Shraddha Kapoor : పాన్ ఇండియా స్టార్స్ లిస్ట్ లో అల్లు అర్జున్ (Allu Arjun) తో పాటు ఎన్టీఆర్ (Jr NTR) కూడా ఉన్నారు. ఈ ఇద్దరు హీరోలతో కలిసి నటించడానికి ఆఫర్ల కోసం ఎంతోమంది స్టార్ హీరోయిన్లు వేయి కళ్లతో ఎదురు చూస్తూ ఉంటారు. కానీ బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) మాత్రం బన్నీ వద్దు, ఎన్టీఆర్ ముద్దు అంటుందట.
ఎన్టీఆర్ కు గ్రీన్ సిగ్నల్
రీసెంట్ గా ‘స్త్రీ 2’ మూవీతో బిగ్గెస్ట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్. ఈ మూవీతో శ్రద్ధ కపూర్ ఏకంగా 500 కోట్ల క్లబ్లో చేరింది. మోస్ట్ అవైటింగ్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వార్ 2’ సినిమాలో శ్రద్ధా కపూర్ ఐటమ్ సాంగ్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలోనే ఈ బ్యూటీకి పలు సినిమాలలో ఐటమ్ సాంగ్స్ లో నటించే ఆఫర్ రాగా, అప్పట్లో ఆమె రిజెక్ట్ చేసింది. కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమాలో నటించడానికి శ్రద్ధా కపూర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
పుష్ప రాజ్ కు నో
నిజానికి శ్రద్ధ కపూర్ ‘సాహూ’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. కాకపోతే ప్రభాస్ నటించిన ఈ పాన్ ఇండియా మూవీ పెద్దగా ఆడక పోవడంతో, ఈ బ్యూటీకి ఆ తర్వాత తెలుగు సినిమాలలో నటించే ఛాన్స్ రాలేదు. అయినప్పటికీ శ్రద్ధ కపూర్ కి భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’లో స్పెషల్ సాంగ్ కోసం ఆమెను సంప్రదించినట్టు గతంలో పుకార్లు వచ్చాయి. కానీ రెమ్యూనరేషన్ విషయంలో విభేదాల కారణంగా ఆమె ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. చివరికి ఆ గోల్డెన్ ఛాన్స్ ని అందుకుని, థియేటర్లలో ఆకట్టుకుంది శ్రీలీల .
ఈ నేపథ్యంలోనే శ్రద్ధా కపూర్ బన్నీకి నో చెప్పి, ఎన్టీఆర్ నటిస్తున్న ‘వార్ 2’ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సంచలనగా మారింది. అయితే ఈ మూవీలో నటించడానికి ఆమె అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి మేకర్స్ సిద్ధంగా ఉన్నారని, అందుకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం శ్రద్ధ ‘వార్ 2’ తారాగణంలో త్వరలో చేరబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమె ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరు హీరోలతో కలిసి ఓ అద్భుతమైన ఐటమ్ సాంగ్ చేయబోతుందని అంటున్నారు.
అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ‘వార్ 2’పై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. మరి శ్రద్ధ కపూర్ ఇందులో ఐటమ్ సాంగ్ చేయబోతుందని వస్తున్న వార్తలు కనక నిజమైతే, టాలీవుడ్ లో ఆమె పాపులారిటీ మరింత పెరిగే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఇటు ఎన్టీఆర్, అటు హృతిక్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.