి భూభాగం అంతటా ఉండదు. ఈ భూభాగంలోని అరుదైన లోహాలు అన్ని చోట్లా దొరకవు. మరేం చేయాలి? ఇప్పుడిదే అతి పెద్ద ప్రశ్న.

అమెరికా సుంకాలకు చైనా రివర్స్ కౌంటర్

అమెరికన్ సుంకాలకు చైనా రివర్స్ కౌంటర్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.. ప్రపంచ దేశాలన్నిటికీ ఈ అరుదైన లోహం 90 శాతం మేర సప్లయ్ అవుతోంది చైనా నుంచే. కార్లు, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, వెపన్స్ తయారీ వరకూ అన్ని కంపెనీలకూ చైనా సరఫరా చేసే ఈ అరుదైన లోహమే దిక్కు. అందుకే భారత్ లో వాహన ప్రియులను ఆకట్టుకుంటోన్న స్విఫ్ట్ ప్రొడక్షన్ ఆపేస్తున్నామంటోంది సుజుకి..

స్పెషల్ లైసెన్స్ ఉన్న కంపెనీలకే ఎగుమతులు

ఇకపై స్పెషల్ లైసెన్స్ ఉన్న కంపెనీలకు మాత్రమే ఎగుమతులు చేసేలా చైనా ప్లాన్ చేస్తోంది. కొత్త విధానం రూపొందించే వరకూ ఈ మేగ్నెట్ల ఎగుమతి నిలిపేసింది డ్రాగన్ దేశం. ఏప్రిల్ 2 నుంచే ఈ నిషేధం అమల్లో ఉందని అంటోంది న్యూయార్క్ టైమ్స్. ఇప్పటికే చైనాలోని అనేక పోర్టుల దగ్గర ఈ ముడి పదార్ధాల షిప్మెంట్లు ఆగిపోయినట్టు తెలుస్తోంది.

లాఖీడ్ మార్టిన్ తో పాటు టెస్లా, యాపిల్ పై తీవ్ర ప్రభావం

చైనా ఈ లోహాలు, మేగ్నెట్లను ఆపేస్తే.. అమెరికాలోని చాలా కంపెనీలకు కష్టకాలం తప్పదు. అమెరికన్ డిఫెన్స్ మినిస్ట్రీతో కాంట్రాక్టులు కుదుర్చుకుని వెపన్స్ తయారు చేస్తోన్న లాఖీడ్ మార్టిన్ తో పాటు టెస్లా, యాపిల్ వంటి కంపెనీలపై నా తీవ్ర ప్రభావం చూపుతుంది.

లాఖీడ్ మార్టిన్ తో పాటు టెస్లా, యాపిల్ పై తీవ్ర ప్రభావం

భూమిలోంచి తవ్వి తీసే అరుదైన మూలకాలు, లోహాలతో పాటు మాగ్నెట్ల ఉత్పత్తిలో చైనా ఎప్పటి నుంచో ఫస్ట్ ప్లేస్ లో ఉంటోంది. ఇక్కడి నుంచే వివిధ రంగాలకు అవసరమయ్యే లోహాలు సరఫరా అవుతున్నాయి. మయన్మార్, లావోస్ నుంచి కూడా ఇవి సరఫరా అవుతున్నా.. ఆ సప్లై చైన్ లోనూ చైనా పాత్ర ఎంతో కీలకం. దీంతో ఈ అరుదైన మూలకాలు, లోహాల కోసం ప్రపంచ దేశాలన్నీ డ్రాగన్ కంట్రీపై ఆధారపడక తప్పని స్థితి.

చైనా నుంచి 17 అరుదైన మూలకాల సరఫరా

చైనా నుంచి సప్లై జరిగే 17 అరుదైన మూలకాలను ఎలక్ట్రిక్ కార్లు, మోటార్లు, డ్రోన్లు, రోబోలు, జెట్ ఇంజిన్లు, లేజర్ పరికరాలు, కార్ల హెడ్ లైట్లు, స్పార్క్ ప్లగ్ లు, కెపాసిటర్లు, కంప్యూటర్ చిప్ లు, ఏఐ సర్వర్లు, స్మార్ట్ ఫోన్ల తయారీలోనూ ఈ లోహాలు, మూలకాలతో పాటు మేగ్నెట్లను వాడుతుంటారు.

సమారియం, గాడోలినియం, టెర్బియం డిస్ప్‌రోసియం

చైనా సప్లై చేసే ఈ లోహాల్లో సమారియం, గాడోలినియం, టెర్బియం, డిస్ప్‌రోసియం, లుటేటియం, స్కాండియం, ఎట్రియం వంటి కీలక మూలకాల ఎగుమతులు ఎప్పుడు నిలిచిపోతాయో.. ఎన్నో రంగాలకిది భారీగా షాకిచ్చేలా తెలుస్తోంది.

అమెరికాలో ఒకే ఒక్క అరుదైన లోహాల గని

అమెరికాలో కూడా ఇలాంటి లోహాల గనులున్నాయి. కానీ అది ఒకే ఒక్కటిగా ఉంది. దాన్నుంచి తీసే ముడి సరుకులు.. అక్కడి అవసరాలను తీర్చేలా లేదు. అందుకే ఇంత యద్ధంలోనూ ఉక్రెయిన్ తో యూఎస్ భారీ మినరల్ డీల్ కుదుర్చుకుంది. ఉక్రెయిన్ కాబట్టి దానికంటూ నాటో బలగాలతో పనుంది కాబట్టి.. ఒప్పుకుంది. అదే చైనాకు అలాంటి అవసరమే లేదు. మరి డ్రాగన్ని ఎలా దారికి తేవాన్నది అతి పెద్ద టాస్క్ గా మారింది ట్రంప్ సర్కార్ కి.

ఇరవై నాలుగు గంటలూ ఇతర దేశాలపై ఆధారపడ్డమేనా?

అంత పెద్ద అమెరికా భూభాగంలో అరుదైన ఖనిజాలు ఎందుకు లేవు? ఉన్నా వాటి తవ్వకాలకు అక్కడొస్తున్న తలనొప్పులేంటి? ఇరవై నాలుగు గంటలూ ఇతర దేశాలపై ఆధారపడ్డమేనా? ఇటు సర్వీస్ పరంగా చూస్తే భారత్, ప్రొడక్షన్ పరంగా చూస్తే చైనా, చాకిరీ పరంగా చూస్తూ ఆఫ్రికా, ఫుడ్డు పరంగా చూస్తే మెక్సికో.. మార్కెట్ పరంగా చూస్తే రకరకాల దేశాలు.. ఏంటీ అమెరికా దుస్థితి?

అమెరికా చైనా గొడవ ఈనాటిది కాదు

అమెరికా చైనా గొడవ ఈనాటిది కాదు. కేవలం ట్రంపు సుంకాలే కారణం కాదు. అధునాతన చిప్ ల అమ్మకాలను నిషేధించేలా గత బైడెన్ గవర్నమెంట్ లోనూ డెసిషన్ తీస్కుంది చైనా. గాలియం, జెర్మేనియం, యాంటీమోని వంటి సూపర్ హార్డ్ ఖనిజాల అమ్మకాలపై నిషేధం విధించింది డ్రాగన్ కంట్రీ.

అరుదైన లోహాలకు రక్షణ రంగానికి లింకు

ఇప్పుడు చైనా లోహాల నిలిపివేత ద్వారా వచ్చే చిక్కేంటంటే.. రక్షణ రంగంలో వీటి పాత్ర పెద్ద ఎత్తున ఉంటుంది. ఆయుధ తయారీలో ఈ లోహాలనే వాడాల్సి ఉంటుంది. మరి అమెరికాలో ఇలాంటి అరుదైన లోహాలుండవా? అని చూస్తే.. ఉంటాయి కానీ.. ఇక్కడి చట్టాలు, ప్రభుత్వ విధానాల కారణంగా తవ్వకాలు కష్టతరం అవుతోంది. ఇదే అదనుగా భావించిన చైనా చెలరేగిపోతోంది. అంత పెద్ద అమెరికాను అన్నిటికీ తనపై ఆధారపడేలా చేసి ఆడిస్తోంది. దీన్నే కట్టడి చేయాలంటారు ట్రంప్. కానీ అది చూస్తే ఏదో ఒక విధంగా సాధ్యం కాని దుస్థితి.

ఎన్నో విషయాల్లో అతి పెద్ద డిపెండెంట్ US

ప్రపంచ ఖనిజ ఉత్పత్తిలో.. చైనా ఆధిపత్యానికి గండి కొట్టాలంటే.. గనుల తవ్వకాల్లో ఆదేశ విధానాలను పునః పరిశీలించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ అమెరికా ఎన్నో విషయాల్లో అతి పెద్ద డిపెండెంట్. అక్కడేదీ ఒరిజినల్ అమెరికన్ మేడ్ ఉండదు. పెట్రోల్ నుంచి పిన్నీసు వరకూ ప్రతిదీ ఇతరులపై ఆధారపడక తప్పదు. దీంతో సర్వీస్ సెక్టార్లో భారత్, ప్రొడక్షన్లో చైనాను మించి పోవడం ఈ దేశానికి సాధ్య పడటం లేదు. దానికి తోడు ఇక్కడి ఖనిజ వనరులను తవ్వడానికి అనుమతించదు అమెరికన్ అధికార యంత్రాంగం.

US జర్మేనియం అవసరాల్లో 54 శాతం చైనా వాటా

యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం చైనా ప్రస్తుతం అమెరికా జర్మేనియం అవసరాల్లో 54 శాతం మేర అందిస్తుంది. ఇక సెమికండక్టర్లలో వాడే గాలియంను 1987 నుంచి యూఎస్ లో తవ్వడం లేదు. జపాన్, జర్మనీ, చైనా నుంచి దిగుమతి చేసుకుంటోంది. చిన్నమొత్తంలో ఇక్కడ ఖనిజ లోహాలున్నా వాటిని కావాలనే తవ్వనివ్వడం లేదు. పర్యావరణ పరంగా మన దేశం బాగుండాలన్న కోణంలో అన్నిటికీ ఇతరుల మీద ఆధారపడ్డమే అధికం.

పర్యావరణ పరంగా అనేక ఆంక్షలు విధించే అమెరికా

బేసిగ్గా అమెరికన్ సైకాలజీ ఎలాంటిదంటే.. ఆ దేశ పౌరులకు అన్నీ సమయానికి అందజేయడమే. ఇదే ఆ దేశ పరిపాలన ముఖ్య ఉద్దేశం. అందుకే యూఎస్ తన దగ్గరున్న ఆయుధాలతో పెద్దన్న పాత్ర పోషిస్తూ.. నయానా భయానా ఇతర దేశాల నుంచి తమకు కావల్సిన అవసరాలను తీర్చుకుంటుంది. ఇంపోర్ట్ పైనే ఎక్కువ ఫోకస్ పెడుతుంది. ఒక రకంగా చెబితే.. తమ దేశం మాత్రం పర్యావరణ పరంగా పుష్కలంగా ఉండాలి. తమకు కావల్సిన వస్తువులు ఇతర దేశాలు ఏమై పోయినా.. తవ్వేసి.. లాక్కోవాలి. ఇదే బేసిక్ అమెరికన్ థియరీ.

వెస్ట్ వర్జీనియాలోని పాత బొగ్గు గని, నార్త్ డకోటాలోని లిగ్నైట్ గని..

అప్పటికీ అమెరికాలో కొన్ని సంస్థలు.. ఖనిజాలను వెలికితీసే మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఉదాహరణకు వెస్ట్ వర్జీనియాలోని పాత బొగ్గు గని, నార్త్ డకోటాలోని లిగ్నైట్ వంటి మూలకాలను తవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఇడాహోలో యాంటిమోనీ గనిని సైతం ఇలాగే తవ్వే యత్నం చేస్తున్నారు. ఇందుకుగానూ రక్షణ శాఖ నుంచి 5 లక్షల డాలర్ల గ్రాంటును తీసుకుందీ కంపెనీ. ప్రస్తుతం ఈ యాంటిమోనీ సరఫరా.. 90 శాతం వరకూ చైనా, రష్యా, తజకిస్తాన్ దేశాల నుంచే జరుగుతోంది.

తవ్వకాలు తిరిగి ప్రారంభించిన అమెరికా

చైనాను ఎలాగైనా సరే దారికి తేవడంలో భాగంగా ట్రంప్ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో అది బెడిసి కొడుతోంది. ట్రంప్ డెసిషన్స్ కారణంగా.. మస్క్ లాంటి అమెరికన్ బిజినెస్ మెన్ కి తీవ్ర ఇబ్బందికరంగా మారుతోంది. ఏ విభాగంలో చూసినా అమెరికా కన్నా బలమైన దేశం చైనానే. ఇటు జనాభా పరంగా, అటు ఆర్ధికంగా, ఖనిజాల పరంగా.. చైనాను ఢీ కొట్టి ముందుకెళ్లడం యూఎస్ కి సాధ్యం కాదు. కానీ అమెరికన్ బ్లడ్ గ్రూప్ లో అలా తలొంచుకుని కూర్చోవడమే తెలీదు. ఏదో ఒక రకంగా దారికి తెచ్చుకోవడంలో అనుక్షణం పావులు కదుపుతూనే ఉంటుంది యూఎస్ అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ ట్రంప్, బైడెన్ తేడా లేదు. అధ్యక్షుడు ఎవరైనా.. సరే ఇదే తరహా పాలన కొనసాగుతుంది.

అదంత తేలిగ్గా ఒప్పుకోని అమెరికా

ఇరుగు పొరుగున ఉన్న కెనెడా, మెక్సికోలతోనే యూఎస్ ఎడమొహం పెడమొహంగా ఉంటోంది. 25 శాతం సుంకాల దెబ్బకు కెనడియన్లు అమెరికాలో అడుగు పెట్టకూడదంటూ ఒట్టేసుకున్నారు. దీంతో అమెరికన్ టూరిజం పడకేసిన సంగతి తెలిసిందే. మెక్సికన్లు దేశంలోకి చొరబడకుండా ఉండేలా.. గోడ కడతానంటారు ట్రంప్. ఒక వేళ అలాంటిదే జరిగితే అమెరికాలోని పారిశుధ్యం ముక్కు పుటాలను అదరగొడుతుంది. అంతేనా రుచికరమైన వంటలకు కూడా అలమటించాల్సి వస్తుంది. ఒక పక్క చూస్తే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటోన్న ట్రంప్ ఉద్దేశమేంటి? ఇతరులను తమ దేశానికి రానివ్వకుండా చేసి.. వారు చేసే పనులు స్థానిక అమెరికన్లు దక్కించుకోవాలనే. కానీ ఇప్పటికే ప్రపంచ భోగాలన్నిటినీ అప్పనంగా అనుభవించిన అమెరికన్లు.. కాయకష్టం చేసి తమకు అవసరమయ్యే ఉత్పత్తుల తయారీ సాధ్యమయ్యే పనేనా? అన్నదొక ప్రశ్న.

ఖనిజ యుద్ధంగా మారనున్న వాణిజ్య యుద్ధం

చైనాను ఎలాగైనా సరే బీట్ చేయాలని భావించింది యూఎస్.. ఆ దేశ ఆధిపత్యాన్ని సహించేది లేదంటూ తెగేసి చెబుతోంది.. యూరోపియన్ కంట్రీస్ తో కలసి ట్రంప్ చేస్తోన్న ఈ వాణిజ్య యుద్ధం ఇప్పడు ఖనిజ యుద్ధంగానూ మారుతోంది. మరి దీనికి ట్రంప్ తగిన పరిష్కారం కనుక్కుంటారా? లేక తమ సొంత భూముల్లోని ఖనిజాలనే తవ్వుకుని.. ఇదే ప్రత్నామ్నయ మార్గంగా భావిస్తారా? చూడాలంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×