BigTV English

NTRNeel : షూటింగ్ కి అంతా సిద్ధం, అదిరిపోయే ఫోటోతో అప్డేట్

NTRNeel : షూటింగ్ కి అంతా సిద్ధం, అదిరిపోయే ఫోటోతో అప్డేట్

NTRNeel : ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న సంచలన దర్శకులలో ప్రశాంత్ నీల్ ఒకరు. కే జి ఎఫ్ సినిమాతో తన సత్తా ఏంటో చూపించాడు ప్రశాంత్. ఆ తర్వాత కేజిఎఫ్ 2 సినిమాతో కలెక్షన్లు మోత మోగించాడు. ఇప్పుడు ప్రశాంత్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటేనే ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. ప్రశాంత్ చూడటానికి చాలా సైలెంట్ గా కనిపించిన థాట్స్ మాత్రం చాలా వైలెంట్ గా ఉంటాయి. ఒక కమర్షియల్ సినిమాలో ఎటువంటి అంశాలు ఉండాలి, ఇటువంటి సీన్స్ హై ఇస్తాయి అని బాగా తెలిసిన దర్శకుడు ప్రశాంత్. అందుకే ప్రభాస్ తో సలార్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా కొట్టి కలెక్షన్ల వర్షం కురిపించాడు. ఇప్పుడు ఎన్టీఆర్ తో మరోసారి బాక్సాఫీస్ షేక్ చేయడానికి సిద్ధమవుతున్నాడు.


షూటింగ్ అంతా సిద్ధం

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమాను చేయబోతున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే వాటన్నిటినీ నిజం చేస్తూ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. ఈ సినిమాకి డ్రాగన్ అనే ఒక టైటిల్ను ఖరారు చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. దీని గురించి అధికారిక ప్రకటన రాకపోయినా కూడా ఇది ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిపోయింది అని చెప్పాలి. దీని కారణం రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే డ్రాగన్ సినిమా గురించి నేను ఎదురు చూస్తున్నాను అంటూ ఎస్ఎస్ రాజమౌళి టైటిల్ రిలీజ్ చేయడం. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ రేపటి నుంచి మొదలు కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.


సముద్రపు ఒడ్డున

రీసెంట్ టైమ్స్ లో సముద్రానికి ఎన్టీఆర్ కి ఎంత అనుబంధం ఏర్పడిందో దేవర సినిమాతో తెలిసి వచ్చింది. ఆ సినిమా అంతా కూడా సముద్రం బ్యాక్ గ్రౌండ్ లోనే జరుగుతుంది. ఇప్పుడు కూడా ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ సముద్రపు ఒడ్డున నిలుచుని ఉన్న ఒక ఫోటోను విడుదల చేసి రేపటి నుంచి షూటింగ్ మొదలుకానున్నట్లు తెలిపారు. ఇక ఎన్టీఆర్ ఈ సినిమా గురించి ఫిజికల్ గా చాలా వర్కౌట్ చేశాడు. చాలా సన్నగా కనిపిస్తున్నాడు. ఇక ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ లో ఉన్న మాస్ యాంగిల్ ను ఏ రకంగా బయటకు తీస్తాడో వేచి చూడాలి. ఎన్టీఆర్ కి ఉన్న మాస్ ఇమేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా చిన్న ఏజ్ లోనే ఎన్నో మాస్ ఎలిమెంట్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశాడు ఎన్టీఆర్.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×