BigTV English

Shobana: దృశ్యం సినిమాలో మీనా పాత్ర నేను చేయాల్సింది.. ఎందుకు వదిలేశాను అంటే..?

Shobana: దృశ్యం సినిమాలో మీనా పాత్ర నేను చేయాల్సింది.. ఎందుకు వదిలేశాను అంటే..?

Shobana: ఇండస్ట్రీలో  ఒకరి పాత్ర మరొకరికి వెళ్లడం.. ఒకరి కథ మరొకరు చేయడం సర్వ సాధారణం. ప్రతి మెతుకుపై తినేవారి పేరు రాసిపెట్టి ఉన్నట్లే.. ప్రతి పాత్రకు చివరి పేరు రాసి పెట్టి ఉంటుంది. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఎంతమంది ఎన్ని రకాలుగా ఒకరిని ఒక పాత్ర కోసం అనుకున్నా.. రాసిపెట్టి లేకపోతే ఆ పాత్ర వారికి దక్కదు. ఇలా ఎంతోమంది స్టార్స్ ఎన్నో పాత్రలను వదులుకున్నారు.


కొన్ని వారు కావాలని వదులుకుంటే.. ఇంకొన్ని వేరే విధంగా దూరమవుతాయి. ఆ సినిమాలోని పాత్ర కనుక తాము చేయకుండా వేరేవాళ్లుచేసి  హిట్ అయితే.. అది చేజారిందని ఇప్పటికీ రిగ్రెట్ ఫీల్ అయ్యే స్టార్స్ లేకపోలేదు. అయితే ఒక హిట్ సినిమాలో పాత్ర పోయినందుకు ఒక సీనియర్ హీరోయిన్ ఫీల్ అవ్వలేదు కానీ, ఆ పాత్ర ముందు తనకే వచ్చిందని చెప్పుకొచ్చింది. ఆమె ఎవరో కాదు అందాల నటి శోభన.

Pooja Hegde: బుట్టబొమ్మ భయపెడుతుందా.. మాకు నమ్మకం లేదు దొరా..?


ఇప్పుడంటే శోభన పేరు ఈ జనరేషన్ వారికి తెలియదు కానీ, అప్పట్లో ఆమె కళ్లకు, డ్యాన్స్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. ఎన్నో మంచి సినిమాల్లో నటించి మెప్పించిన శోభన కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఇండస్ట్రీకి దూరమైంది. ఒక డ్యాన్స్ స్కూల్ పెట్టి చిన్నారులకు నృత్యం నేర్పిస్తుంది. ఇక చాలా కాలం తరువాత ఆమె కల్కి సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. అయితే అంతకుముందు తమిళ్, మలయాళ సినిమాల్లో చేస్తూ వచ్చింది. ప్రస్తుతం శోభన చాలా సెలెక్టీవ్ గా సినిమాలను ఎంచుకుంటుంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె.. తాను వదులుకున్న పాత్రల గురించి చెప్పుకొచ్చింది. మాలీవుడ్ మెగాస్టార్ మోహన్ లాల్ కెరీర్ బెస్ట్ సినిమాల్లో దృశ్యం టాప్ 10 లో ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. జీతూ జోసెఫ్ దర్శహకత్వం వహించిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మలయాళంలో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. కన్న కూతురు కోసం ఒక తండ్రి.. ఒక హత్యను ఎలా రూపురేఖలు లేకుండా చేశాడు..?  అసలు ఆ హత్య చేయలేదని ఎలా నిరూపించాడు.. ? అనే కథతో  దృశ్యం తెరకెక్కింది.

Sandalwood: రిషబ్ వర్సెస్ రష్మిక.. గొడవలు నిజమేనా.. ఒక్క పోస్ట్ తో క్లారిటీ..!

ఇక ఈ సినిమాలో మోహన్ లాల్ భార్యగా మీనా కనిపించింది. తెలుగులో ఈ సినిమా డబ్ అయితే అందులో కూడా మీనానే కనిపించింది. ఈ సినిమా తరువాత మీనాకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే మొదట మీనా పాత్రకు శోభనను అనుకున్నారట. ఆ విషయం గురించి శోభన మాట్లాడుతూ.. ” దృశ్యం సినిమాలో మీనా పాత్రకు మొదట నన్ను సంప్రదించారు. కథ నచ్చినా.. అప్పుడు నేను వినీత్ శ్రీనివాసన్ సినిమాకు డేట్స్ ఇచ్చేశాను. అందుకే ఈ సినిమాను రిజెక్ట్ చేశాను.

నేను మోహన్ లాల్, వినీత్ ఇద్దరితో కలిసి పనిచేసాను. మోహన్ లాల్ ఎప్పుడు పనిలో నిమగ్నమై ఉంటారు.ఆయనతో పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది” అని చెప్పుకొచ్చింది. ఇక చాలాకాలం తరువాత మోహన్ లాల్ సరసన శోభన నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో వీరి జంట ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×