Tomato Face Pack: టమాటో చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి, చర్మ సంబంధిత సమస్యలను తొలగించడానికి ఉపయోగిస్తారు. అందాన్ని పెంచుకోవాలంటే టమాటోను నేరుగా ముఖానికి అప్లై చేసుకోవచ్చు. టమాటోలను నేరుగా చర్మంపై రుద్దడం వల్ల జిడ్డుగల చర్మానికి కూడా ప్రయోజనం చేకూరుతుంది. ఎందుకంటే టమాటోలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మంలోని జిడ్డును తగ్గించి, చర్మాన్ని పునరుజ్జీవింపజేయడంలో సహాయపడతాయి.
టమాటోలో విటమిన్-సి, విటమిన్-ఇ, లైకోపీన్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఈ లక్షణాలు చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోతాయి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే మురికి, మృతకణాలు క్లీన్ అవడంతో పాటు చర్మం యొక్క రంగు కూడా మెరుగుపడుతుంది. టమాటోలో అనేక రకాల ఎంజైమ్‌లు ,పోషకాలు ఉన్నాయి. వీటి కారణంగా టమాటాను ముఖానికి వాడటం వల్ల మచ్చలు,మొటిమలు తొలగిపోతాయి.
ట్యాన్ తొలగిస్తుంది:
టమాటోతో మీరు మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవచ్చు . దీని కోసం, ఒక టమోటా ముక్కను ముఖంపై 15-20 నిమిషాలు రుద్దండి . అరగంట తర్వాత శుభ్రమైన నీటితో ముఖం కడగాలి. టమాటోలో ఉండే ఎంజైమ్‌లు చర్మాన్ని సున్నితంగా ఎక్స్‌ఫోలియేట్ చేస్తాయి. ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. దీంతో ముఖ సౌందర్యం పెరుగుతుంది. అంతే కాకుండా టమాటో లోని పోషకాలు ముడతలను నివారించడంలో సహాయపడుతుంది. దీంతో వృద్ధాప్యం కూడా అరికట్టడంతో పాటు చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.
టమాటో స్క్రబ్ ఉపయోగించండి:
మీరు టమాటోను నేరుగా ముఖానికి అప్లై చేయకూడదు అని అనుకుంటే.. ఒక గిన్నెలో 1 టీ స్పూన్ చక్కెర పొడి, 2 టేబుల్ స్పూన్ల టమాటో పేస్ట్ కలిపి పేస్ట్ లాగా తయారు చేసి ముఖంపై బాగా స్క్రబ్ చేసి 10 నిమిషాల తర్వాత ముఖాన్ని కడగాలి. ఇలా చేయడం వల్ల ముఖంలోని మృతకణాలు తొలగిపోయి సహజసిద్ధమైన కాంతి తిరిగి వస్తుంది. టమాటోను ముఖంపై రుద్దడం వల్ల ముఖంపై కనిపించే చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. దీని వల్ల దుమ్ము, ధూళి కణాలు పేరుకుపోకుండా ఉంటాయి. దీని వల్ల చర్మంపై మొటిమలు మొదలైనవి పెరగకుండా ఉంటాయి.
టమాటో ఫేస్ ప్యాక్:
టమాటోను నేరుగా ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖ చర్మం యొక్క సహజ రూపాన్ని కాపాడుతుంది. దీన్ని నేరుగా అప్లై చేయడం వల్ల ముఖంపై ఉన్న మచ్చలు తొలగిపోతాయి. టమాటోలో ఉండే విటమిన్ సి ,యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మొటిమల మచ్చలను త్వరగా నయం చేయడంలో సహాయపడతాయి. మీరు దీంతో ఫేస్ ప్యాక్ తయారు చేసుకుని కూడా ఉపయోగించవచ్చు.
దీని కోసం ముందుగా 1 టమాటోను మిక్సీలో బాగా గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసి ఈ పేస్ట్ కు కొద్దిగా తేనె, అలోవెరా జెల్ కలిపి ముఖానికి పట్టించి అరగంట సేపు అలాగే ఉంచాలి.
తర్వాత మంచినీటితో ముఖాన్ని కడుక్కోవాలి. మీరు దీన్ని వారానికి రెండుసార్లు ఉపయోగించవచ్చు.
Also Read: ఈ ఆయిల్ వాడితే చాలు.. జుట్టు పెరగడం పక్కా !
టమాటోలు టానింగ్ నుండి రక్షిస్తాయి:
విటమిన్ ఎ , సి కాకుండా, టమాటోలో ఆమ్ల గుణాలు కూడా ఉన్నాయి. దీని కారణంగా ఇది చర్మం యొక్క pH స్థాయిని నిర్వహించడంలో సహాయపడుతుంది . అంతే కాకుండా చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. టమాటోను ముఖంపై రుద్దడం వల్ల UV కిరణాల నుండి చర్మాన్ని కాపాడుతుంది. ఇది స్కిన్ టానింగ్ చికిత్సలో సహాయపడుతుంది.
ఇందుకోసం రెండు చెంచాల పెరుగులో సగం టమాటో మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత శుభ్రమైన నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇది సూర్యుని అతినీలలోహిత కిరణాల నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.