Saif Ali Khan : బాలీవుడ్ నవాబ్ సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) దాడి ఘటన బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 6 కత్తిపోట్ల కారణంగా గత 5 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, నిన్న లీలావతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కానీ ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతూ, పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
6 కత్తిపోట్లు, ఆపరేషన్… ఇంత ఫిట్ గా ?
నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) ఆసుపత్రి నుండి మంగళవారం డిశ్చార్జ్ అయిన తర్వాత తనను చూడడానికి వచ్చిన అభిమానులు, మీడియాకు థ్యాంక్స్ చెప్పారు. అయితే ఆ టైమ్ లో సైఫ్ చాలా హెల్దీగా ఉన్నట్టు, అసలేం జరగలేదు అన్నట్టుగా ఫిట్ గా, నవ్వుతూ కన్పించారు. సైఫ్ అలా కన్పించడమే ఇప్పుడు దాడిపై కొత్త అనుమానాలు లేవనెత్తుతోంది. ఎందుకంటే కానీ నిన్నటిదాకా సైఫ్ కు దాడి వల్ల తీవ్ర గాయాలు అయ్యాయని, వెన్నుముక, మెడ, చేతులపై కత్తితో దాడి కారణంగా గాయాలు అయ్యాయని వార్తలు వచ్చాయి.
తాజాగా వైరల్ అవుతున్న ఆ వీడియోను శివసేన నాయకుడు సంజయ్ నిరుపమ్ షేర్ చేస్తూ దాడిపై అనుమానం వ్యక్తం చేశారు. ఐదు రోజుల తర్వాత ఆసుపత్రి నుండి బయటకు వచ్చిన ఆయన , 6 కత్తిపోట్లు ఆపరేషన్ తర్వాత కూడా ఎలా ఇంత ఫిట్‌గా ఉన్నారని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
ఎంపీ సంజయ్ నిరుపమ్ తన పోస్ట్‌లో “వైద్యుల ప్రకారం, సైఫ్ అలీఖాన్ వీపులో 2.5 అంగుళాల కత్తి గాయం అయ్యింది. ఈ కత్తిని వెన్నుముక దగ్గరలో గుచ్చినట్టు అంచనా. దానిని తొలగించడానికి 6 గంటల పాటు కొనసాగింది. ఈ సంఘటన జనవరిలో జరిగింది. అంటే జనవరి 16న ఘటన జరిగితే, జనవరి 21న హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయినప్పుడు ఆయన చాలా ఫిట్‌గా ఉన్నాడు. కేవలం ఐదు రోజుల్లో ఇంత ఫిట్ గా ఎలా ఉన్నాడు?” అంటూ రాసుకొచ్చాడు.
సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) నివాసంలో దొంగతనానికి వెళ్ళిన బంగ్లాదేశ్ నిందితుడు, సైఫ్ పై దాడి చేయడంతో ఆసుపత్రిలో ఆపరేషన్ జరిగింది. అతని వెన్నుముక దగ్గర గుచ్చుకున్న కత్తి ముక్కను ఈ ఆపరేషన్ లో తొలగించారు. ఇప్పుడు సైఫ్ పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ.. విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని అన్నారు. దాంతో కొన్ని రోజులు షూటింగ్‌కి దూరంగా ఉండాల్సి వస్తుందని టాక్ నడిచింది. కానీ తాజా వైరల్ వీడియో చూస్తుంటే ఇదంతా అసలు జరిగిందా? ఊరికే హంగామా చేశారు? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
डॉक्टरों का कहना था कि
सैफ अली खान की पीठ में 2.5 इंच अंदर तक चाकू घुसा था।
संभवत: अंदर ही फँसा था।
लगातार 6 घंटे ऑपरेशन चला।
यह सब 16 जनवरी की बात है।
आज 21 जनवरी है।
अस्पताल से निकलते ही इतना फिट ?
सिर्फ़ 5 दिन में ?
कमाल है !#SaifAliKhan pic.twitter.com/7tCT9g0jx8— Sanjay Nirupam (@sanjaynirupam) January 21, 2025
ప్రైవేట్ సెక్యూరిటీ
కాగా ముంబై పోలీసులు నిందితుడు మహ్మద్ షరీఫుల్లాను అరెస్టు చేశారు. అరెస్ట్ తర్వాత నిందితుడు బంగ్లాదేశ్‌లో జాతీయ స్థాయి రెజ్లింగ్ ఛాంపియన్ అని తేలింది. మీడియా కథనాల ప్రకారం నిందితులు ఏడు నెలల క్రితం అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించాడు. ముంబైకి వచ్చిన తర్వాత విజయ్ దాస్ పేరుతో వెయిటర్ గా, హౌస్ కీపింగ్ గా పని చేశాడు. కాగా ప్రస్తుతం సైఫ్ ఇంటి దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో నటుడు రోనిత్ రాయ్ సెక్యూరిటీ ఏజెన్సీ ఎస్ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ సేవలను నటుడు సైఫ్ అలీఖాన్ తీసుకున్నారు.