Chilkuru Balaji Temple Rangarajan: ఆయన నిరంతరం హిందూ ధార్మికత అంశాలను చాటిచెబుతుంటారు. నిరంతరం ఆలయానికి వచ్చే భక్తులకు ఆయనిచ్చే గౌరవంలో ఏ మాత్రం కొరత ఉండదు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు హిందూ ధార్మికత అంశాలపై వివరించడం, శాంతియుత జీవితం, ఇలాంటి ఎన్నో భక్తిపరమైన అంశాలపై వివరిస్తూ ఈయన తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకున్నారు, అంతేకాదు సనాతన ధర్మ పరిరక్షణకు నడుంబిగించిన అర్చకులుగా చెప్పవచ్చు. అటువంటి ఆలయ అర్చకులపై దాడి.. అది కూడ ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 20 మంది వరకు. ఈ దాడి ఘటనను ఇప్పుడు యావత్ దేశం ఖండిస్తోంది. ఈ దాడి ఘటన వెనుక మర్మం ఇదేనని ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.
చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్ పై దాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. దాడి జరిగిన కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. దాడికి పాల్పడ్డ వ్యక్తులలో ప్రధానంగా వీర రాఘవరెడ్డి పేరు వినిపిస్తోంది. ఈయన రామ రాజ్య స్థాపన పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి, దానిని బలోపేతం చేసే దిశగా ఈ దాడికి పాల్పడినట్లు పోలీసుల వద్ద ఉన్న సమాచారం. కానీ అసలు చిలుకూరు బాలాజీ అర్చకులనే వీర రాఘవరెడ్డి ఎందుకు ఎంచుకున్నారన్నదే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. అది కూడ దాడికి పాల్పడి హితబోధ చేసినట్లుగా వీడియోలను రికార్డ్ చేయడం వెనుక అసలు కథ ఇదేనని హిందూ ధార్మిక సంఘాలు సోషల్ మీడియా వేదికగా ప్రచారం సాగిస్తున్నాయి.
అసలు కారణం ఇదేనా?
చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్ నిరంతరం వార్తల్లో ఉంటారు. ఏదోక అంశంపై మాట్లాడుతూ ధార్మికతను చాటిచెబుతుంటారు. అంతేకాదు ఈయన అర్చకులుగా కొనసాగుతున్న ఆలయం ఎంతో ఫేమస్. ఈ ఆలయానికి వచ్చి ఇక్కడి స్వామి వారిని దర్శించుకుంటే చాలు, సకల కోరికలు సిద్దిస్తాయని భక్తుల విశ్వాసం. అది కూడ ఇక్కడ పూజలో పాల్గొంటే ఎన్నో ఏళ్లుగా రాని వీసాలు కూడ సకాలంలో అందుతాయన్నది భక్తుల నమ్మకం. అందుకే కాబోలు ఈ ఆలయం ఎప్పుడూ.. భక్తులతో నిరంతరం కిటకిటలాడుతూ ఉంటుంది. అటువంటి ఆలయ అర్చకులుగా రంగరాజన్ కొనసాగుతున్నారు. ఇక్కడి భక్తులకు నిరంతరం అందుబాటులో ఉంటూ.. భక్తుల మనస్సులో తనకంటూ ప్రత్యేక స్థానం ఈయనది. అంతేకాదు ఏదైనా హిందూ ధార్మిక అంశాలపై గుక్క తిప్పుకోకుండ ప్రసంగించడంలో ఆయనకు ఆయనే సాటి. మీడియాలో కూడ ఏదొక అంశంపై మాట్లాడడంలో ఎప్పుడూ ముందుంటారు.
తెలంగాణలోనే కాక ఇతర రాష్ట్రాలలో కూడ రంగరాజన్ కు భక్తులలో ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్ ను బట్టే రామ రాజ్య స్థాపన సంఘం రాఘవరెడ్డి.. తన సంఘం బలోపేతం కోసం రంగరాజన్ ను ఎంచుకున్నట్లు ప్రచారం సాగుతోంది. అది కూడ ప్రచారం అవుతున్న వీడియోలో.. ఉగాది వరకే టైమ్.. అప్పటిలోగా మాకు మద్దతు పలకాలి లేకుంటే మీ ఇష్టం అంటూ వార్నింగ్ ఇచ్చిన దృశ్యాలు కూడ ప్రచారంలో ఉన్నాయి. రామ రాజ్య స్థాపన కోసం అంటే.. ఏదైనా కార్యక్రమాల ద్వార ప్రచారం సాగించాలి కానీ, ఇలా దాడులకు పాల్పడి మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేయడం ఏమిటని పలు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలోని గోదావరి జిల్లాలకు చెందిన వ్యక్తిగా వీర రాఘవరెడ్డిని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. తన సంఘం బలోపేతం కోసం సహకరించాలని అడిగి, అందుకు నిరాకరిస్తే దాడికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం.
Also Read: Lucky Zodiac Signs 2025: 6 గ్రహాల అద్భుత కలయిక.. ఈ రాశుల వారు మట్టి ముట్టుకున్నా బంగారమే !
అయితే అర్చకులు రంగరాజన్ కు ఉన్న ఫేమ్ ఆధారంగా సాధ్యమైనంత త్వరగా తన సంఘం బలోపేతం అవుతుందని భావించే వీర రాఘవరెడ్డి ఈ దారుణానికి పాల్పడినట్లు, రంగరాజన్ చెబితే చాలు ఎందరో భక్తులు సంఘంలో చేరడం ఖాయమనే భావనతో దాడికి పాల్పడడం. అలాగే వీడియోను రిలీజ్ చేయడం ద్వార సమాజానికి తన బలమేంటో తెలపాలన్నది రహస్య అజెండా అంటూ పలు సంఘాలు ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏదిఏమైనా ఇటువంటి దారుణ ఘటనలు మరెక్కడా జరగకుండా, దాడికి పాల్పడిన వారిని చట్టరీత్యా కఠినంగా శిక్షించాలని భక్తులు కోరుతున్నారు.