BigTV English

Virat Kohli – DK : నీకో దండం రా బాబు… DK కు వార్నింగ్ ఇచ్చిన కోహ్లీ

Virat Kohli – DK : నీకో దండం రా బాబు… DK కు వార్నింగ్ ఇచ్చిన కోహ్లీ

Virat Kohli – DK : ఐపీఎల్ లో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. వీటిని నిత్యం మనం చూస్తూనే ఉంటాం. నిన్న రాత్రి రాజస్థాన్ రాయలల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నారు. అప్పటికీ మ్యాచ్ రాజస్థాన్ గెలుస్తుందని అంతా భావించారు. అయితే దినేష్ కార్తీక్ కోహ్లీ కి బౌలింగ్ ఈ విధంగా  చేయాలని.. ఫీల్డింగ్ ఇలా  పెట్టమని కెప్టెన్ కి చెప్పమని చిన్న లహా ఇచ్చాడట. అయితే నీకో దండం రా బాబు.. నాకు ఇలాంటి ఉచిత సలహాలు ఇవ్వకు. తాను కెప్టెన్ కాదు కాబట్టి తనకు సలహాలు ఏమి వద్దు అని సూచించాడట కోహ్లీ. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


Also Read :  RCB Fandom : ఒరేయ్ బుడ్డోడా… CSK వాళ్లకు దొరికితే నీ పని అయిపోయినట్టే

గతంలో దినేష్ కార్తీక్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు. ప్రస్తుతం అతను ఆర్సీబీ జట్టుకు మెంటర్ గా పని చేస్తున్నాడు. గత సీజన్ లో దినేష్ కార్తీక్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీ జట్టును ప్లే ఆప్స్ కి చేర్చాడు. చాలా ఇన్నింగ్స్ లో దినేష్ కార్తీక్ కీలక పాత్ర పోషించాడు. కానీ ఫైనల్ కి మాత్రం ఆర్సీబీ వెళ్లలేకపోయింది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్ లో ఇప్పటివరకు 9 మ్యాచ్ లలు ఆడి.. 6 మ్యాచ్ ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. రాజస్థాన్ జరిగిన మ్యాచ్ ని పరిశీలించినట్టయితే తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 205 పరుగులు చేసింది. సాల్ట్ 26, కోహ్లీ 70, పడిక్కల్ 50, టిమ్ డేవిడ్ 23, రజత్ పాటిదార్ 1, జితేష్ శర్మ 20 పరుగులు చేయడంతో ఆర్సీబీ జట్టు 205 పరుగులు చేయగలిగింది.


రాజస్థాన్ రాయల్స్ జట్టు 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. తొలి బంతికే యశస్వి జైస్వాల్ సిక్స్ కొట్టి మంచి ఫామ్ లో కనిపించాడు. 9.1 ఓవర్లకు 110 పరుగులు చేసి 3 మూడు వికెట్లు కోల్పోయింది. ఒక దశలో రాజస్థాన్ రాయల్స్ గెలుస్తుందని అంతా భావించారు. కానీ చివరికీ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వైపు తిగిరింది. జైశ్వాల్ 49, సూర్యవంశీ 16, నితీష్ రాణా 28, రియాన్ పరాగ్ 22, జురెల్ 47, హెట్మెయర్ 11, శుభమ్ దూబె 12 పరుగులుల చేశారు. చివర్లో హెజిల్ వుడ్ అద్భుతమైన బౌలింగ్ చేయడంతో రాజస్థాన్ రాయల్స్ ని కట్టడి చేశారు. దీంతో చివరి ఓవర్లో 17 పరుగులు చేయాల్సి ఉంది. అయితే కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీశాడు. దీంతో 11 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై విజయం సాధించింది. దీంతో ఆర్సీబీ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. దీంతో విరాట్ కోహ్లీ కూడా చాలా ఖుషీ అయ్యాడు. అప్పటి వరకు ఈ సీజన్ లో చిన్న స్వామి స్టేడియంలో ఆర్సీబీ ఒక్క మ్యాచ్  కూడా గెలవలేదు. రాజస్థాన్ పై గెలిచి ఈ సీజన్ లో ఉన్న రికార్డు కి బ్రేకులు వేశారు.

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×