AP Schemes: ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సంక్రాంతి లోగా అర్హులకు తమ ప్రభుత్వం న్యాయం చేయనుందని, ఎన్నో ఏళ్లుగా వేచి ఉన్న అర్హులకు తాము డిసెంబర్ 28వ తేదీలోగా మేలు చేకూర్చనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ప్రతి సామాన్య కుటుంబానికి రేషన్ కార్డు లేనిదే పని కాదు. అందుకు ప్రధాన కారణం ప్రతి నెలా ప్రభుత్వం అందించే రేషన్ పొందే సదుపాయం కూడా ఈ కార్డు ద్వారానే అందుతుంది. అంతేకాదు ఏ ప్రభుత్వ పథకం ద్వారానైనా లబ్ధి చేకూరాలంటే రేషన్ కార్డు తప్పనిసరి. రేషన్ కార్డు లేకుంటే ఏ సంక్షేమ పథకాలు అర్హత సాధించలేము.
కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీపం-2 పథకానికి కూడా అనర్హులే. అందుకే ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఆధారమేనని చెప్పవచ్చు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ పథకం లబ్ధి చేకూరాలనా రేషన్ కార్డునే ప్రాతిపదికగా తీసుకుంటారు. అంతటి ప్రాధాన్యత గల రేషన్ కార్డు లేని వారందరికీ ప్రభుత్వం నూతన రేషన్ కార్డులను మంజూరు చేసేందుకు సిద్ధమవుతోంది.
రేషన్ కార్డును అందించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించగా, సంక్రాంతి లోగా అర్హులందరికీ నూతన రేషన్ కార్డు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. డిసెంబర్ 2వతేదీ నుండి 28వతేదీ లోగా అర్హుల నుండి రేషన్ కార్డుకై దరఖాస్తులను స్వీకరిస్తారు. అనంతరం అర్హులకు జనవరిలో నూతన కార్డులను అందజేస్తారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలోనే, నూతన రేషన్ కార్డులను అందజేస్తామని ప్రకటించింది.
Also Read: Woman Kidnaps Boyfriend: ప్రియుడిపై మరీ అంత ప్రేమనా.. ఏకంగా కిడ్నాప్ చేసి మరీ.. అలా చేసిందేంటి!
అలాగే మంత్రి నారా లోకేష్ సారథ్యంలో యువగళం పాదయాత్ర నిర్వహించిన సమయంలో కూడా, గత ప్రభుత్వం అర్హుల కార్డులను తొలగించిందని తమకు న్యాయం చేయాలని భాదితులు కోరారు. ఈ నేపథ్యంలో ముందుగా అర్హత కలిగిన ప్రతి నిరుపేద కుటుంబానికి రేషన్ కార్డు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోబోతోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి మరచిపోవద్దు సుమా.. డిసెంబర్ నెలలో దరఖాస్తు చేసుకోండి.