Shobhita dhulipala : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నాగచైతన్య (Naga Chaitanya) ఎట్టకేలకు మళ్లీ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. గతంలో సమంత (Samantha)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఆమెతో ఎక్కువ కాలం జీవితాన్ని పంచుకోలేకపోయారు. అలా 2021 అక్టోబర్ 2న విడాకులు ప్రకటించి, అందరిని ఆశ్చర్యపరిచారు. అయితే విడాకుల తర్వాత చాలా మంది సమంతను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ దూషించారు. కానీ అసలు విడాకులకు కారణం ఏమిటి? అన్న విషయంపై మాత్రం ఇప్పటి వరకు ఎవరు స్పందించలేదు. దీంతో ప్రతి ఒక్కరు కూడా సమంతనే టార్గెట్ చేయడంతో సమంత కూడా తనదైన రీతిలో అమ్మ చెప్పింది అంటూ ఒక కాన్సెప్ట్ తో రకరకాల పోస్ట్లు షేర్ చేస్తూ వచ్చింది.
ఎంగేజ్మెంట్ తో ఒక్కటైన జంట..
ఇదిలా ఉండగా విడాకుల తర్వాత నాగచైతన్య , శోభిత ధూళిపాలతో డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. అయితే వీరిద్దరూ కలిసి ఒకసారి లండన్ లోని రెస్టారెంట్ లో కనిపించడంతో పలు రకాల వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఈ విషయాలపై ఈ జంట స్పందించలేదు. అప్పుడప్పుడు మీడియా కంట పడ్డారు కానీ ఎవరు కూడా నోరు విప్పక పోయేసరికి రూమర్స్ జోరుగా ప్రచారం అయ్యాయి. కానీ ఎట్టకేలకు ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన నిశ్చితార్థం చేసుకొని ఆ ఫోటోలను నాగార్జున షేర్ చేయడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇక రూమర్స్ కాస్త నిజమయ్యాయని ప్రతి ఒక్కరు కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.
పెళ్లికి సిద్ధమవుతున్న శోభిత – నాగచైతన్య..
ఇక ప్రస్తుతం శోభిత, నాగచైతన్య పెళ్లికి సిద్ధమవుతున్నారు. రేపు అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్ వేసి అక్కడ దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు వీరి వివాహం జరిపించబోతున్నట్లు తెలుస్తోంది..ఈ క్రమంలోనే మరొకవైపు శోభిత పెళ్లికూతురు గెటప్ లో ముస్తాబయి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇదే సమయంలోనే పెళ్లి వేళ నాగచైతన్య మాజీ భార్య సమంతకు తనదైన శైలిలో కౌంటర్ ఇవ్వడంతో నాగచైతన్య అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. అసలు విషయంలోకి వెళ్తే.. సాధారణంగా సెలబ్రిటీలందరూ కూడా ఈవెంట్లకు డిజైనర్ల చేత శారీలు, డ్రెస్సులు డిజైన్ చేయించుకుంటూ ఉంటారు. కానీ అక్కినేని ఇంటికి కాబోయే కోడలు శోభిత మాత్రం చాలా సింపుల్ గా చెల్లెలితో కలిసి షాప్ కి వెళ్లి మరీ చీరను కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని ఆమె సన్నిహితులు తెలియజేశారు. ఇలా పెళ్లి చీర విషయంలో ఆడంబరాలకు పోకుండా చాలా సింపుల్ గా చీర తీసుకున్నారని సమాచారం.
సమంతకు కౌంటర్ ఇచ్చిన శోభిత..
అంతేకాకుండా బంగారు జరీ వర్క్ తో కాంజీవరం చీరను ఆమె తన పెళ్లిలో కట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆ చీరను తానే స్వయంగా సెలెక్ట్ చేసుకుందట. డిజైనింగ్ హంగులు ఏమీ లేకుండా జాగ్రత్త పడినట్లు సమాచారం. అయితే గతంలో సమంత మాత్రం పెళ్లి విషయంలో స్పెషల్ డ్రెస్సులు, చీరలు డిజైన్ చేయించుకుని ఆశ్చర్యపరిచింది. అటు నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఆ డ్రెస్‌లను రీ డిజైన్ చేసి ఆమె మార్చి వేసిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో శోభితాను చూసి నేర్చుకోవాలని, శోభిత కావాలని సమంతకు కౌంటర్ ఇస్తూ ఇలా చేసిందని కొంతమంది నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.