BigTV English

Kannappa: శివ శివ శంకర సాంగ్.. మొదటిసారి కన్నప్ప మీద పాజిటివ్ వైబ్ వచ్చిందయ్యా..

Kannappa: శివ శివ శంకర సాంగ్.. మొదటిసారి కన్నప్ప మీద పాజిటివ్ వైబ్ వచ్చిందయ్యా..

Kannappa: అప్పుడెప్పుడో  ఢీ అనే సినిమాతో మంచు వారబ్బాయి విష్ణు భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత మధ్యలో చాలా సినిమాలు వచ్చాయి కానీ.. ఆ సినిమాను కొట్టే హిట్ మాత్రం అందలేదు. అందులోనూ మంచు ఫ్యామిలీ ప్రస్తుతం ఎన్ని వివాదాలను ఎదుర్కుంటుందో అందరికి తెల్సిందే. ఆ వివాదాలేమి లెక్కచేయకుండా మంచు విష్ణు ఈసారి ఎలాగైనా మంచి హిట్ పట్టాలని  శివయ్యనే నమ్ముకున్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం కన్నప్ప. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మోహన్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు.


ఇక ఈ చిత్రంలో మంచు విష్ణు సరసన ప్రీతీ ముకుందన్ నటిస్తుండగా.. ఇండస్ట్రీలోని స్టార్స్ అందరూ క్యామియోలో నటిస్తున్నారు. మోహన్ బాబు, ప్రభాస్, శరత్ కుమార్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మధుబాల ఇలా చాలామంది స్టార్స్ ఈ సినిమాలో నటించడంతో సినిమాపై ఒక హైప్ క్రియేట్ అయ్యింది. అయితే వీరి క్యారెక్టర్లు.. ఆ క్యారెక్టర్లకు తగ్గ కాస్ట్యూమ్స్ తో పోస్టర్లు రిలీజ్ చేయడం.. అవేమి ప్రేక్షకులకు ఒక పట్టాన నచ్చలేదు. ఇంతమంది స్టార్స్ ఉన్నా కూడా ఎక్కడా పాజిటివిటీ లేని సినిమా అంటే ఇదే అనుకున్నవారు కూడా లేకపోలేదు. ఇక పోస్టర్లు, టీజర్  అన్ని అయిపోయాక.. మంచు విష్ణు లిరికల్ వీడియోస్ మీద పడ్డాడు. కన్నప్ప నుంచి ఒక్కో సాంగ్ ను రిలీజ్ చేస్తున్నాడు.

తాజాగా కన్నప్ప నుంచి శివ శివ శంకర అనే లిరికల్  సాంగ్ ను విడుదల చేశారు. సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. మొట్ట మొదటిసారి కన్నప్ప సినిమాపై ఒక పాజిటివిటీ వచ్చిందంటే అది  ఈ సాంగ్ వలనే అని చెప్పాలి. ఒక పేద శివ భక్తుడు తిన్నడు.. శివుడిని ఎంతలా ఆరాధిస్తున్నాడో ఈ సాంగ్ లో చూపించారు. చెట్టు, పుట్ట దాటుకొని తన శివయ్య కోసం అరుదైన పూలను సేకరించి తీసుకురావడం.. శివలింగం ఎండకు ఎండుతుంటే ఆకులను తెచ్చి నీడను ఇవ్వడం.. ఎక్కడ చూసినా.. ఏది చూసినా అందులో శివయ్యను వెతకడం ఎంతో బాగా చూపించారు.


VD12 Teaser: రౌడీ హీరో యాక్టింగ్.. సూర్య వాయిస్.. నెక్స్ట్ లెవెల్ అంతే

శివ భక్తుడు తిన్నడుగా  మంచు విష్ణు ఒదిగిపోయాడు. మునుపెన్నడూ లేని నటనతో విష్ణు కనిపించాడు. ఇక లొకేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. రామజోగయ్య  శాస్త్రి  అందించిన లిరిక్స్ ను ఇంకా అద్భుతంగా సింగర్ విజయ్ ప్రకాష్ ఆలాపించాడు. ఈ సాంగ్ యూట్యూబ్ లో సెన్సేషన్ సృష్టిస్తుంది.  చాలాకాలం తరువాత శివయ్య పాటను వింటున్నాం.. ఎంతో అద్భుతంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

ఇప్పటివరకు కన్నప్పపై ఉన్న నెగిటివిటీ ఈ ఒక్క సాంగ్ తుడిచేసింది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు.  ఇకపోతే కన్నప్ప  సినిమా ఏప్రిల్ 25 న రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇప్పటివరకు ఉన్న నెగిటివిటీతో కన్నప్పను ఎవరు కన్నెత్తి చూడలేదు.  ఇప్పుడు  ఈ సాంగ్ తో మంచి హైప్ వచ్చింది. అలానే  ముందు ముందు  సాంగ్స్  కూడా హైప్ తీసుకొస్తే.. సినిమా  కచ్చితంగా  హిట్ అయ్యే  ఛాన్స్ లు లేకపోలేదని టాక్ నడుస్తోంది. మరి ఈ సినిమాతో మంచు విష్ణు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. 

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×