CSIR-CDRI Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇంటర్ పాసై టైపింగ్ వచ్చిన వారికి ఇది మంచి అవకాశం. సీఎస్ఐఆర్- సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్(CSIR-CDRI) లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా లభిస్తుంది.
లక్నో, సీఎస్‌ఐఆర్-సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(CSIR-CDRI)లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్(హిందీ/ఇంగ్లీష్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. మార్చి 10న దరఖాస్తు గడువు ముగియనుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 11
లక్నో, సీఎస్‌ఐఆర్-సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(CSIR-CDRI)లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనో గ్రాఫర్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
ఖాళీల వారీగా పోస్టులు:
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 7 ఉద్యోగాలు
జూనియర్ స్టెనోగ్రాఫర్ (హిందీ, ఇంగ్లిష్): 4 ఉద్యోగాలు
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఇంటర్ పాస్ తో పాటు టైపింగ్ కూడా వచ్చి ఉండాలి.
వయస్సు: ఉద్యోగాన్ని వయస్సు ఉంది. 2025 మార్చి 10 నాటికి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగానికి 28 ఏళ్లు, జూనియర్ స్టెనో గ్రాఫర్ ఉద్యోగానికి(హిందీ,ఇంగ్లిష్)కి 27 ఏళ్ల వయస్సు మించరాదు.
జీతం: ఉద్యోగాన్ని బట్టి జీతం ఉంది. నెలకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌కు రూ.19,900 – రూ.63,200, జూనియర్ స్టెనోగ్రాఫర్(హిందీ/ఇంగ్లీష్)కు రూ.25,500 – రూ.81,100 వేతనం ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేది: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2025 మార్చి 10 లోగా దరఖాస్తు పెట్టుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.
ఉద్యోగ ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
Also Read: CM Revanth Reddy: ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుక.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం
అఫీషియల్ వెబ్ సైట్: https://cdri.res.in/
………………………………………………………………..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు..
ఎంబీబీఎస్ పాసైన అభ్యర్థులకు గుడ్ న్యూస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఆఫ్ లైన్ లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
కోల్ కతా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)లో కాంట్రాక్ట్ విధానంలో మెడికల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 14న దరఖాస్తుకు గడువు ముగియనుంది. ఓసారి నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.
మొత్తం జాబ్ వెకెన్సీల సంఖ్య: 4
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెడికల్ కన్సల్టెంట్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్ పాసై ఉండాలి.
ఉద్యోగ ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 14
ఉద్యోగ జీతం: ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు గంటకు రూ.1000 చొప్పున ఇస్తారు.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://opportunities.rbi.org.in/
అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.