Amaran Movie : కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్(Shiva Karthikeyan), క్వీన్ ఆఫ్ ది బాక్స్ ఆఫీస్ సాయి పల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్ర పోషించిన చిత్రం అమరన్ (Amaran). రీసెంట్ గా దీపావళి సందర్భంగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించారు. దివంగత సైనికులు మేజర్ ముకుంద్ వరదరాజన్ (Major Mukundh Varadarajan) సైనిక జీవితం, వ్యక్తిగత జీవితం ఆధారంగా ‘అమరన్’ సినిమాని తెరకెక్కించారు. హీరో కమల్ హాసన్ (Kamal Hassan) బ్యానర్ అయిన రాజ్ కమల్ ఫిలిమ్స్‌తో పాటు సోనీ పిక్చర్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి జీ.వీ.ప్రకాష్ (GV Prakash)సంగీతం సమకూర్చిన విషయం తెలిసిందే. అటు హిందీలో కూడా ఈయనే సంగీత స్వరాలు అందించారు. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల నుంచి విశేష స్పందన అందుకుంది.
ఘనంగా సత్కరించిన ఆర్మీ ఆఫీసర్స్..
ఆర్మీ ఆఫీసర్ల జీవితాన్ని అందరికీ అర్థమయ్యేలా రూపొందించిన ఈ చిత్రం కేవలం తమిళ్లోనే కాకుండా మలయాళం, హిందీ, తెలుగు, కన్నడ వంటి భాషల్లో కూడా మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా విజయం అందుకోవడంతో పలువురు రాజకీయ నాయకులు, నటీనటులు, దర్శకులు సైతం ఈ చిత్రాన్ని సత్కరించగా, ఇప్పుడు ఆర్మీ అధికారులు కూడా గౌరవ అవార్డు అందజేశారు. ఈ సినిమాలో మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రను పోషించిన ప్రముఖ నటుడు శివ కార్తికేయన్ కు “ఆర్మీ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ” తరఫున గౌరవంగా సత్కరిస్తూ అవార్డును బహూకరించారు. ముఖ్యంగా అమరన్ సినిమా సక్సెస్ తర్వాత ఈ అవార్డును అందించడంతో శివకార్తికేయన్ ఆనందానికి అవధులు లేవని చెప్పాలి.
పాత్రలలో లీనమైపోయి నటించిన జంట..
శివ కార్తికేయన్ ఇప్పటివరకు ఏ రోజు కూడా చేయనటువంటి డిఫరెంట్ పర్ఫామెన్స్, అప్పీయరెన్స్ తో చాలా అద్భుతంగా ముకుంద్ పాత్రలో లీనమైపోయారు. ముఖ్యంగా ఆ పాత్రను ఓన్ చేసుకున్నారు. అంతేకాదు ఈ సినిమాలో “ఇందు రెబెక్కా వర్గీస్” పాత్రలో సాయి పల్లవి కూడా చాలా అద్భుతంగా నటించింది. ఇకపోతే ఈ సినిమా విడుదలైన 29 రోజుల్లో రూ.212 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంది ఈ చిత్రం.
శివ కార్తికేయన్ సినిమాలు..
శివ కార్తికేయన్ సినిమాల విషయానికి వస్తే.. అమరన్ సినిమా సక్సెస్ తో మంచి జోష్ మీద ఉన్న ఈయన ప్రస్తుతం ఏ.ఆర్.మురగదాస్ (A.R. Muragadas) దర్శకత్వంలో ఎస్కే 23(#SK 23)అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఎస్కే 24(#SK 24) అనే చిత్రంతో లేడీ డైరెక్టర్ తో కలిసి పని చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
సాయి పల్లవి సినిమాలు…
ఇక సాయి పల్లవి సినిమాల విషయానికి వస్తే.. గతంలో నాగచైతన్య (Naga Chaitanya)తో కలిసి శేఖర్ కమ్ముల (Sekhar kammula) దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ సినిమా చేసి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు మళ్లీ అదే హీరోతో ‘తండేల్’ సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాతో మళ్లీ అదే మ్యాజిక్ రిపీట్ చేయబోతున్నారు ఈ జంట.