Bayya Sunny Yadav: ప్రముఖ యూట్యూబ్ భయ్యా సన్నీ యాదవ్(Bayya Sunny Yadav)ఇటీవల పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంతో ఈయనపై కేసులు నమోదు కావడం, బెయిల్ మీద బయట తిరగడం వంటివన్నీ జరుగుతూ వచ్చాయి. అయితే ఇటీవల ఈయనని NIA అధికారులు చెన్నై ఎయిర్ పోర్టులో అరెస్టు చేశారంటూ వార్తలు బయటకు వచ్చాయి. దాదాపు ఈయన అరెస్ట్ అయి కూడా 15 రోజులు అవుతున్న ఇప్పటివరకు ఈయన ఎక్కడున్నారు? ఏంటీ? అనే విషయాలను మాత్రం ఎవరూ బయట పెట్టలేదు. ప్రస్తుతం సన్నీ యాదవ్ కు సంబంధించిన ఎలాంటి వివరాలు బయటకు రాకపోవడంతో అసలు ఈయన ఎక్కడున్నారనే సందేహాలు ప్రతి ఒక్కరికి కలుగుతున్నాయి.
ఇలా భయ్యా సన్నీ యాదవ్ ఎక్కడ అంటూ ఎంతోమంది నెటిజన్స్ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ కు పెద్ద ఎత్తున మెసేజ్ లు చేస్తున్న నేపథ్యంలో ఆయన భయ్యా సన్నీ యాదవ్ ఎక్కడ అంటూ ఒక వీడియోని షేర్ చేశారు ఇక ఈ వీడియోలో భాగంగా ఎన్నో సంచలనమైన విషయాలను బయటపెట్టారు.. అన్వేష్ మాట్లాడుతూ… అసలు భయ్యా సన్నీ యాదవ్ ను NIA అధికారులు అరెస్టు చేయలేదంటూ షాకింగ్ విషయాలను బయటపెట్టారు. ఇలా తను అరెస్టు కాకపోతే ఎక్కడికి వెళ్ళిపోయినట్టు అంటూ తన సబ్స్క్రైబర్లు కొన్ని అనుమానాలను రేకెత్తించారని అన్వేష్ తెలిపారు.
ఇలా తన సబ్స్క్రైబర్లు అనుమానం వ్యక్తం చేసిన ప్రకారం అసలు భయ్యా సన్నీ యాదవ్ ను నిజంగానే NIA అధికారులు అరెస్టు చేశారా? ఉగ్రవాదులు తనని కిడ్నాప్ చేశారా? బెట్టింగ్ కంపెనీ వాళ్లు తనని కిడ్నాప్ చేశారా? కిడ్నాప్ డ్రామా ఆడారా? అంటూ నాలుగు సందేహాలను వ్యక్తం చేశారని అన్వేష్ తెలిపారు. ఇలా భయ్యా సన్నీ యాదవ్ కనిపించకపోవడంతో ఈ సందేహాలు వ్యక్తం అవుతున్నాయని ఈయన మరొక వీడియో ద్వారా బయటపెట్టారు. నిజానికిNIA అధికారులు తనని కిడ్నాప్ చేసినట్టు కేవలం 25% మాత్రమే ఆధారాలు ఉన్నాయని అన్వేష్ తెలిపారు.. ఇప్పటివరకు కేవలం న్యూస్ ఛానల్ లో మాత్రమే తనని NIA అదుపులోకి తీసుకుంది అంటూ వార్తలు వచ్చాయి తప్ప ఇప్పటివరకు ఎక్కడ అధికారికంగా తెలియజేయలేదు .
NIA అరెస్టు చేయలేదా…
ఇలా సన్నీ యాదవ్ ను NIA అరెస్టు చేశారు అంటూ తన చెన్నై జాంగ్ జింగ్రి దోస్త్ చెబితే తప్ప ఈ విషయం వెలుగులోకి రాలేదని అన్వేష్ తెలిపారు. ఇలా అధికారులు నిజంగానే తనని కిడ్నాప్ చేశారా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే పాకిస్తాన్ కు ఇటీవల పెద్ద ఎత్తున టూర్లు వెళ్లడం అక్కడ ఉన్నటువంటి వారికి ఈయన మెడిసిన్స్ సప్లై చేయటం, అలాగే కొన్ని మతపరమైనటువంటి సమావేశాలలో పాల్గొనడం జరిగింది. ఈ విషయాలన్నింటిని కూడా సన్నీ యాదవ్ స్వయంగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేశారు.
ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారా…
ఇలా ఉగ్రవాదులకు సంబంధించినటువంటి సమాచారం సన్నీ యాదవ్ దగ్గర ఉన్న నేపథ్యంలో ఈయన ఆ సమాచారాన్ని ఎక్కడ బయటపెడతారోనని ముందుగానే ఉగ్రవాదులు తనని కిడ్నాప్ చేసి ఉంటారని అన్వేష్ తన సందేహాలను బయట పెట్టారు. ఇకపోతే బెట్టింగ్ యాప్స్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు డబ్బు తీసుకుని వాటిని ప్రమోట్ చేయకుండా ఉండిపోయాడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకపోవడంతో తిరిగి ఆ డబ్బును పొందటంకోసం ఎవరైతే తనకు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయమని అవకాశం కల్పించారో వారే తనని కిడ్నాప్ చేసి ఉండవచ్చని సందేహాలు వ్యక్తం చేశారు.
అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడా…
ఇక చివరిగా ఈ విషయాలన్నింటి నుంచి బయటపడటం కోసం సన్నీ యాదవ్ ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఎందుకంటే తన కొడుకు కనిపించకపోయినా తండ్రి మాత్రం చాలా ధీమాగా ఎలాంటి బాధ లేకుండా బయట కనపడుతున్నారు. తన తమ్ముడు కూడా అలాగే తన పనులను చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో సన్నీ యాదవ్ ఈ వ్యవహారం నుంచి బయటపడటం కోసమే ఇలా డ్రామా ఆడుతున్నారు అంటూ అన్వేష్ పలు విషయాలను బయటపెడుతూ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సంచలనంగా మారింది.