E-Paper
Advertisement

NTR Dragon: ఎన్టీఆర్ డ్రాగన్ చిత్రంలో హాట్ హీరోయిన్.. ఎవరంటే..?

NTR Dragon: ఎన్టీఆర్ డ్రాగన్ చిత్రంలో హాట్ హీరోయిన్.. ఎవరంటే..?
Advertisement

NTR Dragon:ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ (NTR) రేంజ్ భారీగా పెరిగిపోయిందనటంలో సందేహం లేదు. ఇటు సౌత్, నార్త్ తో పాటు హాలీవుడ్ రేంజ్ లో పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన ప్రస్తుతం కే జి ఎఫ్ (KGF 1,2) )సినిమాలతో సంచలనం సృష్టించి, కన్నడ ఇండస్ట్రీకి ఒక పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపును అందించిన ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే టైటిల్ తో సినిమా చేస్తున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ గా పేరు సొంతం చేసుకున్న ఎన్టీఆర్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే సినిమా నుంచి వరుస అప్డేట్స్ అభిమానులలో అంచనాలు పెంచేస్తున్నాయి.

ఎన్టీఆర్ తో రొమాన్స్ కి సిద్ధమైన శ్రద్ధా కపూర్..

Advertisement

ఈ క్రమంలోనే ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) అవకాశాన్ని అందుకుందని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ కూడా ఉంటుందని, ఆ పాత్ర కోసం ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) ను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సినీవర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా శ్రద్ధా కపూర్ పాత్ర సెకండ్ హాఫ్ లో ఉంటుందని, ఆ పాత్ర సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలుస్తుందని సమాచారం. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం డ్రాగన్ సినిమాలో శ్రద్ధా కపూర్ భాగం కాబోతోంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒకవేళ ఇదే వార్త నిజమైతే మాత్రం ఎన్టీఆర్, శ్రద్ధ జోడి తెరపై అదిరిపోతుందంటూ అభిమానులు కూడా ఊహించేసుకుంటున్నారు.

శ్రద్ధా కపూర్ కెరియర్..

Advertisement

శ్రద్ధా కపూర్ విషయానికి వస్తే.. ప్రముఖ నటిగా, గాయకురాలిగా మంచి పేరు సొంతం చేసుకుంది. 2010లో వచ్చిన ‘టీన్ పట్టి’ సినిమా ద్వారా చిన్న పాత్ర చేసి కెరీర్ ఆరంభించిన ఈమె.. 2011లో వచ్చిన ‘లవ్ కా ది ఎండ్’ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈమె ఎవరో కాదు ప్రముఖ నటుడు శక్తి కపూర్ (Shakti Kapoor)కుమార్. ఇక 2013లో విడుదలైన ‘ఆషికి 2’ సినిమాలో గాయని పాత్రలో నటించి, తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాదు ఈ సినిమాలో ఈమె నటనకు ఉత్తమ నటి విభాగంలో ఫిలింఫేర్ పురస్కారం లభించింది. బాలీవుడ్లో పలు చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె సొంతంగా ఫ్యాషన్ డిజైనింగ్ స్టోర్ ని కూడా ప్రారంభించింది. అంతేకాదు స్టేజ్ షోలలోను, కచేరీలలోనూ పాల్గొంటూ ,పాటలు పాడుతూ తన స్వరాన్ని అందరికీ పరిచయం చేస్తోంది. ఇక తన సినిమాలలో తాను నటించడమే కాకుండా చాలా సినిమాలలో పాటలు కూడా పాడింది. అంతేకాదు చాలా బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తోంది శ్రద్ధా కపూర్.

also read:Asin: అసిన్ భర్త చేసిన తప్పు.. రూ .1000 కోట్లకు పైగా నష్టం..!

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×