Indian Smallest And Largest Trains: భారతీయ రైల్వేలో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. దేశంలోనే అతి పెద్ద రైలు, అతి చిన్న రైలు, అత్యంత పొడవైన రూట్, అత్యంత దూరం ప్రయాణించే రైలు, అత్యంత వేగంగా ప్రయాణించే రైలు, అత్యంత నెమ్మదిగా వెళ్లే రైలు ఇలా ఒకటేమిటి ఎన్నో ఆసక్తికర అంశాలు ఉన్నాయి. అయితే, ఇండియన్ రైల్వేలో రెండు ప్రత్యేకమైన రైళ్ల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాటిలో ఒకటి దేశంలోనే అత్యంత చిన్న రైలు కాగా, మరొకటి అత్యంత పెద్ద రైలు. ఇంతకీ ఆ రైళ్లు ఎక్కడి నుంచి ఎక్కడి ప్రయాణిస్తాయో తెలుసా…
దేశంలో అత్యంత చిన్న రైలు.. కేవలం మూడే బోగీలు!
సాధారణంగా ప్యాసింజర్ రైళ్లు 18 నుంచి 22 బోగీల వరకు కలిగి ఉంటాయి. గూడ్స్ రైళ్ల విషయానికి వస్తే సుమారు మూడు రెట్లు ఎక్కువగా ఉంటాయి. అంటే, సుమారు 45 నుంచి 60 వ్యాగన్ల వరకు ఉంటాయి. అవసరాన్ని బట్టి సుమారు 10 వ్యాగన్ల వరకు జోడించే అవకాశం ఉంటుంది. కానీ, దేశంలో అత్యంత చిన్న రైలు కేరళ రాష్ట్రంలో ఉంది. ఈ రైలుకు కేవలం 3 బోగీలే ఉంటాయి. కొచ్చి హార్బర్ టెర్మినల్ నుంచి ఎర్నాకుళం జంక్షన్ వరకు ఈ రైలు ప్రయాణిస్తుంది. ఈ రైలు బోగీలు కూడా ఆకుపచ్చ రంగును కలిగి ఉంటాయి. ఈ రైలులో సుమారు 300 మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఈ రైలు రోజు రెండు సార్లు నడుస్తుంది. మార్గ మధ్యలో ఒకే ఒక్క స్టాఫ్ ఉంటుంది. సుమారు 9 కిలో మీటర్ల దూరాన్ని 40 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. అటు యూపీలోనూ ఓ చిన్న రైలు ఉంది. ఐత్ కొంచ్ షటిల్ రైలు కూడా మూడు బోగీలు కలిగి ఉంటుంది. ఈ రైలు కొంచ్ నగర్ నుంచి జలౌన్ సర్సౌకి స్టేషన్ ప్రయాణిస్తుంది. ఈ రైలు 30 కి. మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఈ రైలు ఎక్కడ చెయ్యి ఎత్తినా ఆగుతుంది.
Read Also: గుడ్ న్యూస్, తెలుగు రాష్ట్రాలకూ ఓ వందేభారత్ స్లీపర్.. ఏ రూట్‌లో నడుస్తుందంటే?
దేశంలో అతిపెద్ద రైలు.. మొత్తం 295 వ్యాగన్లు
ఇక దేశంలోనే అతిపెద్ద రైలుగా గూడ్స్ రైలు గుర్తింపు తెచ్చుకుంది. ఈ రైలు ఏకంగా 295 వ్యాగన్లను కలిగి ఉంటుంది. సుమారు 3.5 కిలో మీటర్లు పొడవుగా ఉండే ఈ రైలును చూస్తే.. పాము పాకుతూ వెళ్లినట్లు కనిపిస్తుంది. ట్రాక్ పక్కన నిలబడి ఈ రైలు వ్యాగన్లు లెక్కిస్తే కళ్లు తిరిగిపోవడం ఖాయం. ఈ రైలుకు సూపర్ వాసుకి అని పేరు పెట్టారు. మొత్తం ఇందులో 6 ఇంజిన్లు ఉంటాయి. వాసుకి దేశంలోని పలు గనుల నుంచి బొగ్గు రవాణాకు వినియోగిస్తున్నారు. బొగ్గు గనులు అధికంగా ఉన్నా చత్తీస్ గఢ్ లోని కోర్బా నుంచి మహారాష్ట్రలోని నాగ్ పూర్ వరకు బొగ్గును తీసుకెళ్తుంది. ఈ రైలు ఒక్కసారి 27 వేల టన్నుల బొగ్గును రవాణా చేస్తుంది.
Read Also: దివ్యాంగులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్, ఇక ఆ పాసులు ఈజీగా తీసుకోవచ్చట!