AP Schools Reopen 2025: ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు ఈసారి చదువు ప్రారంభం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. సాధారణంగా సమ్మర్ హాలీడేలు ముగిసాక స్కూల్‌కు వెళ్లాలంటే కొంత ఒత్తిడి, కొంత అలసటగా పిల్లలు ఫీల్ అవుతారు. కానీ ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. ఎందుకంటే.. ఈసారి స్కూల్ ఫస్ట్ డే అంటే గిఫ్ట్ డే. అది కూడా ప్రభుత్వం ఇచ్చే స్పెషల్ గిఫ్ట్ విద్యార్థి మిత్ర కిట్!
జూన్ 12న ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. స్కూల్ మొదటి రోజునే విద్యార్థుల చేతికి వారి చదువుకు కావలసిన అన్ని వస్తువులూ సిద్ధంగా ఉండబోతున్నాయి. చదువు ప్రారంభానికి ఇది ఒక మంచి మొదలవుతుంది.
విద్యార్థి మిత్ర కిట్‌లో ఏముంటుంది?
ఈ కిట్‌లో పిల్లలకి అవసరమైన ప్రతీ వస్తువూ ఉంది. నాణ్యమైనవి, అందరికీ ఒకే విధంగా తయారు చేసినవి. ఈ కిట్‌లో రెండు జతల స్కూల్ యూనిఫాంలు, బెల్ట్, స్కూల్ బ్యాగ్, బూట్లు, సాక్సులు, నోట్‌బుక్స్, పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్స్, ఇంగ్లీష్ డిక్షనరీ ఇవన్నీ ఉంటాయి. ఇవి అందరూ పిల్లలకు ఒకే నాణ్యతతో, ఒకే తరహాలో ఇవ్వడం వల్ల సమానత అనే భావన పెరుగుతుంది. ఎవరూ తక్కువ, ఎవరూ ఎక్కువ అనే భావన లేకుండా పిల్లలందరూ సమానంగా అనిపించుకోవడం గొప్ప విషయం.
ఒక్కో కిట్ కోసం రూ.2,279 ఖర్చు
రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విద్యార్థి కిట్ కోసం రూ.2,279 ఖర్చు చేస్తోంది. ఇది చిన్న మొత్తం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులకు ఈ కిట్‌లను సరఫరా చేయడం అనేది పెద్ద కార్యక్రమం. ప్రభుత్వం వినియోగిస్తున్న నిధులు నేరుగా పిల్లల చదువుపై ఖర్చవడం, వారి భవిష్యత్తు బలోపేతానికి దోహదపడుతోంది.
ముందుగానే సరఫరా.. చివరి తేది జూన్ 20
జూన్ 12న పాఠశాలలు ప్రారంభమైన తర్వాత జూన్ 20లోపు అన్ని విద్యార్థులకు విద్యార్థి మిత్ర కిట్ పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం హెచ్ఎంలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే వివిధ మండలాలకు కావలసిన వస్తువులను అధికారులు పంపించారు. కొన్ని ప్రాంతాల్లో అయితే స్కూల్ మొదటి రోజునే పిల్లలకు కిట్‌లు అందేలా ఏర్పాట్లు చేశారని సమాచారం.
స్కూల్ మొదటి రోజే ప్రత్యేక వేడుకలా..
కొన్ని స్కూల్స్‌లో పిల్లల అభిరుచి మేరకు స్పెషల్ ఈవెంట్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. మొదటి క్లాస్‌కు ముందే పిల్లలకు కిట్ అందించడం, కొత్త వస్తువులతో సెల్ఫీలు తీయడం, టీచర్లు చిన్న స్పీచ్‌లు ఇవ్వడం లాంటి కార్యక్రమాలు పిల్లల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. పెద్దవాళ్లు మాసాలా డబ్బా కానుకలెందుకైతే ఎదురుచూస్తారో, చిన్నారులు ఇప్పుడు ఈ కిట్ కోసం అంతే ఆసక్తిగా ఉన్నారు.
Also Read: Visakha Tourism: విశాఖకు వెళ్లారా? ఇక్కడికి వెళ్లకుంటే ఇంకెందుకు?
చదువుతో పాటు గౌరవం కూడా..
ఈ కిట్ విద్యార్థులకు కేవలం సామగ్రి గిఫ్ట్ మాత్రమే కాదు. ఇది వారి మీద ప్రభుత్వం పెట్టిన నమ్మకాన్ని తెలియజేసే చిహ్నం. పేద కుటుంబాలకు ఇది ఒక విధంగా పెద్ద ఊరటనిచ్చే కార్యక్రమం. కొత్త షూస్, నోట్‌బుక్స్, యూనిఫామ్‌తో పిల్లలు చదువుకు మరింతగా ఆకర్షితులవుతారు. వాళ్లలో తక్కువతనం అనే భావన తొలగిపోతుంది.
చదువుకే కాదు సమానత్వానికి కూడా మార్గం
ఇలాంటి కిట్‌లు అందించడం వల్ల పిల్లల మధ్య సమానత్వం పెరుగుతుంది. బడిపంతులు, కుల, వర్గ వివక్షలు లేకుండా ఒకే తరహా బట్టలు, ఒకే విధంగా ఉన్న బుక్స్, బ్యాగ్స్ ఉండడం వల్ల సమాజంలో సమానత్వ భావన పుట్టే అవకాశం ఉంది. ఇది చిన్న వయస్సులోనే మంచి విలువలను నేర్పే అవకాశం కూడా అని చెప్పవచ్చు.
ఫస్ట్ స్టూడెంట్ ఎవరు?
ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఒక ఆసక్తికరమైన ప్రశ్న.. స్కూల్ ఫస్ట్ డే న ‘విద్యార్థి మిత్ర కిట్’ ను ఫస్ట్ తీసుకునే విద్యార్థి ఎవరు? అతని ముఖంలో కనిపించే ఆనందం, అహ్లాదం అందరికీ ప్రేరణగా మారనుంది. కొన్ని పాఠశాలల్లో మొదటి విద్యార్థికి ప్రత్యేక అభినందనలూ ప్లాన్ చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం విద్యా రంగంలో సమానతను సాధించడమే కాదు, విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో కీలకపాత్ర పోషించనుంది. పాఠశాలలు మొదలవుతాయి అంటే భయపడే రోజులు పోయాయి. ఇప్పుడు పిల్లలకి స్కూల్ అంటే కొత్త గిఫ్ట్, కొత్త ఉత్సాహం, కొత్త కలల దారి. పాఠశాల మొదటి రోజే ఈ గిఫ్ట్ అందుకునే విద్యార్థి ముఖంలో కనిపించే ఆనందమే ఈ పథక విజయానికి పునాది.