BigTV English
Advertisement

Shobhita dhulipala: ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ గురించి నోరు విప్పిన చైతూ కాబోయే భార్య..!

Shobhita dhulipala: ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ గురించి నోరు విప్పిన చైతూ కాబోయే భార్య..!

Shobhita dhulipala: శోభిత ధూళిపాళ (Shobhita Dhulipala).. ఈ మధ్యకాలంలో భారీ పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా సినిమాలకంటే వ్యక్తిగత కారణాలవల్ల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా నాగచైతన్య (Naga Chaitanya) తో ఏడడుగులు వేయబోతోంది అని తెలిసిన తర్వాత సోషల్ మీడియాలో ఈమె పేరు బాగా పాపులర్ అయింది. ఇకపోతే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు క్యూట్ జోడీగా గుర్తింపు తెచ్చుకున్న సమంత(Samantha – నాగచైతన్య ,(Naga Chaitanya) ప్రేమించి, వివాహం చేసుకున్నారు. కానీ వివాహం జరిగిన నాలుగేళ్లకే విడాకులు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. విడాకుల తర్వాత సమంత ఎన్నో స్ట్రగుల్స్ ఎదుర్కొందన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవైపు భర్తకు దూరం అవ్వడం, ఇంకొక వైపు సినిమా అవకాశాలు లేకపోవడం, అలాగే మయోసైటిస్ వ్యాధి బారినపడి ఎన్నో ఇబ్బందులు చవిచూసింది.


శోభితతో ఏడు అడుగులు వేయబోతున్న నాగచైతన్య..

అయితే నాగచైతన్య మాత్రం కెరియర్ పై ఫోకస్ పెడుతూనే.. వ్యక్తిగత జీవితం కోసం ఒక అడుగు ముందుకేసారు. అందులో భాగంగానే ప్రముఖ హీరోయిన్ శోభిత దూళిపాళతో ప్రేమాయణం నడిపారు. లండన్ లో ఒక హోటల్లో కనిపించి, అనుమానాలకు తెరలేపిన ఈ జంట.. ఆ తర్వాత పలు సందర్భాలలో మీడియా కంట పడ్డారు. ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన ఇరు కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్థం చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు.ఇప్పుడు డిసెంబర్ 4వ తేదీన పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ స్టుపిడ్.

ఇదిలా ఉండగా తాజాగా అక్కినేని ఇంటికి కోడలుగా వెళ్లబోతున్న శోభిత ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన మొదటి బాయ్ ఫ్రెండ్ గురించి ఆసక్తికర కామెంట్లు చేసింది. శోభిత మాట్లాడుతూ..”చిన్నవయసులోనే నేను ఒక వ్యక్తిని ఎంతో ఇష్టపడ్డాను. అయితే ఆ వ్యక్తి నాపై అటెన్షన్ చూపించలేదు ఎంత ప్రయత్నించినా నా ప్రేమను అంగీకరించలేదు.అతను ఒక స్టుపిడ్. నన్ను చాలా బాధపెట్టారు.అయితే నా ఫస్ట్ క్రష్ మాత్రం స్కూల్ డేస్ లో జరిగింది. అతడు మా క్లాస్ లో కెప్టెన్ కూడా.. అతను అంటే ఎంతో ఇష్టం ఉండేది. కానీ ఆ విషయాన్ని నేను అతనికి చెప్పలేదు. తర్వాత నేను ఎవరిని ఇష్టపడలేదు. కానీ నా లైఫ్ లో చాలా ప్రపోజల్స్ కూడా వచ్చాయి. అయితే స్కూల్ డేస్ లో క్రష్ అంటే ఏంటో కూడా తెలియని సమయంలోనే అవన్నీ జరిగిపోయాయి. స్టడీస్ పైన దృష్టి పెట్టాను. లైఫ్ లో బాగా చదువుకుంటే సెటిల్ అవుదామనే ఆలోచన నన్ను ముందడుగు వేసేలా చేసింది. ఎక్కువగా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ పై దృష్టి పెట్టేదాన్ని” అంటూ శోభిత కామెంట్స్ చేసింది. ప్రస్తుతం శోభిత చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

నాగచైతన్య సినిమాలు..

నాగచైతన్య విషయానికి వస్తే.. ప్రస్తుతం నాగచైతన్య సాయి పల్లవి (Sai Pallavi) తో కలిసి ‘ తండేల్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినా.. కొన్ని కారణాలవల్ల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ అన్నీ కూడా ప్రేక్షకులలో మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి.

Related News

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Big Stories

×