వైసీపీలో నెంబర్-2గా వెలుగొందిన విజయాసాయిరెడ్డి
వైసిపి ప్రారంభ నుండి పార్టీలో నెంబర్ టూ గా వ్యవహరించిన విజయసాయి రెడ్డి 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలోనే కాకుండా ప్రభుత్వంలో కూడా సీఎం తర్వాత సీఎం లాగా వ్యవహరించారు. విశాఖ సహా ఉత్తరాంధ్రలో భూకబ్జాలు, సెటిల్మెంట్లు, ఉద్యోగులపై వేధింపులకు పాల్పడ్డారన్న విమర్శలు మూట గట్టుకున్నారు. ఉత్తరాంధ్రకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు అందరూ విజయసాయిరెడ్డి గీసిన గీత దాటడానికి వీలు లేదని అప్పట్లో ఆర్డర్ కూడా పాస్ చేశారంట. ప్రభుత్వానికి సంబంధించి ఉత్తరాంధ్రలో ఏ పని కావాలన్నా, సీఎం జగన్ ను ఎమ్మెల్యేలు కలవాలన్న, నియోజవర్గ సమస్యలను జగన్ తో చెప్పాలన్నా కూడా విజయసాయిరెడ్డి అనుమతి ఉండాల్సిందే అన్నట్లు నడిచింది వ్యవహారం.
విజయసాయికి ప్రాధాన్యత తగ్గించిన జగన్
ఓటమి తర్వాత సాయిరెడ్డికి జగన్ మళ్లీ ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించారు. విజయసాయి భూకబ్జాలు, అవినీతి ఆరోపణల మీద, ఆయన కూతురుకి సంబంధించి భీమిలి సమీపంలోని సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాల విషయంలోనూ కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసే విజయ్ సాయి రెడ్డి మళ్లీ ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలకమైన నాయకుడిగా వైసీపీ నుండి రాజకీయాలు చేయడానికి సిద్ధపడితే కూటమి ప్రభుత్వం ఎంతవరకు విజయ్ సాయి రెడ్డి ఆటలు సాగనిస్తుందా? అనే చర్చ జరుగుతుంది.. అదీ కాక అప్పట్లో ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్‌గా ఉన్నప్పుడే ఎండోమెంట్ ఉద్యోగిని శాంతితో విజయసాయిరెడ్డికి సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అది తెలిసి కూడా జగన్ ఆయన్ని తిరిగి అక్కడకే పంపడంపై పెద్ద చర్చే జరిగింది.
Also Read: చంద్రబాబుకి షాక్.. తిరగబడుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు
విజయసాయి స్థానంలో ఫోకస్ అయిన సజ్జల
వాస్తవానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లకు విజయసాయిరెడ్డికి జగన్ ప్రాధాన్యత తగ్గిస్తూ వచ్చారు. ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించారు. పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న ఆయన్ని తప్పించి వైవీ సుబ్బారెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు. సాయిరెడ్డి స్థానంలో సజ్జల నెంబర్ 2గా ఫోకస్ అయ్యారు. అయితే మళ్లీ ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పజెప్పడంతో వైసీపీలో సాయిరెడ్డి హవా మళ్లీ మొదలైనట్లు కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో ట్విట్టర్లో చెలరేగిపోయే విజయసాయి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థ యజమాని రాధాకృష్ణపై ఉన్న పూకార్లన్నీ కలగలిపి పెద్ద పోస్టు పెట్టారు.
ఏబీఎన్‌కు టార్గెట్ అయిన విజయసాయిరెడ్డి
దాంతో సాయిరెడ్డి భాగోతాలన్నీ రాధాకృష్ణ మీడియా ముఖంగా బయటపెట్టారు. తెర వెనుక రాజకీయాలన్ని బహిర్గతం చేశారు. విజయసాయిరెడ్డి ఎలాంటి వాడో చెప్పేందుకు కొన్ని ఉదాహరణలు చెప్పారు. జగన్ రెడ్డి తనను దూరం పెట్టారని పలుమార్లు ఆర్కేని కలిసి విజయసాయిరెడ్డి బాధపడ్డారంట. నెల రోజుల కిందట కూడా రాధాకృష్ణని సాయిరెడ్డి వెళ్లి కలిశాడట. విజయసాయిరెడ్డి ఎలాంటి వాడో చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ఈ విషయం చెప్తున్నానని ఆయన వెల్లడించారు.
ఆ క్రమంలో విజయసాయిరెడ్డి గురించి కొన్ని కొత్త విషయాలు కూడా చెప్పుకొచ్చారు. ఆయన్ని అమిత్ షా ముఖం మీదే తిట్టేవారంట. నువ్వో మోసగాడివి అని తేల్చేశారట. జగన్ రెడ్డిని ముంచేందుకు కూడా సాయిరెడ్డి తెర వెనకున్న కుట్రలు చేస్తున్నారని అర్థం వచ్చేలా ఆర్కే వివిధ విషయాలు ప్రస్తావించారు. ఆయన జగన్ తో పాటు తనకు ఇబ్బంది అవుతుందని అనుకుంటే ఎవరితో అయినా స్నేహం చేయడానికి రెడీగా ఉంటారని పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి అందరిపై ట్వీట్లు పెట్టి తర్వాత పై వాళ్ల ఒత్తిడితో పెట్టాల్సి వచ్చిందని వారికి ఫోన్లు చేసి క్షమాపణలు చెబుతారట.
మరి ఆయన వెల్లడించిన విజయసాయి భాగోతాల విషయం పక్కనపెడితే.. సాయిరెడ్డి వెళ్లి ఆయన్ని కలిసి వచ్చారన్న అంశం జగన్‌కి డైరెట్‌గా టచ్ అయిందంట. జగన్ తరచూ ధ్వజమెత్తే మీడియా సంస్థల లిస్టులో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పేరు ముందుంటుంది. అలాంటాయన్ని సాయిరెడ్డి వెళ్లి కలవడం ఏంటి? అసలు ఆయన రాజకీయం ఏంటి? అని జగన్ ఆరా తీస్తున్నారంట. ఆ కోపంతోనే సజ్జల రామకృష్ణారెడ్డిని రాష్ట్ర పార్టీ కోఆర్డినేటర్‌గా నియిమించారంట. విజయాసాయి ఇన్చార్జ్‌గా ఉన్న ఉత్తరాంధ్ర నేతలు ఇద్దరిని పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా నియమించి వారిని పార్టీలో ఆయనకి బాసుల్నీ చేశారంట. మరి మున్ముందు వైసీపీలో సాయిరెడ్డి ఇంకెంత టార్గెట్ అవుతారో చూడాలి.